endoments
-
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం..
-
ఏసీబీ వలలో భారీ తిమింగలం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇంటితోపాటు ఇతర బంధువుల, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురం జిల్లా ఊబిచర్లలో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆస్తులు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడుతున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో విధులు నిర్వహిస్తున్నారు. రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లపై సోదాలు అప్ డేట్ ఏకకాలంలో 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు భారీగా బయటపడుతున్న అక్రమ ఆస్తులు కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్ జేసీ కార్యాలయాన్ని తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్న చంద్రశేఖర్ ఆజాద్ ఏలూరు పత్తేబాద్ సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు విజయవాడ పడమట సమీపంలో విద్యుత్ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయిల విలువ చేసే అయిదు అంతస్తుల భవనం గొల్లపూడిలో కోటిన్నర రూపాయిలతో 500 గజాల స్దలంలో గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాల స్దలంలో అబేధ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్..దీనిపై రూ.15 కోట్ల రుణం ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.. -
ఎందుకీ ప్రహసనం
- బదిలీ చేసేటపుడు ఎన్నో నీతి కబుర్లు - ఏడాది తిరక్కుండానే మాతృ దేవస్థానాలకు బదిలీలు - క్యాడర్ను బట్టి బదిలీకి రేటు...రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ - దేవాదాయ శాఖలో లీలలు... . అన్నవరం: దేవాదాయశాఖలో ఉద్యోగుల బదిలీలు పెద్ద ప్రహసనంగా మారాయి. బదిలీలు చేసేటపుడు ఎంత పెద్ద హంగామా ఉంటుందో, అంతా పారదర్శకత, సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తామని చెబుతుంటారు. భార్యా భర్త ఒకేచోట పని చేస్తున్నామన్నా వినిపించుకోరు. అనారోగ్యకారణాలన్నా కుదరదంటారు. కానీ సిఫార్స్లు, ముడుపులు ముడితే మాత్రం ఏడాది కూడా కాకుండానే అందరినీ ఎవరి దేవస్థానానికి వారిని భద్రంగా బదిలీ చేసేస్తుంటారు. ఈ మాత్రం దానికి బదిలీలు ఎందుకో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు అన్నవరం దేవస్థానం సిబ్బందిని తిరిగి అన్నవరం దేవస్థానానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇతర దేవస్థానాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని కూడా వారి దేవస్థానాలకు బదిలీ చేశారు. అంటే మొత్తం 14 మందిని ఏకకాలంలో బదిలీ చేశారు. ప్రభుత్వ పెద్దల రికమెండేషన్లతోపాటు ఓ మంత్రి పీఏ నిర్ణయించిన ‘ముడుపు’ చెల్లించడంతోటే ఈ బదిలీలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జూన్ నెలలో అన్నవరం దేవస్థానానికి చెందిన 17 మందిని ఇతర దేవస్థానాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన మూడో నెలలోనే ఓ మంత్రి సిఫార్స్తో ఓ ఉద్యోగి తిరిగి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఐదో నెలలో మరో మంత్రి సిఫార్స్తో మరొకరు బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ఏడుగురు ఉద్యోగులకు బదిలీ అయింది. మరో నలుగురు కూడా బదిలీ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. వారికి కూడా వచ్చే వారంలో బదిలీ జరిగే అవకాశం ఉందంటున్నారు. . రూ.25 వేలు నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తే బదిలీ ఖాయం... బదిలీ అయిన దేవస్థానం ఉద్యోగులు వారి దేవస్థానానికి బదిలీ కావాలంటే క్యాడర్ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఓ మంత్రి పీఏకు ముడుపులు చెల్లించుకోవల్సిందే. ఎవరి రికమెండేషన్ ఉన్నా ఈ మొత్తం చెల్లింపు తప్పనిసరని అంటున్నారు. ఈ విధంగా చెల్లించినవారికే బదిలీలు అనే ప్రచారం జరుగుతోంది. . బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులు రిలీవ్... అన్నవరం దేవస్థానంలో పనిచేస్తూ ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులను గురువారం రిలీవ్ చేసినట్లు అన్నవరం దేవస్థానం ఇన్ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన ఉద్యోగులు ఇంకా జాయిన్ కాలేదని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.