కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే! | actress Lindsay Lohan demands apology from her ex fiance | Sakshi
Sakshi News home page

కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే!

Published Sat, Sep 3 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే!

కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే!

లండన్: కాబోయే భర్త తనకు క్షమాపణ చెప్పాలని హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ డిమాండ్ చేసింది. రష్యాకు చెందిన యువ వ్యాపారవేత్త ఈగోర్ తారాబసోవ్ తో ఆమెకు కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే గత నెలలో ఏదో విషయమై బీచ్ లో వీరిద్దరూ గొడవపడ్డారు. మిక్నాస్ లోని బీచ్ లో అందరి ముందు పబ్లిగ్గానే ఒకరినొకరు దూషించుకున్నారు. గొడవ జరిగినప్పటి నుంచి వీరిద్దరూ చెరో దారి అన్నట్లుగా ఉంటున్నారు. తనకు కాబోయే భర్త ఈగర్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలని లోహన్ చెప్పింది.

తప్పు తెలుసుకుని మళ్లీ తన వద్దకు వస్తాడన్న ఉద్దేశంతోనే ఆమె తన ఎంగేజ్ మెంట్ రింగ్ను చేతి నుంచి తీయడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోను పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడూ తన ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించే ఫొటోలను అప్ డేట్ చేస్తూనే ఉంది. నో బాయ్ ఫ్రెండ్, స్టిల్ నీడ్ సారీ అని హ్యాష్ ట్యాగ్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ విషయాలను బట్టి చూస్తే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని స్థానిక మీడియా అభిప్రాయపడుతోంది. తారాబసోవ్ తో ప్రేమాయణం గురించి మీడియాలో తన ఇంటర్వ్యూకు గానూ రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement