email complaint
-
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
దీపిక నాకు దూరం అవుతుందేమో?
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల మధ్య మాటల తుటాలు మళ్లీ మొదలు కావటంతో.. పాత వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి ఈ-మెయిల్స్ సంభాషణలను కీలక సాక్ష్యాలుగా పోలీసులు విచారణ చేపట్టగా.. తాజాగా వాటిలో దీపిక పదుకొనే పేరు ప్రస్తావనకు రావటం సంచలనంగా మారింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్‌కు చెందిన రిపబ్లిక్ టీవీ ఈ మేరకు ఓ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అందులో దీపిక ప్రవర్తన గురించి కంగనా హృతిక్ వద్ద ప్రస్తావించింది. ‘దీపిక వ్యవహారాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. నా మనసులో దీపికపై మంచి అభిప్రాయం లేదని, ఆమె గత నాలుగు రోజులుగా నాకు ఫోన్ కాల్స్ చేయదు. తన గురించి నాకు తెలిసిపోయినట్టు భావించబట్టే, దీపిక నాకు దూరం అవుతోందని అనుకుంటున్నా' అంటూ కంగానా ఆ మెయిల్స్‌లో ప్రస్తావించిందంట. దీపిక అర్థరహితమైన పనులతో తాను విసుగు చెందినట్టు కంగనా హృతిక్ తో చెప్పుకుంది. ఆమెపై తనకెన్నో సందేహాలున్నాయని, తనకు భయంగా ఉందని, ఏడవాలని ఉందంటూ హృతిక్‌కు చెప్పుకుని బాధపడింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గతంలోనే చాలాసార్లు హృతిక్ కంగనా కోరినట్లు కూడా ప్రస్తావించింది. మొత్తానికి వీరిద్దరి మధ్య వ్యవహారంలోకి మరో అగ్ర హీరోయిన్ పేరు రావటం బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. దీనిపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఎంతో ఆశగా భారత్ వచ్చాను.. కానీ!
న్యూఢిల్లీ: తన జీవితస్వప్నం కోసం భారత్‌కు రావడం ఓ అమెరికా మహిళా టీచర్ పాలిట శాపంగా మారింది. గత ఏప్రిలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరూ గ్యాంగ్ రేప్ బాధితురాలు అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇంత జరిగినా సరే.. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని సమస్యపై పోరాడటమే తన లక్ష్యమని అంటోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాకు చెందిన 25 ఏళ్ల మహిళకు భారత్‌కు టూరిస్ట్‌గా రావాలని చిన్నప్పటి నుంచీ కలగనేది. ఇందులో భాగంగా గత ఏప్రిల్ లో ఢిల్లీకి వచ్చి ఓ హోటల్లో బస చేసింది. ఓ టూరిస్ట్ గైడ్ ఆమెకు ఢిల్లీ సిటీ చూపిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె రూముకు వెళ్లి ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో నలుగురు వ్యక్తులను కూడా ఆమె రూముకి తీసుకొచ్చి రెండు రోజులపాటు నరకం చూపించాడు. వీరిలో ఇద్దరు హోటల్ స్టాఫ్ కూడా ఉన్నారు. 'ఆ సమయంలో నేను షాక్‌కు గురయ్యాను. ఎలాగోలా తప్పించుకుని ఢిల్లీ నుంచి పెన్సిల్వేనియాలోని ఇంటికి తిరిగి వెళ్లిపోయాను. ఈ దుర్ఘటన నుంచి కోలుకుని మాములు మనిషి కావడానికి మూడు నెలలు పట్టింది. స్థానిక ఎన్జీఓ సంస్థ ద్వారా ఫిర్యాదు చేశాను. అయితే అమెరికా నుంచి భారత్‌లో ఫిర్యాదు చేయడం కష్టమని, నిందితులకు శిక్ష పడాలంటే నేరుగా ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేయాలని భావించాను. ఈ నెల 19న ఢిల్లీకి వచ్చి ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. త్వరలోనే నిందితులకు శిక్ష పడుతుంది' అని బాధిత మహిళ ఆశాభావం వ్యక్తంచేసింది. తాను అందించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారని, టూర్ గైడ్ సహా 11 మందిని విచారించినట్లు వెల్లడించింది. నిందితుల ఫొటోలు చూస్తే కచ్చితంగా వారిని గుర్తుపడతాను.. తనకు న్యాయం జరుగుతందని ధీమా వ్యక్తంచేసింది. భారతదేశమంటే తనకు ఇష్టమేనని, ఈ దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తానని.. అత్యాచారాలు అనేవి పెద్ద సమస్యగా గుర్తించి ఏ మహిళకు ఇలాంటివి జరగకుండా అరికట్టాలని ఆమె తన మెయిల్ ద్వారా పోలీసులకు విజ్ఞప్తిచేసింది.