corden and search
-
కశ్మీర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ముసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘చనిపోయిన ఉగ్రవాదిని జకీర్ ముసాగా గుర్తించాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా వెల్లడించారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, షోపియాన్, పుల్వామా, అవంతీపురా, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జకీర్‌కు మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేపట్టారని, నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అధికారులు లోయలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. తొలుత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, ఆ తర్వాత అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 2017లో హురియత్ కాన్ఫరెన్స్ నేతలను బెదిరించినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కలంతరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే వీరి కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఆఫీసర్ సహా ముగ్గురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిని బదామీబాగ్లోని 92 కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణరేఖ(ఎల్వోసీ) వెంట భారత పోస్టులు లక్ష్యంగా బుల్లెట్లు, మోర్టార్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన యశ్ పాల్(24) వీరమరణం చెందారు. యశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని ఉధమ్‌పూర్ జిల్లా మంతాలయ్ గ్రామమని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాక్ రేంజర్లు భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంబించారనీ, రాత్రివరకూ అవి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ పాక్ 110 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకల చెరలో బందీగా ఒకరిని సైనికులు రక్షించారు. బందిపొరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా స్థానికుల సాయంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఓ బందీని రక్షించగలిగాయి. -
అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : కొత్త వ్యక్తులు.. నేరాలకు పాల్పడిన వాళ్లు మీకు తెలిసిన వ్యక్తులు అయిన ఎలాంటి పరిస్థితులలో ఇంట్లో ఆశ్రయం కల్పించరాదు.. మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులు గా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందుగా మీరే వా ళ్లను ప్రశ్నించి వారి దగ్గరి నుంచి వివరాలు సేకరిం చాలి.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని కొత్తగంజ్, సంజయ్‌నగర్ కాలనీల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటిసారిగా పోలీస్ శాఖ మొబైల్ యాప్ ద్వారా స్థానికంగా నివాసం ఉన్న వారికి చెందిన ఆధార్ కార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫింగర్ ఫ్రింట్ స్కా నర్ ద్వారా ఎవరైనా పాత నేరస్థులు ఉన్నారా.. అనే దానిపై కూడా స్థానికంగా నివాసం ఉన్న వాళ్ల ఫింగర్ ఫ్రింట్‌లను పరీక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్న వా రి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర ధానంగా కాలనీలో ఉండే కిరాణాలు, పాన్ దు కాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్‌లో ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐ దుమంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 100మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒక కాలనీ ఎంచుకుని తనిఖీలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు రక్షణలో భాగంగానే ఇ లాంటి తనిఖీలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ పో లీసులకు సహకరించాలని ఆమె పేర్కొన్నారు. -
వదంతులను నమ్మొద్దు
వనపర్తి క్రైం: శాంతిభద్రతలు, పౌరసమాజ రక్షణ కోసం కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్ అన్నారు. శనివారం తెల్లవారుజామున పట్టణంలోని 26వ వార్డు రాంనగర్‌కాలనీలో జిల్లా పోలీసులు 78 మంది సిబ్బందిచే సోదా చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కాలనీలో సోదాలు జరపాలని ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రాంనగర్ కాలనీలో తనిఖీ చేపట్టామన్నారు. సెర్చ్‌లో పత్రాలు 32 బైకులు, 2 ఆటోలు, 11 మంది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుమానిత వ్యక్తులను అదపులోకి తీసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వారిపై దాడిచేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేరాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, సీసీఎస్ సీఐ నరేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తుంకిమెట్లలో కార్డన్ సర్చ్
బొంరాస్‌పేట : కుయ్ కుయ్‌మంటూ ఒకటి తర్వాత ఒకటి బుగ్గ వాహనాలు.. ఎవరో వీఐపీలు వస్తున్నారని అనుకున్నారు ఊరంతా. ఆగిన వాహనాల నుంచి పోలీసు బలగాలు దిగాయి. కొద్ది సేపటికి.. ఊరి సమీపంలో తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డాయని అందుకే పోలీసులు మోహరించారని పుకార్లు షికార్లు చేశాయి. పోలీసుల హల్చల్ చూసి ప్రజలు బెంబేలెత్తారు. కాస్త తేరుకున్నాక మూకుమ్మడి సోదాలు చేసేందుకు వచ్చారనే విషయం అర్థమైంది. మండల పరిధిలోని తుంకిమెట్లలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పరమాల నర్సింహులు, డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలోని పలు దుకాణాలు, ఇళ్లల్లో సోదాలు చేశారు. బైకులు స్వాధీనం.. కార్డన్ సెర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని 19 బైకులు, 4 ఆటోలతో పాటు పలు దుకాణాల్లో దొరికిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరిగి, కొడంగల్ సీఐలు రంగా, శంకర్, పరిగి డివిజన్ పరిధిలోని ఎస్సైలు ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న దొం గతనంకేసు, వాహనాల్లో డీజిల్ చోరీ అంశాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన పోలీసులు తుంకిమెట్లలో కార్డర్ సెర్చ్ నిర్వహించారని తెలుస్తోంది. -
చీరాలలో కార్డన్‌సర్చ్
సాక్షి, చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో పోలీసులు సోమవారం వేకువజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. రామ్‌నగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పత్రాలు లేని 14 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. -
కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రసూల్‌పురాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో రసూల్‌పురా ఏరియాలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో యూపీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 80 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ గణేశ్ రెడ్డి, సీఐ గట్టు బస్వారెడ్డితో పాటు సుమారు 100కి పైగా పోలీసులు పాల్గొన్నారు.