Lindsay Lohan
-
పాముకాటు.. మంచిదే!
హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్‌కు ట్రావెలింగ్ అంటే పిచ్చి. టైమ్ దొరికితే చాలు దేశాలు తిరిగేస్తుంది. తాజాగా ఆమె హాలీడేపై థాయ్‌లాండ్ వెళ్లింది. చల్లని సాయంత్రం. ఎంచక్కా స్విమ్మింగ్ పూల్‌లో కూర్చొని సేదతీరుతోంది. ఎక్కణ్నుంచి వచ్చిందో తెలీదు, ఓ పాము వచ్చి, ఆమె ఎడమ కాలిపై కాటు వేసింది. వెంటనే తేరుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న లిండ్సే, ప్రాణాపాయం లేకుండా సేఫ్‌గా బయటపడింది. అయితే ఇదేమీ ఇలా చెప్పుకొని వదిలేసేంత చిన్న విషయం కాదు. కొంచెం అటూ ఇటైనా ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేది. ఇదిలా ఉంటే ‘పాముకాటు ఓ రకంగా మంచికే జరిగిందిలే!’ అంటూ లిండ్సే కామెంట్ చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ‘‘థాయ్‌లాండ్ ట్రిప్ బాగా జరిగింది. ఒక్క పాముకాటెయ్యడం తప్పితే! అయినా అదీ ఒక రకంగా మంచికేనేమో! పాముకాటేస్తే అదృష్టం కలిసివస్తుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు.’’ అంటూ ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా తేల్చిపడేసింది లిండ్సే లోహన్. గతంలో ఇలాగే హాలీడేలో ఆమె చేతి వేలు సగం తెగింది. ఇంతా జరిగినా ట్రావెలింగ్ అంటే నాకున్న పిచ్చి ఎప్పటికీ తగ్గదు అంటోంది లిండ్సే లోహన్. -
కాబోయే భర్త సారీ చెప్పి తీరాల్సిందే!
లండన్: కాబోయే భర్త తనకు క్షమాపణ చెప్పాలని హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ డిమాండ్ చేసింది. రష్యాకు చెందిన యువ వ్యాపారవేత్త ఈగోర్ తారాబసోవ్ తో ఆమెకు కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే గత నెలలో ఏదో విషయమై బీచ్ లో వీరిద్దరూ గొడవపడ్డారు. మిక్నాస్ లోని బీచ్ లో అందరి ముందు పబ్లిగ్గానే ఒకరినొకరు దూషించుకున్నారు. గొడవ జరిగినప్పటి నుంచి వీరిద్దరూ చెరో దారి అన్నట్లుగా ఉంటున్నారు. తనకు కాబోయే భర్త ఈగర్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలని లోహన్ చెప్పింది. తప్పు తెలుసుకుని మళ్లీ తన వద్దకు వస్తాడన్న ఉద్దేశంతోనే ఆమె తన ఎంగేజ్ మెంట్ రింగ్‌ను చేతి నుంచి తీయడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోను పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడూ తన ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించే ఫొటోలను అప్ డేట్ చేస్తూనే ఉంది. నో బాయ్ ఫ్రెండ్, స్టిల్ నీడ్ సారీ అని హ్యాష్ ట్యాగ్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ విషయాలను బట్టి చూస్తే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని స్థానిక మీడియా అభిప్రాయపడుతోంది. తారాబసోవ్ తో ప్రేమాయణం గురించి మీడియాలో తన ఇంటర్వ్యూకు గానూ రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఇంటర్వ్యూకు 4 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్
లాస్ ఏంజెలెజ్: టీవీ ఇంటర్వ్యూకు హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ దాదాపు రూ. 4 కోట్లు(5 లక్షల ఫౌండ్లు) డిమాండ్ చేసిందట. అంతేకాకుండా గొంతెమ్మ కోరికలు కూడా తీర్చాలని షరతు పెట్టిందట. రష్యా ప్రభుత్వానికి 'చానల్ వన్'కు ఇంటర్య్యూ ఇచ్చేందుకు 30 ఏళ్ల లోహన్ 5 లక్షల బ్రిటీష్ పౌండ్లు డిమాండ్ చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ప్రైవేట్ విమానం, భద్రత, తన రిట్జ్-కార్లటన్ పెంట్‌హౌస్ లో బస, చేతులు, గోళ్ల కోసం విమానంలో సంరక్షకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను ఫొటో దిగేందుకు అవకాశం కల్పించాలని షరతు పెట్టింది. రష్యా యువ వ్యాపారవేత్త ఇగోర్ తారాబాసోవ్(22) తో సాగించిన అల్లరి ప్రేమాయణం గురించి చెప్పేందుకు ఇవన్నీ డిమాండ్ చేసింది. రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో 'పస్ట్ గోవోర్యత్'లో పాల్గొనేందుకు ఆహ్వానించగా ఆమె తన కోరికలు ఏకరువు పెట్టింది. ఆశ్చర్యంగా వీటిలో కొన్నింటిని నిర్వాహకులు ఆమోదించారు. అయితే తన పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో ఇగోర్ తో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్టు ఇటీవల లోహన్ వెల్లడించింది. వీరిద్దరూ గొడవపడుతూ పలుమార్లు కెమెరాకు దొరికిపోయారు. -
నన్ను సెలబ్రిటీగానే చూస్తున్నారు
అంతా తనను సెలబ్రిటీగానే చూస్తున్నారని లిండ్సే లోహన్ వాపోతోంది. ఎవరూ తనను నటిగా గుర్తించడం లేదంటూ తెగ ఫీలైపోతోంది. డేవిడ్ మామెట్ రూపొందిస్తున్న ‘స్పీడ్ ది ప్లో’ చిత్రంలో నటించనున్న లిండ్సే లోహన్, నటిగా తన గత చరిత్రను మీడియా ముందు ఏకరువు పెడుతోంది. మూడేళ్ల వయసులోనే తాను బాలనటిగా తెరంగేట్రం చేసిన విషయాన్ని ఎవరూ అడగకున్నా గుర్తుచేస్తోంది. సహజత్వం కోసం.. ఇటీవలే విడుదలైన ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రం షూటింగ్లో మందుకొట్టే సన్నివేశాల కోసం హీరో వరుణ్ ధావన్ నిజంగానే పెగ్గు బిగించాడట. వరుణ్ నుంచి తాగుబోతు నటనను సహజంగా రాబట్టేందుకు ‘మెథడ్ యాక్టింగ్’ పేరిట దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అతడి చేత ఈ పని చేయించాడట. మందు అలవాటు లేని వరుణ్ షూటింగ్లో బాగా ఇబ్బంది పడ్డాడని, సన్నివేశం ముగిశాక తూలుతున్న స్థితిలో చిత్ర బృందం అతడికి ఆసరా ఇచ్చి బయటకు తేవాల్సి వచ్చిందని సమాచారం.