కరీంనగర్, న్యూస్‌లైన్ : బంద్‌కు పలు పార్టీల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ హమీద్, నర్సింహస్వామి కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించాలని పేర్కొన్నాయి. కిరణ్‌సర్కారు వైఖరికి నిరసనగా సీపీఐ కార్యకర్తలు బంద్‌లో పాల్గొనాలని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు.
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ట్రస్మా, తెలంగాణ జాగృతి, రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీ, కుల సంఘాల జేఏసీ, ఏపీటీఎఫ్-257 జిల్లా శాఖ, తెలంగాణ విద్యార్థుల రక్షణసంక్షేమ సేవా సంఘం, ఎస్‌యూ విద్యార్థి జేఏసీ, నైజాం ప్రాంత వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ), తెలంగాణ మాల మహానాడు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తదితర సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.
ఉపాధ్యాయ సంఘాల మద్దతు..
టీజేఏసీ బంద్ పిలుపులో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాలి మహేందర్‌రెడ్డి, నరహరి ల క్ష్మారెడ్డి, తెలంగాణ డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోల రాజమల్లు, జి.కనుకరాజు, ప్రైవే ట్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రత్నాకర్, టీఆర్టీ యూ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. సారయ్య, మస్రత్‌అలీ, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షు లు మాడుగుల రాములు తదితరులు కోరారు.
బీజేపీ మద్దతు
ఏపీఎన్‌జీవోల సభకు అనుమతినిస్తూ టీజేఏసీ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సీఎం కిరణ్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా టీజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు బీజేపీ మద్దతు ప్రకటించింది. బంద్‌లో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు పిలుపునిచ్చారు.
బస్సులు బంద్
కరీంనగర్ అర్బన్ : హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి తెలంగాణ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు శుక్రవారం అర్ధరాత్రి బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు జిల్లాలోని 11 డిపోలకు చెందిన 911 బస్సులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాత్రి సమయంలో వేళ్లే బస్సులు శుక్రవారం సాయంత్రమే డిపోల్లో నిలిపివేశారు. బంద్‌లో పాల్గొనాలని అన్ని యూనియన్ల నాయకులు కార్మికులకు సూచించారు. జోనల్ వర్క్‌షాప్ కార్మికులు సైతం మద్దతు ప్రకటించారు.
బంద్‌కు వెల్లువెత్తిన మద్దతు
Published Sat, Sep 7 2013 5:31 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement