'ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా'
ఇబ్రహీంపట్నం రూరల్ (రంగారెడ్డి) : పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయే రైతులకు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడులో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడ్డ ఎల్మినేడు గ్రామ దశ మారిపోతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూములను ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. పరిశ్రమల ఏర్పాటుతో గ్రామంలోని మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. జీవో 45 ప్రకారం భూముల మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారం లభించేలా చేస్తానన్నారు.