Egor Tarabasov
-
కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే!
లండన్: కాబోయే భర్త తనకు క్షమాపణ చెప్పాలని హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ డిమాండ్ చేసింది. రష్యాకు చెందిన యువ వ్యాపారవేత్త ఈగోర్ తారాబసోవ్ తో ఆమెకు కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే గత నెలలో ఏదో విషయమై బీచ్ లో వీరిద్దరూ గొడవపడ్డారు. మిక్నాస్ లోని బీచ్ లో అందరి ముందు పబ్లిగ్గానే ఒకరినొకరు దూషించుకున్నారు. గొడవ జరిగినప్పటి నుంచి వీరిద్దరూ చెరో దారి అన్నట్లుగా ఉంటున్నారు. తనకు కాబోయే భర్త ఈగర్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలని లోహన్ చెప్పింది. తప్పు తెలుసుకుని మళ్లీ తన వద్దకు వస్తాడన్న ఉద్దేశంతోనే ఆమె తన ఎంగేజ్ మెంట్ రింగ్‌ను చేతి నుంచి తీయడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోను పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడూ తన ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించే ఫొటోలను అప్ డేట్ చేస్తూనే ఉంది. నో బాయ్ ఫ్రెండ్, స్టిల్ నీడ్ సారీ అని హ్యాష్ ట్యాగ్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ విషయాలను బట్టి చూస్తే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని స్థానిక మీడియా అభిప్రాయపడుతోంది. తారాబసోవ్ తో ప్రేమాయణం గురించి మీడియాలో తన ఇంటర్వ్యూకు గానూ రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్
లాస్ ఏంజెలెజ్: టీవీ ఇంటర్వ్యూకు హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ దాదాపు రూ. 4 కోట్లు(5 లక్షల ఫౌండ్లు) డిమాండ్ చేసిందట. అంతేకాకుండా గొంతెమ్మ కోరికలు కూడా తీర్చాలని షరతు పెట్టిందట. రష్యా ప్రభుత్వానికి 'చానల్ వన్'కు ఇంటర్య్యూ ఇచ్చేందుకు 30 ఏళ్ల లోహన్ 5 లక్షల బ్రిటీష్ పౌండ్లు డిమాండ్ చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ప్రైవేట్ విమానం, భద్రత, తన రిట్జ్-కార్లటన్ పెంట్‌హౌస్ లో బస, చేతులు, గోళ్ల కోసం విమానంలో సంరక్షకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను ఫొటో దిగేందుకు అవకాశం కల్పించాలని షరతు పెట్టింది. రష్యా యువ వ్యాపారవేత్త ఇగోర్ తారాబాసోవ్(22) తో సాగించిన అల్లరి ప్రేమాయణం గురించి చెప్పేందుకు ఇవన్నీ డిమాండ్ చేసింది. రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో 'పస్ట్ గోవోర్యత్'లో పాల్గొనేందుకు ఆహ్వానించగా ఆమె తన కోరికలు ఏకరువు పెట్టింది. ఆశ్చర్యంగా వీటిలో కొన్నింటిని నిర్వాహకులు ఆమోదించారు. అయితే తన పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో ఇగోర్ తో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్టు ఇటీవల లోహన్ వెల్లడించింది. వీరిద్దరూ గొడవపడుతూ పలుమార్లు కెమెరాకు దొరికిపోయారు.