employment of labor
-
AP: రోజూ జిల్లాకో లక్ష మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను ముగుస్తుండటంతో పేదలు పనుల్లేక వలస పోయే పరిస్థితి లేకుండా ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్చి నెలాఖరుకి కనీసం ఐదు కోట్ల పని దినాల పాటైనా పేదలకు పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఐదేళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా పేదలకు సొంత గ్రామాల్లో పనుల కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పను22ళ కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ రోజూ జిల్లా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పనుల గుర్తింపుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 4,022 కోట్ల మేర ఉపాధి పనులు గత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనులతో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి) ఇప్పటివరకు 19.07 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. 43.08 లక్షల కుటుంబాలకు చెందిన 76.08 లక్షల మంది వారి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకొని ఇప్పటికే రూ. 4,022 కోట్లు లబ్ధి పొందారు. వీరిలో దాదాపు 34 శాతం ఎస్సీ, ఎస్టీలే. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన దాదాపు 70 రోజుల్లో కనీసం ఐదు కోట్లు పనిదినాలు పని కల్పించాలని, మొత్తంగా ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. పని దినాల కేటాయింపులు పెంచిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది మూడో విడత పని దినాల కేటాయింపులు పెంచింది. ఈ ఆర్థిక ఏడాదికి మొదట రాష్ట్రానికి 14 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిన కేంద్రం.. గతంలో ఒక విడత మరో ఐదు కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 19 కోట్ల పనిదినాలు కేటాయింపులు చేసింది. ఆ లక్ష్యం కూడా ఇప్పటికే పూర్తవడంతో మంగవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర అధికారుల వర్చువల్ సమావేశంలో మరో 1.20 కోట్ల పని దినాను కేటాయించింది. దీనితో పాటు వచ్చే రెండు నెలల్లో అవసరం ఉన్న మేరకు మరిన్ని పని దినాల కేటాయింపులు పెంచేందుకు సిద్ధమంటూ కేంద్ర అధికారులు రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. -
మందులు సర్వ నాశనం
♦ అవసరం కోసం పంపిస్తే నిర్లక్ష్యంగా పడేసిన వైనం ♦ మెడిసిన్‌కు ముగిసిన వాడకం గడువు ♦ ఉపాధి కూలీలకు చేరకుండానే చెత్తగా మారిన మందులు నర్సాపూర్ : ఉపాధి కూలీలు పని చేసే చోట గాయపడినప్పుడు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే విచిత్రంగా కూలీలకు చేరకముందే వాటి ఎక్స్పైర్డ్ తేదీ ముగిసింది. రెండేళ్ల క్రితం వచ్చిన మెడికల్ కిట్లు స్థానిక క్లస్టర్ ఆఫీసులోని ఓ గదిలో పడి ఉన్న తీరు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా స్థానిక క్లస్టర్ అధికారి మాత్రం మెడికల్ కిట్లు రాగానే పంపిణీ చేశామని చెప్పడం గమనార్హం. మూలన పడేసిన వైనం డ్వామా నర్సాపూర్ క్లస్టర్ పరిధిలో నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంతోపాటు కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట మండలాలు, పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, జిన్నారం, రామచంద్రాపూర్ మండలాలు ఉన్నాయి. కాగా రామచంద్రాపూర్‌లో జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఎవరూ లేరు. కాగా మిగిలిన ఆరు మండలాల్లో సుమారు 4272 గ్రూపులు ఉండగా సుమారు 75వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకం పనులు చేస్తున్నారు. వారు పనిచేసే చోట గాయపడినప్పుడు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన 200 ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లను ప్రభుత్వం జూలై 2013లో నర్సాపూర్‌లోని క్లస్టర్ కార్యాలయానికి సరఫరా చేసింది. వాటిని ఉపాధి హామీ కూలీల గ్రూపులకు అందచేయాల్సి ఉంది. అయితే క్లస్టర్ అధికారి వాటిని కూలీలకు పంపిణీ చేయకపోవడంతో ఆ 200 కిట్లలో ఉన్న మందుల వినియోగ తేదీ ముగిసిపోయింది. మెడికల్ కిట్లలో అయోడిన్, ఆయింట్మెంట్, స్పిరిట్ బాటిళ్లతోపాటు బ్యాండెయిడ్ క్లాత్, చికిత్సకు అవసరమైన ఇతర వస్తువులు ఉన్నాయి. షెడ్డులకూ గతి లేదు.. 2013 జూలైలో మెడికల్ కిట్లు నర్సాపూర్ క్లస్టర్ ఆఫీసుకు వచ్చినప్పటికీ వాటిని ఇంత వరకు కూలీలకు అవసరమైనప్పుడు వాడకపోవడంతో అవి నిరుపయోగంగా పడిఉన్నాయి. కాగా మెడికల్ కిట్లలో ఉన్న స్పిరిట్ ఉత్పత్తి తేదీ జనవరి 2013 ఉండగా, వినియోగ తేదీ డిసెంబరు 2014 వరుకు ఉంది. కాగా అయోడిన్, ఆయింట్మెంట్ ఉత్పత్తి తేదీ జూన్ 2013 ఉండగా వినియోగ తేదీ 2015 వరకు ఉంది. ఇవన్నీ కూలీలకు చేరకుండా క్లస్టర్ ఆఫీసులోని గదిలో మూలన పడి ఉన్నాయి. కాగా ఎండకాలం, వానా కాలం కూలీలు పనిచేసే చోట షెడ్డులాగా వేసుకునేందుకు టెంట్లు సైతం ఇవ్వలేదని తెలిసింది. రాగానే పంపిణీ చేశాం మా క్లస్టర్‌కు మెడికల్ కిట్లు జూలై 2013లో వచ్చాయి. అవి రాగానే కూలీల గ్రూపులకు పంపిణీ చేశాం. ఆ తర్వాత మళ్లీ మెడికల్ కిట్లు రాలేదు. - వసంత సుగుణ, క్లస్టర్ ఏపీడీ