నో బికినీ... ఓన్లీ... లిప్‌లాక్ | No bikini only liplock | Sakshi
Sakshi News home page

నో బికినీ... ఓన్లీ... లిప్‌లాక్

May 13 2014 11:33 PM | Updated on Apr 3 2019 6:23 PM

నో బికినీ... ఓన్లీ... లిప్‌లాక్ - Sakshi

నో బికినీ... ఓన్లీ... లిప్‌లాక్

ఇక్కడో మాట... అక్కడో మాట చెబుతూ యుక్తిగా కెరీర్‌ని నెట్టుకొస్తోంది అందాలభామ యామి గౌతమ్.

ఇక్కడో మాట... అక్కడో మాట చెబుతూ యుక్తిగా కెరీర్‌ని నెట్టుకొస్తోంది అందాలభామ యామి గౌతమ్. ఇటీవల ఓ కోలీవుడ్ మీడియా ఇంటర్‌వ్యూలో కథ డిమాండ్ చేస్తే బికినీ వేస్తారా? అని అడిగితే -‘మోతాదు మించిన గ్లామర్‌ని నేను ఒప్పుకోను. అందంగా కనిపించడమే గ్లామర్, అలాగాక శృతి మించి వల్గారిటీ దాకా వెళ్లాల్సివస్తే సినిమానే వదులుకుంటా’ అని బల్లగుద్ది మరీ చెప్పింది యామి. ఇక్కడ్నుంచి బాలీవుడ్ సినిమా చేయడానికి ముంబయ్ వెళ్లింది.. అక్కడ ఓ ఇంటర్‌వ్యూలో పాల్గొంది.  గ్లామర్ గురించి మాట్లాడుతూ -‘కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మరి. కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్‌కు కూడా నేను రెడీ’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీన్ని బట్టి యామి... తన కెరీర్‌ని ఎంత లౌక్యంగా లాక్కొస్తుందో అర్థం చేసుకోవచ్చు.

కథానాయికలందరికీ అంతిమ లక్ష్యం బాలీవుడ్. అందులో భాగంగానే దక్షిణాదిన బెట్టుగా ఉంటూ, బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతుంటారు. యామీ సమాధానాలు అందులో భాగమే. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్‌ధావన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది తను. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. కథ రీత్యా ఆ చిత్రానికి లిప్‌లాక్ అవసరం. దాంతో దర్శకుడు లిప్‌లాక్ ప్రపోజల్ ఆమె ముందుంచాడు. అడిగిందే తడవుగా లిప్‌లాక్‌కి ఓకే చెప్పేసిందట. త్వరలోనే వరుణ్, యమీలపై ఈ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు శ్రీరామ్ రాఘవన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement