నన్ను సెలబ్రిటీగానే చూస్తున్నారు | I have been seen as a celebrity, not actress: Lindsay Lohan | Sakshi
Sakshi News home page

నన్ను సెలబ్రిటీగానే చూస్తున్నారు

Published Wed, Jul 16 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

నన్ను సెలబ్రిటీగానే చూస్తున్నారు

నన్ను సెలబ్రిటీగానే చూస్తున్నారు

అంతా తనను సెలబ్రిటీగానే చూస్తున్నారని లిండ్సే లోహన్ వాపోతోంది. ఎవరూ తనను నటిగా గుర్తించడం లేదంటూ తెగ ఫీలైపోతోంది. డేవిడ్ మామెట్ రూపొందిస్తున్న ‘స్పీడ్ ది ప్లో’ చిత్రంలో నటించనున్న లిండ్సే లోహన్, నటిగా తన గత చరిత్రను మీడియా ముందు ఏకరువు పెడుతోంది. మూడేళ్ల వయసులోనే తాను బాలనటిగా తెరంగేట్రం చేసిన విషయాన్ని ఎవరూ అడగకున్నా గుర్తుచేస్తోంది.
 
 సహజత్వం కోసం..
 ఇటీవలే విడుదలైన ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రం షూటింగ్‌లో మందుకొట్టే సన్నివేశాల కోసం హీరో వరుణ్ ధావన్ నిజంగానే పెగ్గు బిగించాడట. వరుణ్ నుంచి తాగుబోతు నటనను సహజంగా రాబట్టేందుకు ‘మెథడ్ యాక్టింగ్’ పేరిట దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అతడి చేత ఈ పని చేయించాడట. మందు అలవాటు లేని వరుణ్ షూటింగ్‌లో బాగా ఇబ్బంది పడ్డాడని, సన్నివేశం ముగిశాక తూలుతున్న స్థితిలో చిత్ర బృందం అతడికి ఆసరా ఇచ్చి బయటకు తేవాల్సి వచ్చిందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement