employment labor
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి
సాక్షి, డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన బోండ్ల నరేశ్ (33) కువైట్‌లో బ్రెయిన్ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు సర్పంచ్ కులాచారి సతీశ్‌రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితమే నరేశ్ గల్ఫ్‌లోని కువైట్‌కు వెళ్లాడు. కంపెనీలో పని చేసినా సరైన వేతనం ఇవ్వక పోవడంతో కంపెనీ వదిలి బయటకు వచ్చాడు. అయినా సరైన పనులు దొరకక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి కార్మికులు సమాచారం అందించారని సర్పంచ్ పేర్కొన్నారు. ఒత్తిడి ఎక్కువై నరేశ్ మృతి చెందినట్లు బుధవారం కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, తెలంగాణ జాగృతి ప్రతినిధులు నరేశ్ మృతదేహాన్ని నడిపల్లికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మృతుడికి భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : కొత్త వ్యక్తులు.. నేరాలకు పాల్పడిన వాళ్లు మీకు తెలిసిన వ్యక్తులు అయిన ఎలాంటి పరిస్థితులలో ఇంట్లో ఆశ్రయం కల్పించరాదు.. మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులు గా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందుగా మీరే వా ళ్లను ప్రశ్నించి వారి దగ్గరి నుంచి వివరాలు సేకరిం చాలి.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని కొత్తగంజ్, సంజయ్‌నగర్ కాలనీల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటిసారిగా పోలీస్ శాఖ మొబైల్ యాప్ ద్వారా స్థానికంగా నివాసం ఉన్న వారికి చెందిన ఆధార్ కార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫింగర్ ఫ్రింట్ స్కా నర్ ద్వారా ఎవరైనా పాత నేరస్థులు ఉన్నారా.. అనే దానిపై కూడా స్థానికంగా నివాసం ఉన్న వాళ్ల ఫింగర్ ఫ్రింట్‌లను పరీక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్న వా రి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర ధానంగా కాలనీలో ఉండే కిరాణాలు, పాన్ దు కాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్‌లో ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐ దుమంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 100మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒక కాలనీ ఎంచుకుని తనిఖీలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు రక్షణలో భాగంగానే ఇ లాంటి తనిఖీలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ పో లీసులకు సహకరించాలని ఆమె పేర్కొన్నారు. -
కంప చెట్లలో తపంచా
ఉపాధి హామీ పనుల్లో భాగంగా కంప చెట్లు తొలగిస్తున్న కూలీలకు ఎప్పటిదో గానీ పాత కాలంనాటి ఓ తపంచా కనిపించింది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపాడు గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఈజీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామన్నపేట సీఐ గంగిరెడ్డి గ్రామానికి చేరుకుని తపంచాను స్వాధీనం చేసుకున్నారు. దానిపైన కెనాన్ అని ఇంగ్లిష్‌లో పేరు ఉంది.