ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
బెంగళూరు : దేశీయంగా టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. కానీ ఇటీవల కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయి. ఈ సాప్ట్ వేర్ దిగ్గజం నుంచి గతేడాది దాదాపు 38 వేల మంది ఉద్యోగాలు వదిలివేసినట్టు వెళ్లినట్టు వెల్లడైంది. అంతేకాక 2016-17లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా 65 శాతం పడిపోయినట్టు తెలిసింది. దీనికంతటికీ ప్రధానకారణం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాగ, మరోవైపు ప్రాజెక్టులకు కూడా దెబ్బపడుతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఎంప్లాయీ మెట్రిక్స్ వివరాలు వెల్లడించిన ఇన్ఫోసిస్, తన కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుబంధ కంపెనీల నుంచి 37,915 మంది ఉద్యోగులు వదిలివెళ్లినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 34,688 మందే రాజీనామా చేశారు.
అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 44,235 టెక్కీలను నియమించుకున్నప్పటికీ, నికరంగా కంపెనీలోకి వచ్చింది 6320 మంది మాత్రమేనని ఇన్ఫోసిస్ తెలిపింది. అంటే ఇది కూడా 65 శాతం పడిపోయినట్టు వెల్లడించింది. అదేవిధంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడా 2016 నియమించుకున్న సంఖ్యకంటే తక్కువగా 18,797 మందినే నియమించుకుందని తెలిపింది. మొత్తంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6320కి పెంచి, 2,00,364కు చేర్చుకుంది. దీనిఫలితంగా పేరెంట్ కంపెనీలో అట్రిక్షన్ లెవల్స్(ఉద్యోగులను తగ్గించుకోవడం) 15 శాతానికి పెరిగినట్టు వార్షిక సమీక్షలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. గతేడాది ఈ శాతం 13.6 శాతంగానే ఉందని తెలిపింది.