Employees service
-
ఎస్సీ కమిషన్‌కు ఆ అధికారం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీస్ అంశాలపై విచారణ జరిపే అధికారం ఎస్సీ కమిషన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన రూపొందించాలని 2001లో సర్కార్ జీవోలు జారీ చేసింది. అయితే ఈ జీవోలను నిలిపివేయాలని విద్యుత్ సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. స్పందించిన కమిషన్ 2022, నవంబర్ 29న జీవోలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఉత్తర్వుల కారణంగా బీసీ, ఓసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొండెపాక కుమారస్వామి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫున సుంకర చంద్రయ్య వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశారు. ప్రభుత్వసంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు విచారణ జరిపే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వివరాలను సమర్పించండి విద్యుత్‌సంస్థల్లో పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లు అన్నింటిని సమీక్షించాలని 2019లో హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అయినా ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం ఫిబ్రవరి 8న వివరాలను సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించింది. -
వరల్డ్ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా?
ప్రపంచ దేశాలకు చెందిన ఉద్యోగులతో పోల్చుకుంటే అమెరికన్ ఉద్యోగులు ‘హస్టిల్ కల్చర్’లో ప్రాచుర్యం పొందుతుంటే ఫ్రెంచ్ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ పనిగంటలు చేస్తున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. గ్లోబల్‌లో సగటున 25శాతంతో ప్రతి పదిమంది ఫ్రెంచ్ బిజినెస్ లీడర్స్‌లో నలుగురు ఆఫీస్ వర్క్ చేసే సమయంలో ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా గంటల తరబడి పని చేస్తున్నారు. యూఎస్,యూకే, చైనా దేశాలకు చెందిన ఉద్యోగులు సైతం పని విషయంలో మంచి రేటింగ్ పొందుతున్నట్లు సర్వే నిర్వహించిన హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ బుపా గ్లోబల్ ఫండ్ తెలిపింది. పనిమంతులే.. కానీ భయం ఎక్కువే! అదే సమయంలో ఏ దేశంలో సర్వే చేసిన ..ఆయా దేశాల్లో ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు వారి వ్యక్తిగత పని పనితీరు గురించి ఆందోళన చెందుతున్నట్లు తేలింది. అందుకు ప్రస్తుత ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనేందుకు వారి సంస్థల సామర్థ్యం గురించి ఆందోళనలు, ఇతర దేశాలకు చెందిన తరహాలో ఉద్యోగులు రిమోట్ వర్క్ చేసేందుకు ఇష్టపడకపోవడం వంటి అంశాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా..ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలు స్వీకరించే ధోరణి కారణంగా ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ గంటలు పనిచేయడానికి దోహదపడుతుంది" అని బుపా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంథోనీ కాబ్రెల్లి అన్నారు. ఆశ్చర్యం కలుగక మానదు ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆఫీసుల్లో అమలు చేస్తున్న పాలసీలు, జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక ఆదేశంలో చాలా మంది కన్స్ట్రక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్,ఆయిల్ ఫీల్డ్ వర్క్ వంటి బ్లూ కాలర్ జాబ్స్, ఫుడ్ సర్వీస్,క్లీన్ సర్వీస్, పర్సల్ సర్వీస్ వంటి సర్వీస్ ఉద్యోగులు వారంలో 35 గంటల పని చేస్తున్నారు. వేసవి సెలవులు ఉన్న ఆగస్ట్ నెలలో ఎక్కువ గంటలు ఆఫీస్ పనికే కేటాయిస్తున్నారు. రైట్ టూ డిస్ కనెక్ట్ 2017లో ఫ్రాన్స్ దేశం రైట్ టూ డిస్ కనెక్ట్ అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టంలో నిర్దిష్ట గంటల తర్వాత ఇంటికి వెళ్లిన ఉద్యోగులకు ఇమెయిల్స్, కాల్స్ చేయడం నిషేధించాలని సంస్థలు కోరాయి. మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్ చేసేలా ప్రతిపాదనలు తెచ్చేలా ఇతర దేశాలను ప్రేరేపించింది. కాగా, కొన్నేళ్లుగా ఫ్రెంచ్ లేబర్ కోడ్ ప్రకారం ఎవరైనా తమ డెస్క్‌ల వద్ద భోజనం చేయడం నిషేధం.. అయినప్పటికీ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో చట్టాన్ని నిషేధించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఈ–ఎస్ఆర్’
ప్రభుత్వ ఉద్యోగులు/ అధికారులకు సర్వీసు పరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నెలా ఒకటవ తేదీన టంచన్‌గా వేతనం పొందడంతో పాటు, ఉద్యోగ విరమణ చేసే రోజునే బెనిఫిట్స్ అన్నీ చేతికందేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్) స్థానంలో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్‌సీఎం) అనే నూతన ఆర్థిక విధానాన్ని జూన్ నెల నుంచి అమలు చేసేందుకు ఆర్థిఖ శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ఉద్యోగ, అధికారులు ‘ఈ–ఎస్ఆర్’ పొందేందుకు వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాక్షి, మచిలీపట్నం: సర్వీసు రిజిస్టర్ పుస్తకాలతో పనిలేకుండా చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే తమ సర్వీసుకు సంబంధించిన సమస్త సమాచారం కనిపిస్తుంది. ఆన్లైన్లోనే ఉద్యోగుల సర్వీసు పరమైన వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఉద్యోగి/అధికారి ప్రభుత్వ కొలువులో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు పుస్తక రూపంలో ఉన్న సర్వీసు రిజిస్టర్‌ను ఉద్యోగ కాలం మొత్తంగా అంటే 30 నుంచి 35 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా భద్రపరచాల్సి వస్తోంది. ఏదైనా అనుకోని ఘటనల్లో సర్వీసు రిజిస్టర్ పోతే అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయా శాఖల్లోని సీనియర్ అసిస్టెంట్లు, అక్కడ నుంచి డీడీఓలు, అటు తరువాత ఎస్టీఓ, డీటీఓ ఇలా పలువురి వద్దకు ఎస్ఆర్ వెళితేనే కానీ సవ్యంగా వేతనాలు, ప్రోత్సాహకాలు అందుకోని పరిస్థితి ఇప్పటివరకు ఉంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ప్రస్తుత ప్రభుత్వం చక్కటి ఆలోచన చేసింది. ఈ–ఎస్ఆర్ ఇలా పూరించాలి ఈ–ఎస్ఆర్ పొందేందుకు ప్రతి ఉద్యోగి/అధికారి తప్పనిసరిగా ఆన్లైన్లో పూర్తి స్థాయి వివరాలు పొందుపరచాలి. ఆయా శాఖల ఉన్నతాధికారుల సూచనల మేరకు వెబ్సైట్లో లాగిన్ అయిన తరువాత మొదటిగా సీఎఫ్ఎంఎస్ ఐడీ నంబర్ (ఎనిమిది అంకెలు) నమోదు చేయాలి. ఆ తరువాత వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌ను నమోదుచేస్తే, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తరువాత ఒక్కో పార్టులో అడిగిన సమాచారం పూరించాలి. ఇలా ప్రతి ఉద్యోగి/ అధికారి తమ వివరాలు 12 పార్టుల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడి నుంచి డీడీఓల లాగిన్ చేరుతుంది. డీడీఓల ధ్రువీకరణ తరువాత ప్రభుత్వానికి వివరాలు చేరుతాయి. చదవండి: బాబు పీఏ కోసం నిబంధనలు తుంగలో తొక్కి..! ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి 1.ఎస్‌ఆర్‌లో ఇప్పటికే నమోదుచేసి ఉన్న పదో తరగతి/ఎస్ఎస్సీ సర్టిఫికెట్ 2. ఇటీవల దిగిన పాస్‌ఫొటో 3. ఉద్యోగంలో చేరిన నాటి ఫొటో 4. లోకల్ స్టేటస్‌ను ధ్రువీకరించే పత్రం 5. విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు 6. పాన్‌కార్డు 7. బ్యాంకు అకౌంట్ మొదటి పేజీ 8. పీఎఫ్ స్లిప్/పీఆర్ఏఎన్ కార్డు 9. ఏపీజీ ఎల్ఐసీ బాండు 10. దివ్యాంగులైతే మెడికల్ సరి్టఫికెట్ 11. కుల ధ్రువీకరణ పత్రం. 12 పార్టులుగా వివరాలు 1. వ్యక్తిగత సమాచారం 2. సర్టిఫికెట్స్ 3. సర్వీసు డీటైల్స్ 4. వేతనం వివరాలు 5. సెలవుల సమాచారం 6. లీవ్ ట్రావెల్స్ కన్సెక్షన్ సమాచారం 7. ఇంట్రస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ 8. గ్రూప్ ఇన్సూ్యరెన్స్ డీటైల్స్ 9. సర్వీసు వెరిఫికేషన్ డీటైల్స్ 10 డిపార్ట్మెంట్ పరీక్షలు, శిక్షణలు 11. ఇన్సెంటివ్, పనిష్మెంట్స్ 12. ఫెన్షన్ ప్రపోజల్స్ ప్రభుత్వ నిర్ణయం మంచిదే ప్రభుత్వ నిర్ణయం మంచిదే. వేతనాలు, బెనిఫిట్స్ కోసం సర్వీసు రిజిస్టర్లు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. సమయానికి అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. అయితే దీనిపై ఉద్యోగుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. శాఖల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. –చేబ్రోలు శరత్చంద్ర, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగులకు ఎంతో మేలు ఈ–ఎస్ఆర్ అమలు వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు హెచ్ఎం, ఎంఈఓల చుట్టూ ఉపాధ్యాయులు తిరగాల్సి వస్తుంది. ఈ–ఎస్ఆర్ వల్ల ఎప్పుడు, ఏ బెనిఫిట్స్ రావాలో ఆటోమేటిక్‌గా జనరేట్ అయి, ఉద్యోగుల ఖాతాల్లోకి చేరుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. –ఎంవీ మహంకాళిరావు, వైఎస్సార్ టీఎఫ్, జిల్లా కార్యదర్శి -
సర్వీసు వివాదాల్లో జోక్యం చేసుకోవడం తగదు
లోకాయుక్త ఆదేశాలను తప్పుబట్టిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీసు వివాదంలో ఇద్దరు ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. సర్వీసు వివాదాలను విచారణకు స్వీకరించడం పరిపాలనా ట్రిబ్యునల్స్ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. రెండు విభాగాల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి సీనియారిటీ వివాదంపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త... ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ గత జూన్ 16న సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల సర్వీసు వివాదాలను ట్రిబ్యునళ్లు మాత్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.