ఫ్లాట్‌పారంపై షెల్టర్ లేక అవస్థలు
► బస్సు వచ్చే వరకు నేలపైనే పడిగాపులు
చీరాల అర్బన్ : చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫారంల కొరత కారణంగా ఫ్లాట్‌ఫారంపై షెల్టర్ లేక ప్రజలు నేలపైనే కూర్చొండి పోతున్నారు. దీంతో నాలుగు గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు బస్సుల కోసం నిలబడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే... చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 16 ఫ్లాట్‌ఫారంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేవు. దీంతో అద్దంకి, ఇంకొల్లు వయా తిమ్మసముద్రం, మరో రెండు గ్రామాలకు వెళ్లే బస్సులకు సంబంధించి ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం ఆరుబయట బండలపైనే వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కొంతమేర మాత్రమే ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఉండడంతో మిగిలిన నాలుగు గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం నేలపైనే కూర్చొనాల్సి వస్తుంది. ఇలా నిత్యం కళాశాలల నుండి వచ్చే విద్యార్థులు, ప్రజలు గంటల తరబడి నిలబడే ఉంటున్నారు.
వేసవికాలం కూడా రావడంతో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. గతంలో ప్లాట్‌ఫారాలపై షెల్టర్లు నిర్మించేందుకు ఒక దాత ముందుకు రాగా మిగిలిన ఫ్లాట్‌ఫారంలపై కూడా నిర్మించాల్సి ఉండడంతో తిరిగి వెనుతిరిగారు. ఆర్టీసీ తరుపున కూడా ఎటువంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన లేకపోవడంతో ఆ సమస్య ఎప్పటి నుండో అలానే ఉంది. ప్రయాణీకులు కూడా ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా అధికారులలో స్పందన లేదు. ప్రయాణీకుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు ఇదే విధంగా అవలంభించడంపై ప్రయాణీకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉంది.