Hall tickets Download
-
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
పది హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ఇలా..
నిడమర్రు: 2017–18 ఈనెల 15 నుంచి 29 వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాలో 239 పరీక్ష కేంద్రాల్లో 50,423 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా కారణం చేత / ఫీజు చెల్లించలేదని సంబంధిత పాఠశాల నుంచి హాల్ టికెట్లు పొందలేని విద్యార్థులు వారి హాల్ టికెట్స్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. హాల్ టికెట్స్ ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.. కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు తదితర సమాచారం తెలుసుకుందాం. డౌన్లోడ్ ఇలా.. ♦ www.bre.ap.orf అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. వెబ్సైట్ ముఖ చిత్రంలో ఎడమవైపు ‘క్విక్ లింక్స్’ అనే కాలంలో ఎస్ఎస్సీ మార్చి– 2018 హాల్‌టికెట్స్ క్లిక్ చెయ్యాలి. తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ రెగ్యులర్/ ప్రైవేట్/ ఓరియంటల్/ ఒకేషనల్ హాల్ టికెట్స్ అని నాలుగు కాలమ్స్ కనిపిస్తాయి. అక్కడ సంబంధిత కాలమ్ వద్ద క్లిక్ చెయ్యాలి. ♦ మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ జిల్లా, స్కూల్, నేమ్ ఎంటర్ చెయ్యాలి. వివరాలు నమోదు చేశాక డౌన్లోడ్ హాల్ టికెట్ వద్ద క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడు అవుతుంది. ♦ జిల్లాలోని అన్ని స్కూల్స్, వాటి కోడ్స్, పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల లిస్ట్ ఈ లింక్ వద్ద పొందుపర్చి ఉంటాయి. దీంతో వివరాలు నమోదు చెయ్యడం చాలా సులభం. ♦ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్‌పై ఆయా పాఠశాల హెచ్ఎం సంతకం, పాఠశాల ముద్ర తప్పనిసరి. విద్యార్థులకు సూచనలు ♦ హాల్ టికెట్స్‌లో సూచించిన విధంగా ఆయా తేదీ / సబ్జెక్ / పేపర్ ప్రకారం పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలి. ♦ హాల్ టికెట్లో పొందుపరిచిన పరీక్షా కేంద్రాన్ని విద్యార్థి ఒకరోజు ముందుగా సందర్శించి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటే మంచింది. ♦ మీరు ప్రతి రోజు మీఇల్లు / స్కూల్ నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం, పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది. రవాణా సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి తదితర విషయాలు ముందుగా అంచనా వేసుకోవడం ఉత్తమం. ♦ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతిస్తారు. అనంతరం ఓఎంఆర్ షీట్, ఆన్షీట్ అందిస్తారు. ఈ రెండిటినీ కలిపి ఇన్విజిలేటర్ సూచనల ప్రకారం పిన్ చెయ్యాలి. ♦ 9.30 గంటలకు విద్యార్థులకు ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రం అందిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు తీసుకుంటారు. పరీక్ష రాసేం దుకు 2.45 గంటల సమయం ఉంటుంది. ప్రశ్నాపత్రాలు సీసీఈ మాదిరిలో ఉండటంతో ఈ 2.45 గంటల సమయంలో, మొదటి 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదువుకుని అవగాహన చేసుకునేందుకు కేటాయించారు. ♦ ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలు, ఓఎంఆర్ షీటు వెసుక భాగంలో ఉన్న సూచనలు ఒకసారి చదువుకోవాలి ♦ ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైన కూడా హాల్ టికెట్ నంబర్, పేరు ఎట్టిపరిస్థితిల్లోనూ రాయకూడదు. ♦ ఓఎంఆర్ షీటు ఏదైనా కారణం చేత పాడైతే, వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకు వెళ్లాలి. అప్పుడు సిబ్బంది నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ అందిస్తారు. ♦ ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం, నలపడం లాంటి చర్యలు చేయకూడదు. ♦ విద్యార్థి చూచిరాతకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఆ విద్యార్థిపై జీఓ 872 ప్రకారం తరువాత జరిగే పరీక్షలు రాసేందుకు వీలుండదు. అలాగే శాఖాపరమైన చర్యలు ఆవిద్యార్థిపై తీసుకుంటారు. ♦ భవిష్యత్తులో విద్యా / ఉద్యోగ అవసరాల దృష్ట్యా పరీక్షలు అనంతరం కూడా హాల్ టికెట్స్ జాగ్రత్త పరుచుకోవాలి. ♦ పాఠశాల నుంచి అందిన / ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్స్లో ఏమైనా లోపాలు కనిపిస్తే తక్షణం సంబంధిత హెచ్ఎం/పరీక్ష కేంద్రం పర్యవేక్షకుని దృష్టికి తీసుకువెళ్లాలి. ♦ అన్ని పరీక్షలకు పార్ట్–బి (బిట్ పేపర్) పరీక్ష చివరి అరగంట ముందుగా ఇస్తారు. అయితే మిగిలిన తెలుగు, ఇంగ్లిషు పేపర్లకు పార్టీ–ఎ తోపాటే పార్ట్–బి ముందుగానే ఇస్తారు. విద్యార్థులు గమనించాలి. -
వెబ్సైట్లో.. ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు
30న పరీక్ష... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నోఎంట్రీ హైదరాబాద్, న్యూస్‌లైన్: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 42 నగరాల్లోని 349 కేంద్రాల్లో ఈ నెల 30న నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు www.apedcet.org వెబ్సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని, సమాధానాలను హెచ్‌బీ పెన్సిల్‌తో మాత్రమే గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్‌పై ఫొటో రాని పక్షంలో విద్యార్థులు తమ వెంట గెజిటెడ్ అధికారి సంతకం చేసిన రెండు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు. ఈదఫా ఎడ్‌సెట్‌కు 1,65,781 మంది దరఖాస్తు చేయగా, ఉర్దూ మాధ్యమం వారికి కర్నూలు, హైదరాబాద్‌లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నారు. -
నేటి నుంచి పీజీ-ఈసెట్ హాల్‌టికెట్లు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న పీజీ ఈసెట్-2014 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 1.17 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. -
వెబ్సైట్లో ఎంసెట్ తాజా షెడ్యూలు
మే 22న రాతపరీక్ష.. జూన్ 9న ర్యాంకుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 తాజా షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల డౌన్లోడ్, రాత పరీక్ష సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందేలా ఏర్పాట్లు చేసింది. తొలుత మే 17న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినా, ఎన్నికల కౌంటింగ్ 16న ఉండటం.. కొన్నిచోట్ల 17న కూడా కొనసాగే పరిస్థితులుంటాయనే ఆలోచనతో పరీక్షను మే 22కి వాయిదా వేసిన సంగతి తెలి సిందే. దీంతో హాల్‌టికెట్ల డౌన్లోడ్, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ర్యాంకు ల వెల్లడి వంటి తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా షెడ్యూల్, ఇతర వివరాలు ఎంసెట్ వెబ్సైట్(http://apeamcet.org) నుంచి పొంద వచ్చు. కాగా మే 22న బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష ఉన్నప్పటికీ, ఎంసెట్ పరీక్ష తేదీని మార్చే అవకాశం లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలి పారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలదృష్ట్యా బిట్‌శాట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాస్తామన్నారు. ఇదీ ఎంసెట్ తాజా షెడ్యూల్... 4-4-2014: ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 6-4-14 నుంచి 13-4-14 వరకు: సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 18-4-14: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 25-4-14: పరీక్ష కేంద్రాల ఖరారు, హాల్‌టికెట్ల జనరేషన్ 25-4-14: రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 8-5-14 నుంచి 19-5-14 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 8-5-14: రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 19-5-14: 10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 22-5-14: ఎంసెట్ రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచిఒంటి గంట వరకు ఇంజనీరింగ్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంట ల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ 24-5-14: ప్రాథమిక కీ విడుదల 31-5-14 వరకు: కీపై అభ్యంతరాల స్వీకరణ 9-6-14: ర్యాంకుల వెల్లడి