అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు | Do Not Give Shelter To Unknown Persons | Sakshi
Sakshi News home page

అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు

Published Thu, Jun 14 2018 10:33 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Do Not Give Shelter To Unknown Persons - Sakshi

స్థానికులతో వివరాలు సేకరిస్తున్న ఎస్పీ అనురాధ, ఇతర పోలీసు అధికారులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం : కొత్త వ్యక్తులు.. నేరాలకు పాల్పడిన వాళ్లు మీకు తెలిసిన వ్యక్తులు అయిన ఎలాంటి పరిస్థితులలో ఇంట్లో ఆశ్రయం కల్పించరాదు.. మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులు గా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందుగా మీరే వా ళ్లను ప్రశ్నించి వారి దగ్గరి నుంచి వివరాలు సేకరిం చాలి.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ ఎస్పీ అనురాధ అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని కొత్తగంజ్, సంజయ్‌నగర్‌ కాలనీల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. స్థానికంగా ఉన్న 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటిసారిగా పోలీస్‌ శాఖ మొబైల్‌ యాప్‌ ద్వారా స్థానికంగా నివాసం ఉన్న వారికి చెందిన ఆధార్‌ కార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫింగర్‌ ఫ్రింట్‌ స్కా నర్‌ ద్వారా ఎవరైనా పాత నేరస్థులు ఉన్నారా.. అనే దానిపై కూడా స్థానికంగా నివాసం ఉన్న వాళ్ల ఫింగర్‌ ఫ్రింట్‌లను పరీక్షించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్న వా రి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర ధానంగా కాలనీలో ఉండే కిరాణాలు, పాన్‌ దు కాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్డెన్‌ సెర్చ్‌లో ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐ దుమంది సీఐలు, 10మంది ఎస్‌ఐలు, 100మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒక కాలనీ ఎంచుకుని తనిఖీలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు రక్షణలో భాగంగానే ఇ లాంటి తనిఖీలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ పో లీసులకు సహకరించాలని ఆమె పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement