end card
-
Russia-Ukraine war: ఎండ్ కార్డ్ ఎప్పుడు?
రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదకిన దొరకదు; గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో – శ్రీశ్రీ ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితీ ఇదే! దేశంలో రక్తపుటేరులు పారుతున్నాయి. అమాయక పౌరులు శవాల గుట్టలుగా మారుతున్నారు. విధ్వంసం తాండవిస్తుంటే తలదాచుకునే నీడ కరువై దేశం వీడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. రష్యా విసిరిన పంజాకు ఉక్రెయిన్ తల్లడిల్లుతుంటే, ప్రత్యక్షంగా ఈ యుద్ధ ప్రభావానికి లోనుకాని వాళ్లకు ఈ దృశ్యాలన్నీ చరిత్ర చెక్కుతున్న రుధిర చిత్రాలే! ఈ ఏడాది ఫిబ్రవరి 24న వ్లాదిమిర్ పుతిన్ తన పొరుగు దేశమైన ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దండయాత్రను ప్రకటించినప్పుడు ప్రపంచం యావత్తూ షాక్‌కు గురైంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ దురాక్రమణను తాము ముందే ఊహించినట్టు చెప్పుకొచ్చారు. నెలలు గడుస్తున్నా రోజూ తెల్లారుతున్న మాదిరిగానే యుద్ధమూ కొనసాగుతూనే ఉంది. చాలామంది యుద్ధం వార్తలు చదవడం ఆపేశారు కూడా. మొదట్లో పతాక శీర్షికలకెక్కిన యుద్ధ వార్తలు ఇప్పుడు అట్టడుగుకు చేరుకున్నాయి. ప్రసార మాధ్యమాల్లో సైతం యుద్ధ వార్తలపై ఇదే ధోరణి. వీటితో నిమిత్తం లేకుండా కదనరంగంలో మాత్రం విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజుకెందరు ప్రాణాలు విడుస్తున్నారో, ఇంకెందరు నిరాశ్రయులవుతున్నారో లెక్క లేదు. ఈ విధ్వంసం, మానవ హననం ఏ స్థాయికి వెళ్తాయో ఊహించలేము. మరోవైపు యుద్ధానికి అంతమెప్పుడన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమోనని నెటిజన్లంతా ఇంటర్నెట్ను శోధిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే యుద్ధం కేలండర్‌ను గానీ, మారుతున్న తేదీలను గానీ పట్టించుకోదు. ఒకరకంగా యుద్ధానికి కేలండర్పై చిన్నచూపనే అనుకోవాలి. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన సిసిలీ ద్వీపానికి, నెదర్లాండ్స్‌కు ఓ వివాదం ఏకంగా 335 ఏళ్లు కొనసాగింది. ఒక రకంగా ఇదో రక్తపాత రహిత యుద్ధం. ఒక్క బులెట్ ఫైర్ కాలేదు. ఒక్క మరణమూ చోటుచేసుకోలేదు. దేనికోసమైతే యుద్ధం మొదలైందో ఆ సమస్యకు కదనరంగంలో జవాబు దొరికినప్పుడే ఏ యుద్ధమైనా ముగుస్తుంది. లేదా వైరిపక్షాల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడినప్పుడు ముగుస్తుంది. యుద్ధానికి ప్రేరేపించిన లక్ష్యాలు నెరవేరినప్పుడూ, లేదా నెరవేరడం అసాధ్యమని తేలినప్పుడు కూడా యుద్ధం ముగుస్తుంది. ఇలాంటి ముగింపులు అఫ్గానిస్తాన్, సిరియా, లిబియా విషయాల్లో కనిపించాయి కూడా. ఈ నేపథ్యంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎందుకు ముగియడం లేదన్నది నెటిజన్లు ఎక్కువగా వెదికిన అంశం కావడం ఆసక్తికరం. పుతిన్ అసలెందుకు ఉక్రెయిన్‌పై దాడికి దిగినట్టు? దాన్ని ఆక్రమించే సత్తా తనకుందని గట్టిగా నమ్మే దండయాత్ర ఆరంభించాడు. ఉక్రెయిన్‌కు నాటో ఆయుధాలు అందించగలదే గానీ దానికి మద్దతుగా కదనరంగంలో కాలుపెట్టదనీ విశ్వసించాడు. అమెరికా ప్రతిచర్య మాటలకే పరిమితమవుతుందని కూడా ముందే ఊహించాడు. రెండు శతాబ్దాలు రష్యాలో భాగంగానే ఉన్న ఉక్రెయిన్ నాటోకు వ్యతిరేకంగా తనతో చేయి కలపాలని పుతిన్ ఆశించాడు. మాట విననందుకు దాన్ని మిలిటరీరహిత దేశంగా చూడాలని పంతం పట్టాడు. పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాటలయుద్ధం కదనరంగానికి దారితీసి సామాన్యుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఇద్దరూ ‘తగ్గేదే లే’ అంటూ కలబడుతున్నారు. యుద్ధం వల్ల వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో రష్యా, ఉక్రెయిన్ నుంచి క్రూడాయిల్, గోధుమల ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్రూడ్, గోధుమలకు వాటిపై ఆధారపడ్డ దేశాలన్నీ తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయి. కనీసం కొంతకాలంపాటు కాల్పుల విరమణ ప్రకటించినా వెసులుబాటుగా ఉండేదంటున్నాయి. కానీ ఇప్పట్లో ఆ అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. రష్యాకు లొంగిపోయి పుతిన్ కనుసన్నల్లో బతకడానికి జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. మరోవైపు పుతిన్‌ది విచిత్రమైన పరిస్థితి. పైకి బలంగా కనిపించినా భారీగా బలగాలను కోల్పోయిన రష్యా, ఇప్పుడు యుద్ధం ఆపడమంటే వెనకడుగు వేసినట్టేననే భావనలో ఉంది. మరి యుద్ధం ఆగేదెట్లా? ఇప్పటికిది సమాధానం లేని ప్రశ్నే. – సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి -
విండోస్ 11 రాకతో స్కైప్ కథ ముగిసినట్టేనా..!
మైక్రోసాఫ్ట్ కంపెనీ తదుపరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్షన్ విండోస్ 11 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మరింత సరళతరమైన డిజైన్‌తో పాటు, ఆండ్రాయిడ్ యాప్స్ విండోస్‌లో పనిచేసేలా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది మైక్రోసాఫ్ట్. కాగా విండోస్ 11 రాకతో ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ స్కేప్‌కు ఎండ్ కార్డ్ పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో బై డిఫాల్ట్‌గా వీడియో కాలింగ్ రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో స్కేప్ కనుమరుగయ్యే అవకాశాలున్నాయిని ఐరిష్ & సండే ఇండిపెండెంట్ టెక్ ఎడిటర్ అడ్రియన్ వెక్లర్ పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సుమారు 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్కేప్ కొనుగోలు అతిపెద్ద డీల్‌గా నిలిచింది. గత సెప్టెంబరులో, మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్.. జూమ్, బ్లూజీన్స్ టీమ్స్ ,స్కైప్ ఉపయోగించి వీడియో సమావేశాలను తన చాట్ ఫీచర్లో తెస్తున్నట్లు ప్రకటించగా, అక్టోబర్‌లో, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ గేనోర్ మాట్లాడుతూ..స్కైప్ మరింత విస్తరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసిన, వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా కొన్ని రోజుల్లోనే గూగుల్ మీట్, జూమ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలు వీడియో కాలింగ్ ఫీచర్, మీటింగ్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్కేప్‌పై ఉన్న ప్రజాదరణ కాస్త తగ్గిపోయింది. బహుశా మైక్రోసాఫ్ట్ ఈ కారణం చేతనో స్కేప్‌కు ఎండ్‌కార్డ్ పలకాలని భావిస్తోందని టెక్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. స్కైప్ కు అంతా మేలు చేయలే...! కరోనా మహమ్యారితో ప్రముఖ వీడియో కాలింగ్, మీటింగ్ యాప్ జూమ్ అత్యంత ఆదరణ ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో స్కైప్‌లో ఏలాంటి గ్రోత్ కనిపించలేదు. సుమారు 70 శాతం ప్రజలు స్కైప్ నుంచి తప్పుకున్నారు. ప్లే స్టోర్‌లో స్కైప్ యాప్ ఆప్షనల్‌గా ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసే నాథుడే లేకుండా అయ్యాడు. చదవండి: గూగుల్ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్‌లో..! -
ఎనీ టైమ్ రెడీ
కుర్రకారును పిచ్చెక్కించే అందం ఇలియూనా సొంతం. నిన్నటి వరకు దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో మురిపించిన ఈ గోవా సుందరి ప్రస్తుతం ఉత్తరాది అభిమానులను అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేమిటో ఈ బ్యూటీ మాటల్లోనే విందాం. ఁనటిగా ప్రవేశించిన తొలి రోజుల్లో చాలా పోరాడాల్సి వచ్చింది. ప్రతిభ కనబరిస్తే అభిమానులు ఆదరిస్తారు. లేకుంటే షూటింగ్ స్పాట్లో కూడా మర్యాద ఇవ్వరు. దక్షిణాదిలో ప్రముఖ నాయికగా వెలుగొందినా హిందీలో బర్ఫీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఎవరూ గౌరవించలేదు. నా కఠిన శ్రమను గుర్తించిన తర్వాతే మర్యాద పెరిగింది. నటన అనేది ఒక వృత్తి మాత్రమే. దానిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండాలి. అదే సమయంలో ప్రతి వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. యవ్వనం ఎల్లప్పుడూ ఉండదు. అది తగ్గుతున్నప్పుడు అభిమానుల్లోనూ మోజు తగ్గుతుంది. అందుకే నటనే జీవితమని భావించరాదు. ఏదో ఒక రోజు దానికి దూరం కావలసి వస్తుందని మా అమ్మ తరచూ చెబుతుంటారు. సినిమాకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వస్తే ఎప్పుడైనా దాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్తగా అందమైన హీరోయిన్లు వస్తే ప్రముఖ హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది. ఎంతటి హీరోయిన్ అయినా ఒక రోజు ది ఎండ్ కార్డు వేస్తారు. ఎలాంటి పయనానికైనా అంతం ఉంటుంది* అని అంది. ఇలియానాకు ఏమై ఉంటుందంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు సినీ వర్గాలు.