Electronic Money Order
-
మనీ ఆర్డర్... మరి రాదు
టెలిగ్రామ్ బాటలోనే ఎంఓ సేవలకు స్వస్తి సెలైంట్‌గా నిలిపేసిన తపాలా శాఖ ఎలక్ట్రానిక్ వైపు మొగ్గు చూపుతుండటమే కారణం ఎక్కడో చదువుకునే పిల్లలు... ఉద్యోగం కోసం పిల్లల్ని దూరంగా పంపి సొంత ఊళ్లో కాలం వెళ్లదీసే తల్లిదండ్రులు. వీళ్లందరి కళ్లలో సంతోషాన్నిచ్చే నేస్తం ‘మనీ ఆర్డర్’. ఈ మనీ ఆర్డర్‌ను ఆధారం చేసుకుని పుట్టిన కథలు, సినిమాలకు లెక్కేలేదు. మనీ ఆర్డర్ రాక మారిపోయిన జీవితాలకూ అంతులేదు. అలాంటి మనీ ఆర్డర్... టెక్నాలజీ విప్లవానికి బలిపశువైపోయింది. రెండు నిమిషాల్లో ఆన్లైన్లోనే డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం... బ్యాంకు ఖాతా లేకపోయినా చేతిలో ఫోనుంటే ఒకరి డబ్బు మరొకరికి బదలాయించే వెసులుబాటు... బ్యాంకుకెళ్లి నేరుగా ఎవరి ఖాతాలోనైనా డిపాజిట్ చేసే సౌకర్యం... ఇవన్నీ కలిసి మనీ ఆర్డర్‌ను మట్టికరిపించేశాయి. అందుకే... ఇక దీని అవసరం లేదని భావించిన పోస్టల్ విభాగం... చడీచప్పుడూ లేకుండా దీనికి తెరదించేసింది. అంటే... మొన్నటికి మొన్న ఆగిపోయిన టెలిగ్రామ్ సరసన మరో తపాలా నేస్తం చేరిపోయింది. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లే (ఈఎంవో), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ల (ఐఎంవో) లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఎంవో సర్వీసులను నిలిపివేశామన్నది ఇండియా పోస్ట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (ఫైనాన్స్) శిఖా మాథుర్ కుమార్ మాట. శతాబ్దం పైగా చరిత్ర.. మనీ ఆర్డర్ది 135 ఏళ్ల చరిత్ర. తపాలా శాఖ సమాచారం ప్రకారం 1880లో మనీ ఆర్డర్ వ్యవస్థను ట్రెజరీ విభాగం నుంచి పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్కు బదలాయించారు. అప్పట్లో అలహాబాద్‌లో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన రాయ్ సాలిగ్రామ్ బహదూర్ హయాంలో ఇది జరిగింది. ఆ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే. అప్పట్లో కేవలం 283 లావాదేవీలకు పరిమితం అయిన మనీ ఆర్డర్లు 1980లో వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి 10.8 కోట్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఇన్స్టంట్ మనీ ఆర్డర్లను ప్రవేశపెట్టాక 9.5 కోట్లకు తగ్గాయి. ఇప్పుడు మరింతగా పడిపోయాయి. ఆనాటి జ్ఞాపకాలు.. మనీ ఆర్డర్లను పోస్టల్ శాఖ నిలిపేయటంతో వాటితో అనుబంధంపై కొందరు సీనియర్ సిటిజన్లు స్పందిస్తూ... శ్రీకాకుళం జిల్లాలోని చిన్న గ్రామం మాది. అక్కడుండే మా కుటుంబానికి డబ్బు పంపాలంటే అప్పట్లో మనీ ఆర్డర్ తప్ప గత్యంతరం లేదు. ఇంట్లో వాళ్లంతా మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తారన్న సంగతి తెలిసి నేను ప్రతినెలా ఎన్ని పనులున్నా 4వ తేదీకల్లా ఎంఓ చేసేసేవాణ్ణి... అంటూ గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ముం బైలో సెటిల్ అయిన గోపాల రావు. ‘చాలా మందికి రెండేసి బ్యాంకు ఖాతాలుంటున్నా యి. మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. అంతా కొత్త టెక్నాలజీమయం అయిపోయిం ది. అలాంటప్పుడు పాత పద్ధతులకు కాలం చెల్లక తప్పదు కదా’ అన్నారాయన. బ్యాంకరుగా పనిచేసి రిటైరయిన సత్యనారాయణ కూడా ఇలాగే పాత స్మ ృతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పట్లో మనీఆర్డర్లు తీసుకొచ్చే పోస్ట్‌మాన్‌కి ఎంతో గౌరవం ఉండేది. కుటుంబానికి ప్రతి నెలా పంపడంతో పాటు చుట్టాలు పక్కాలు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలేమైనా జరిగితే రూ.11, రూ.21, రూ.51.. ఇలా ఎంతో కొంత మొత్తాన్ని శుభాకాంక్షలతో పంపించేవాళ్ళం’’ అంటూ వివరించారు. ‘నేను మా అమ్మానాన్నలకు డబ్బు పంపించేవాణ్ని. ఇప్పుడు మా అబ్బాయి సింపుల్‌గా మొబైల్ ఫోన్‌తో క్షణాల్లో పంపించేస్తున్నాడు’ అంటూ ప్రస్తుతం వచ్చిన మార్పును తెలియజేశారాయన. ఇన్స్టంట్ మనీ ఆర్డర్ ఇన్స్టంట్ ఎంఓ పద్ధతిలో రూ.1,000 నుంచి 50,000 దాకా డబ్బును తక్షణమే రెమిట్ చేయొచ్చు. దీనికి నిర్దిష్ట పోస్టాఫీసులను ఎంపిక చేశారు. వీటిల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రంతో పాటు ఈ-ఫారాన్ని అందజేయాలి. ఏదైనా సందేశం పంపదల్చుకుంటే అక్కడి 33 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. నగదు బదిలీ పూర్తయ్యాక... దాన్ని అందుకునే వారు (పేయీ) దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి, తమ ఐడీ ప్రూఫ్‌ను చూపించి డబ్బు తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ మొత్తాన్ని పేయీకి చెందిన సేవింగ్స్ ఖాతాలోనైనా జమ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఎంఓ నగదును నేరుగా తీసుకోవాల్సిన వ్యక్తి ఇంటికే పంపిస్తారు. గరిష్టంగా ఒకరోజులో రూ.5,000 దాకా పంపొచ్చు. 21 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఈఎంవో బుక్ చేస్తే .. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు 24 గంటల్లోపే డెలివరీ చేస్తాయి. ఈ లావాదేవీని ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ట్రాక్ చేయొచ్చు కూడా. - సాక్షి, బిజినెస్ విభాగం -
తపాలా..సేవలు భళా
పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడో... బ్యాంకుల్లోలా డబ్బులు వేయొచ్చు.. తీయొచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారొచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖంగా తన సేవలను విస్తరించింది. తపాలా శాఖ ప్రస్తుతం ఏయే సేవలు... ఎలా అందిస్తోంది తదితర వివరాలు మీకోసం... ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫొటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిఫ్టింగ్కు కూడా వినియోగించుకోచ్చు. ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికీ ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
బ్యాంకింగ్, బీమా, హౌస్ షిఫ్టింగ్, మైస్టాంప్ వంటి సేవలు వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్న వైనం పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడో... బ్యాంకుల్లోలా డబ్బులు వెయ్యచ్చు..తీయవచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారవచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖాలుగా తన సేవలను విస్తరించింది. - న్యూఢిల్లీ కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడానే కాకుండా బహుముఖాలుగా సేవలందిస్తోంది. జిల్లాలో ఆరు హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. గుంటూరు హెడ్ పోస్టాఫీసు పరిధిలో 36 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. తపాలా శాఖ ప్రస్తుతం ఏఏ సేవలు... ఎలా అందిస్తోందన్నది పూర్తి వివరాలు మీకోసం... ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.