employes union
-
ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాల ముట్టడికి ఈయూ పిలుపు
తమ డిమాండ్ల పరిష్కారానికై శనివారం ఏపీఎస్ఆర్టీసి రీజనల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. అద్దె బస్సుల టెండర్స్ రద్దుచేయడం, పెండింగ్ ఉన్నకాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయడం, రిటైర్ అయిన ఆర్టీసి కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించడం, సమైక్యాంధ్ర సమ్మెకాలం 60 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవుగా మంజూరుచేయాలనే డిమాండ్ల అమలులో ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. -
ఇదో చారిత్రాత్మక రోజు
అద్దంకి : అద్దంకి ఆర్టీసీ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నాయకుడు వాకా రమేష్ అన్నారు. డిపోలో వోటీ విధానానికి నిరసనగా మంగళవారం కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. ఓటీలను ఎత్తివేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మూడు రోజుల పాటు నిరసన ధర్నాలు, ఆరు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. యాజమాన్యం స్పందించి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తుందని ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. డీఎం మధుసూదన్‌తో చర్చలు జరిపినా ఫలితంలేకపోవడంతో మంగళవారం కార్మికులందరూ విధులకు వెళ్లకుండా డిపో వద్ద టెంట్లు వేసుకుని కూర్చున్నారు. పట్టణంలో యాజమాన్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఈయూ రీజనల్ నాయకుడు రమేష్ మాట్లాడుతూ యాజమాన్యానికి అర్థం కావాలని, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయకూడదని రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపినా డీఎం సమస్యను పెడచెవిన పెట్టారన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించడంతోనే ఇంత దాకా వచ్చిందని పేర్కొన్నారు. 89 షెడ్యూల్స్ ఉన్న చోట 23 వోటీలను వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోనే ఎక్కడా లేదన్నారు. పోనీ వోటీలు వేసే రహదార్లేమైనా బాగున్నాయంటే అవి డొంక రోడ్లని పేర్కొన్నారు. ఆ రహదార్లలో వోటీలు చేయడం వల్ల డ్రైవర్లు అనారోగ్యానికి గురైతే తార్నాక వైద్యశాలకు పంపడం కూడా చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వోటీలను అసలు చేయమని స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించి వోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు టీకే రావు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సీపీఎస్ రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు పి.తిరుపతిరెడ్డి, అల్లం సుబ్బయ్య, కొండలు, ఎంకే రావు, పీటీ రెడ్డి, శ్రీనివాసరావు, వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కాంట్రా క్టు, ఔట్సోర్సింగ్, సొసైటీ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.12,500 వరకు కనీస వేతనం పెంచాలని కోరుతూ శనివారం నుంచి రాష్ట్ర వ్యాపితంగా ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం బాలాజీనగర్‌లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ప్రభుత్వం పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో సమ్మె చేపట్టబోతున్నామన్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల పీఎఫ్ మొత్తాన్ని పలు మున్సిపాలిటీల్లో కమిషనర్లు దిగమింగారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని వెంటనే కార్మికుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచలనరసయ్య, కర్రెయ్య పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య కార్మికులు స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. తరువాత అక్కడే మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. -
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి
కడప అర్బన్, న్యూస్‌లైన్: ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వచ్చే ఏడాదిలో పూర్తిగా పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం తమ యూనియన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణ సాధనలో తాము వెనకబడ్డామని నేషనల్ మజ్దూరు యూనియన్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల మంది కాంట్రాక్టు కార్మికులను 2013 జులై 4న తమ యూనియన్‌తో యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు విడతలుగా రెగ్యులరైజ్ చేస్తారని తెలిపారు. అలాగే 24వేల మంది కండక్టర్లు, డ్రైవర్లను రెగ్యులరైజ్ చేయించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా చనిపోయిన కార్మికుల పిల్లలకు గడువు లేకుండా ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రయత్నిస్తామన్నా రు. వేతన సవరణ మేరకు ఉద్యోగులకు వేతనాలు ఇప్పిం చేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బంద్‌కు వెల్లువెత్తిన మద్దతు
కరీంనగర్, న్యూస్‌లైన్ : బంద్‌కు పలు పార్టీల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ హమీద్, నర్సింహస్వామి కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించాలని పేర్కొన్నాయి. కిరణ్‌సర్కారు వైఖరికి నిరసనగా సీపీఐ కార్యకర్తలు బంద్‌లో పాల్గొనాలని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ట్రస్మా, తెలంగాణ జాగృతి, రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీ, కుల సంఘాల జేఏసీ, ఏపీటీఎఫ్-257 జిల్లా శాఖ, తెలంగాణ విద్యార్థుల రక్షణసంక్షేమ సేవా సంఘం, ఎస్‌యూ విద్యార్థి జేఏసీ, నైజాం ప్రాంత వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ), తెలంగాణ మాల మహానాడు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తదితర సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాల మద్దతు.. టీజేఏసీ బంద్ పిలుపులో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాలి మహేందర్‌రెడ్డి, నరహరి ల క్ష్మారెడ్డి, తెలంగాణ డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోల రాజమల్లు, జి.కనుకరాజు, ప్రైవే ట్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రత్నాకర్, టీఆర్టీ యూ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. సారయ్య, మస్రత్అలీ, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షు లు మాడుగుల రాములు తదితరులు కోరారు. బీజేపీ మద్దతు ఏపీఎన్జీవోల సభకు అనుమతినిస్తూ టీజేఏసీ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సీఎం కిరణ్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా టీజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు బీజేపీ మద్దతు ప్రకటించింది. బంద్‌లో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు పిలుపునిచ్చారు. బస్సులు బంద్ కరీంనగర్ అర్బన్ : హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి తెలంగాణ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు శుక్రవారం అర్ధరాత్రి బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు జిల్లాలోని 11 డిపోలకు చెందిన 911 బస్సులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాత్రి సమయంలో వేళ్లే బస్సులు శుక్రవారం సాయంత్రమే డిపోల్లో నిలిపివేశారు. బంద్‌లో పాల్గొనాలని అన్ని యూనియన్ల నాయకులు కార్మికులకు సూచించారు. జోనల్ వర్క్‌షాప్ కార్మికులు సైతం మద్దతు ప్రకటించారు.