shelters
-
Delhi: 20 రోజుల్లో 13 మంది చిన్నారుల అనుమానాస్పద మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ షెల్టర్ హోహ్లో చిన్నారుల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక వికలాంగుల షెల్టర్‌హోమ్‌లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సబ్ డివిజనల్ కార్యాలయం జరిపిన విచారణలో తేలింది. రోహిణిలో ప్రాంతంలోని ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మరణాలు నమోదయైనట్లు వెల్లడైంది. అయితే షెల్టర్ హోమ్‌లో చిన్నారుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.దివ్యాంగ చిన్నారులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత ఏడాది కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పోస్ట్‌మార్టం నివేదికల తర్వాత మరణాలకు అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. పిల్లలకు అందిస్తున్న తాగునీటి శుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆప్ ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షెల్టర్‌హోమ్‌కు నిజానిజాలు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపింది.‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయింది. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. వాటిని భరించలేక ప్రాణాలు విడుస్తున్నారు. అయినా ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.దీనిపై విచారణకు మేము బృందాన్ని పంపాము. వివరాలు తెలుసుకుంటాం’ అని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తోందని చెప్పారు.అయితే మృతుల సంఖ్యపై ఢిల్లీ మంత్రి అతిషి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని కోరారు. 2024 జనవరి నుంచి షెల్టర్ హోమ్‌లో 14 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ మరణాలకు కారణమైన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.మరోవైపు షెల్టర్ హోమ్‌లో మరణాల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. అక్కడి పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం, వైద్యం అందించడం లేదని ఆరోపిస్తోంది. ఈ మరణాలకు కారణమైన అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలను సమీక్షించేందుకు ఢిల్లీ బీజేపీకి చెందిన బృందం కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌కు చేరుకుంది. -
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది... ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి. పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత... తన స్నేహితుడు మాధవ్ దత్తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి. తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా. ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది. -
తూచ్..ఏసీ!
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి వన్నె చిన్నెలు అద్దేలా...అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అత్యాధునిక ఏసీ బస్సు షెల్టర్లు మేడిపండు చందంలా మారాయి. అందుబాటులోకి తెచ్చి ఎనిమిది నెలలు దాటినా వాటిల్లో కనీస సదుపాయాల్లేవు. ఒకవైపు వేసవి తరుముకొస్తోంది. ఇప్పటి వరకు ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. ఆధునిక బస్సు స్టేషన్లను ప్రారంభించినప్పటి హామీలు అన్నీ అనతికాలంలోనే హుష్‌కాకిలా ఎగిరిపోయాయి. ఇప్పుడు అవి అలంకారప్రాయంగా మాత్రమే మిగిలాయి. నగరంలోని కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లలోని ఆధునిక బస్షెల్టర్ల దుస్థితి ఇది. మరోవైపు ప్రయాణికులకు కనీస సదుపాయాలతో కూడిన మరిన్ని షెల్టర్లను కట్టించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ మూడు షెల్టర్లు మినహా కొత్తగా ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. బస్సులు ఆగే చోట షెల్టర్లు లేవు. షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగవు. కొన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాణిజ్య ప్రకటనలో కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తి భద్రత. 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి. ఆధునిక టాయిలెట్లు. ఏటీఎం, బస్సుపాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపైన ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అరకొర సదుపాయాలు తప్ప ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రయాణికులకు ఈ బస్షెల్టర్లు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఎల్ఈడీ బోర్డులేవీ..... దేశంలోనే ఎక్కడా లేని విధంగా కట్టించిన శిల్పారామం, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్ బస్షెల్టర్లలో కనీసం బస్సుల రాకపోకలను తెలిపే ఎల్ఈడీ బోర్డులు లేవు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కూకట్పల్లి రూట్లో ప్రతిరోజు వేలాది బస్సులు ఖైరతాబాద్ మీదుగా కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. అలాగే ఉప్పల్, కోఠీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి కొండాపూర్ వెళ్లే బస్సులన్నీ శిల్పారామం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ అధికంగా ఉండే ఈ రెండు మార్గాల్లో ఏర్పాటు చేసిన మూడు బస్షెల్టర్లలో ఎక్కడా బస్సుల రాకపోకలపైన ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. బస్సుల టైం టేబుల్ లేదు. అనౌన్స్మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తారు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినప్పుడు వెళ్లాల్సిందే. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్ప్లే ఏర్పాటు పై అటు గ్రేటర్ ఆర్టీసీ, ఇటు జీహెచ్ఎంసీ సంస్థలు తమకు ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది.’’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్లడమే తమ విధి అని పేర్కొన్నారు. తాగునీళ్లు కరువే.... చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్షెల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకితెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ,కాఫీ,స్నాక్స్ వంటివి ప్రయాణికులకు లభిస్తాయన్నారు. 8 నెలలు గడిచినా ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. ఒక్కోషెల్టర్లో 3 నుంచి 4 గదులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క చోట కూడా మంచినీటి సదుపాయం లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు ఉన్నాయి.కానీ వాటికి నీటి సరఫరా లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు లేవు. సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కానీ వాటి పనితీరు నామమాత్రమే. సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిఘా అంతంతమాత్రంగానే ఉంది. ఏసీ అరకొర... 24 గంటల పాటు ఈ షెల్టర్లలో ఏసీ సదుపాయం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు షెల్టర్లలో ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతను భరించలేక బయటకొస్తున్నారు. షెల్టర్ల బయటే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని షెల్టర్లలో ఏసీ ఉన్నప్పటికీ అది ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని, ఉన్నా లేనట్లేనని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్షెల్టర్లను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ చేపట్టింది.ఈ మూడింటితో పాటు,దిల్సుఖ్నగర్, కోఠీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల వద్ద బస్షెల్టర్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు.మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్లను నాన్ ఏసీ షెల్టర్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. -
అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : కొత్త వ్యక్తులు.. నేరాలకు పాల్పడిన వాళ్లు మీకు తెలిసిన వ్యక్తులు అయిన ఎలాంటి పరిస్థితులలో ఇంట్లో ఆశ్రయం కల్పించరాదు.. మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులు గా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందుగా మీరే వా ళ్లను ప్రశ్నించి వారి దగ్గరి నుంచి వివరాలు సేకరిం చాలి.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని కొత్తగంజ్, సంజయ్‌నగర్ కాలనీల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటిసారిగా పోలీస్ శాఖ మొబైల్ యాప్ ద్వారా స్థానికంగా నివాసం ఉన్న వారికి చెందిన ఆధార్ కార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫింగర్ ఫ్రింట్ స్కా నర్ ద్వారా ఎవరైనా పాత నేరస్థులు ఉన్నారా.. అనే దానిపై కూడా స్థానికంగా నివాసం ఉన్న వాళ్ల ఫింగర్ ఫ్రింట్‌లను పరీక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్న వా రి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర ధానంగా కాలనీలో ఉండే కిరాణాలు, పాన్ దు కాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్‌లో ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐ దుమంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 100మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒక కాలనీ ఎంచుకుని తనిఖీలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు రక్షణలో భాగంగానే ఇ లాంటి తనిఖీలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ పో లీసులకు సహకరించాలని ఆమె పేర్కొన్నారు. -
ఫ్లాట్‌పారంపై షెల్టర్ లేక అవస్థలు
► బస్సు వచ్చే వరకు నేలపైనే పడిగాపులు చీరాల అర్బన్ : చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫారంల కొరత కారణంగా ఫ్లాట్‌ఫారంపై షెల్టర్ లేక ప్రజలు నేలపైనే కూర్చొండి పోతున్నారు. దీంతో నాలుగు గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు బస్సుల కోసం నిలబడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే... చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 16 ఫ్లాట్‌ఫారంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేవు. దీంతో అద్దంకి, ఇంకొల్లు వయా తిమ్మసముద్రం, మరో రెండు గ్రామాలకు వెళ్లే బస్సులకు సంబంధించి ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం ఆరుబయట బండలపైనే వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కొంతమేర మాత్రమే ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఉండడంతో మిగిలిన నాలుగు గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం నేలపైనే కూర్చొనాల్సి వస్తుంది. ఇలా నిత్యం కళాశాలల నుండి వచ్చే విద్యార్థులు, ప్రజలు గంటల తరబడి నిలబడే ఉంటున్నారు. వేసవికాలం కూడా రావడంతో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. గతంలో ప్లాట్‌ఫారాలపై షెల్టర్లు నిర్మించేందుకు ఒక దాత ముందుకు రాగా మిగిలిన ఫ్లాట్‌ఫారంలపై కూడా నిర్మించాల్సి ఉండడంతో తిరిగి వెనుతిరిగారు. ఆర్టీసీ తరుపున కూడా ఎటువంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన లేకపోవడంతో ఆ సమస్య ఎప్పటి నుండో అలానే ఉంది. ప్రయాణీకులు కూడా ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా అధికారులలో స్పందన లేదు. ప్రయాణీకుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు ఇదే విధంగా అవలంభించడంపై ప్రయాణీకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉంది. -
అద్దె భవనాలు.. అరకొర వసతులు
మరుగుదొడ్లు, నీటి సదుపాయం కరువు ఇదీ అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి పట్టించుకోని అధికారులు ఇల్లంతకుంట: మూడు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులలో చదువుపై ఆసక్తిని పెంపొందించే ఉద్ధేశంతో పాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మండలంలో 66 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 36 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ అస్తవ్యస్థంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండటంతో చిన్నపాటి వర్షం కురిసినా సమస్యలు తలెత్తుతున్నాయి. అనంతగిరి గ్రామంలోని ఓ అంగన్వాడీ కేంద్రం పాత ఇంటిలో నిర్వహిస్తున్నారు. భారీ వర్షం కురిస్తే ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు ప్రతి రోజు భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. అద్దె భవనాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని వారు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. నీటి సదుపాయం.. మరుగుదొడ్లు కరువు.. మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు భోజనం వండి పెట్టాలని చెప్పడంతో ఏడాదిన్నర కాలంగా అంగన్వాడీ కేంద్రాల్లో వంట చేసేందుకు ఆయాలు, కార్యకర్తలు మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.