Empower India
-
రక్షక దళంలో వీర నారీమణులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అసలే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం... అక్కడ పోలీస్ డ్యూటీ అంటే కత్తిమీద సాము లాంటిదే.. అలాంటి ప్రాంతంలో మహిళా పోలీసులు డ్యూటీ చేయడం అంటే అసాధ్యం అంటారు. కానీ వనదేవతలు కొలువైన ములుగు జిల్లాలో మహిళా రక్షకభటులే ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా మారారు. మారుమూల అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఆడది అబల కాదు... కనిపించని ‘నాలుగో సింహమేరా పోలీస్’ అని నిరూపిస్తున్నారు. అన్నల ఇలాఖా ఆడ పోలీసులకు అడ్డాగా మారింది. పురుషులతో సమానంగా... సెంట్రీ నుంచి ఎస్హెచ్ఓ వరకు తెలంగాణలో అధికశాతం అటవీప్రాంతం గల జిల్లా ములుగు. అడవే కాదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన జిల్లాలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి ప్రదేశంలో పోలీస్ డ్యూటీ అంటే మగవారికే ముచ్చెమటలు పడుతాయి. కానీ మహిళా పోలీసులు నిర్భయంగా పని చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు 150 మంది మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా రిసెప్షనిస్ట్, హెల్ప్‌డెస్క్ లో మహిళా పోలీసులు ఉండడం సహజం. కానీ వెంకటాపూర్‌లో 28 మంది పోలీస్ సిబ్బంది ఉంటే అందులో 22 మంది మహిళలే ఉన్నారు. జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్లేకపోయినా, వెంకటాపూర్ పీఎస్‌ను చూస్తే మహిళా పోలీస్ స్టేషన్ అనక తప్పదు. సెంట్రీ డ్యూటీ నుంచి ఇన్చార్జ్ ఎస్హెచ్ఓ డ్యూటీ వరకు మహిళా రక్షకభటులే నిర్వహిస్తారు. ప్రస్తుతం అందులో సగం మంది ఎస్సై పోస్ట్ కొట్టేందుకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడికి చేరి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాసేవలో ముందుంటున్నారు. సరిహద్దు ఠాణాల్లో మన మహిళా శివంగులు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్డీ) గణాంకాల ప్రకారం 2021 జనవరి 1 నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే.. మహిళా పోలీసుల సంఖ్యలో తెలంగాణది 25వ స్థానం. ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో ఉన్న వారు అందులో సగం కంటే తక్కువ. రాష్ట్రంలో మొత్తం పోలీసుల సంఖ్యలో 8.03 శాతం మాత్రమే మహిళలు. వీరిలో 76.5 శాతం క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లే. అదనపు డీజీపీలు అయిదుగురు, ఐజీలు ఇద్దరు, డీఐజీ ఒకరు, ఎస్పీలు 15 మంది, అదనపు ఎస్పీలు 19 మంది, డీఎస్పీలు నలుగురు, ఇన్స్పెక్టర్లు 58 మంది, ఎస్సైలు 514 మంది, ఏఎస్సైలు 214 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 280 మంది, కానిస్టేబుళ్లు 3,630 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో అన్ని కేడర్లలో 8 వేలకు పైగా ఉండగా.. అందులో మహిళలు వెయ్యి మందికిపైగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తుండటం విశేషం. -
విద్యుత్ సంస్థల బాకీలపై ఆర్బీఐదే నిర్ణయం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో మొండి ఖాతాలపై రిజర్వ్ బ్యాంకే ఆచరణీయాత్మకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విశిష్ట అధికారాలను ఉపయోగిస్తూ... ఈ అంశంపై ఆర్బీఐకి కేంద్రం ఎటువంటి సూచనలు చేయబోదని స్పష్టం చేశాయి. మొండిఖాతాలపై ఆగస్టు 27లోగా తగు పరిష్కారం లభించకపోతే దివాలా కోర్టుకు నివేదించాలన్న ఆర్బీఐ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం వాటి పిటీషన్‌ను కొట్టివేయడం తెలిసిందే. అయితే, ఆర్బీఐ చట్టంలోని నిబంధనల కింద పదిహేను రోజుల్లోగా పిటీషనర్లకు కొంత ఊరటనిచ్చే చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని ఆదేశించవచ్చంటూ కేంద్రానికి న్యాయస్థానం సూచించింది. దీనిపైనే స్పందించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు. ‘రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్రం సూచనలు చేసేందుకు చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ విద్యుత్ రంగంలోని మొండిబాకీల అంశం చాలా చిన్నదే కావడం వల్ల ప్రస్తుతం ఆర్బీఐకి కేంద్రం ఎటువంటి సూచనలు చేసే అవకాశం లేదు. అలా కాకుండా ఆర్బీఐనే తగు ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం‘ అని ఆయన వివరించారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ఆర్బీఐ సర్క్యులర్ ప్రభావం పది కంపెనీల మాత్రమే ఉంటుందని చెప్పారు. వీటిల్లోనూ అయిదింటిని పునరుద్ధరించవచ్చని, దివాలా చట్టం కింద మరో అయిదింటిని పునర్వ్యవస్థీకరించవచ్చన్నారు. ఎన్పీఏలపై సమావేశానికి ఆర్బీఐకి ఆహ్వానం విద్యుత్ రంగ ఎన్పీఏల పరిష్కారానికి ఆగస్ట్ 31న జరిగే సాధికారిక కమిటీకి ఆర్బీఐని ఆహ్వానించినట్టు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఈ అంశంలో ఆర్బీఐ పాత్ర కూడా ఉండడంతో ఆహ్వా నించినట్టు చెప్పారు. కాగా, విద్యుత్ రంగ ఎన్పీఏలకు సంబంధించి దివాలా చర్యలకు అదనపు గడువు విషయంలో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను వినియోగించుకోవాలన్న అంశాన్ని... కేబినెట్ సెక్రటరీ అధ్యక్షనత గల ఉన్నత స్థాయి కమిటీయే నిర్ణయిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల ఎన్పీఏలపై అసాధారణ అధికారాలను వినియోగించుకునే అవకాశం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో గార్గ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. విద్యుత్ రంగానికి ఇచ్చిన రూ.1.74 లక్షల కోట్ల మేర ఎన్పీఏ ఖాతాలను ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు ఎన్సీఎల్టీకి నివేదించాల్సిన విషయం తెలిసిందే. -
యూత్‌కి సత్య నాదెళ్ల సలహా ఇదే!
భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. 'టెక్ ఫఱ్, ఐడియాస్ ఫర్ ఇండియా' (మంచి కోసం సాంకేతికత, భారత్ కోసం ఆలోచనలు) అంశంపై ఆయన ప్రసంగిస్తూ మొదట గాలీబ్ సూక్తిని ఉటంకించారు. ప్రపంచానికి నిరంతరం స్ఫూర్తినిచ్చే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన కొనియాడారు. యువ ఔత్సాహికులకు మీరు ఇచ్చే సలహా ఏమిటని అడుగ్గా.. 'ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో అవ్వడం లాంటి ఉన్నతమైన కలల సాకారానికి కృషి చేయండి' అంటూ నాదెళ్ల సూచించారు. 'భారత ప్రజల మేధోకుశలతను పెంపొందించే వేదికను అందించేందుకు మేం కృషి చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. కంటిచూపులేని వారికి, తక్కువగా ఉన్నవారికి ఉపయోగపడేవిధంగా తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ లెవెల్ స్మార్ట్‌గ్లాసెస్ వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీనిని మైక్రోసాఫ్ట్‌కు చెందిన హోలోలెన్స్ కంపెనీ రూపొందించింది. ప్రధానమంత్రి మోదీతో భేటీ! సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల మూడోసారి భారత పర్యటనకు వచ్చారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రారంభమై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అలాగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులను కూడా ఆయన కలువనున్నారు.