రజనీ, అమీర్ తో ఎందిరన్-2 ?
2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా ఎందిరన్‌కు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఎందిరన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబోగా, దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేశారు. ఐశ్వర్యారాయ్ నాయకిగా నటించారు.ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది.
లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఎందిరన్ చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్. ఈ విషయంలో తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఎందిరన్-2లో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించే అవకాశం ఉంది. ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.
ఎందిరన్ చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. శంకర్ ఐ చిత్రాన్ని 120 కోట్లతో తెరకెక్కించారు. కాగా అమీర్‌ఖాన్ నటించిన పికె చిత్ర నిర్మాణ వ్యయం 85 కోట్లు అని తెలిసింది. అయితే ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపితే ఎందిరన్-2 తయారవుతుందన్నమాట.
వీటిలో రజనీ, అమీర్‌ఖాన్, శంకర్ల పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు. చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన. వారి అంత భారీ బడ్జెట్‌తో చిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం.