energy policy
-
ఢిల్లీవాసి ఆయుర్దాయం పదేళ్లు తగ్గింది!
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల్లో చూస్తే 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయిలకు దిగజారిందని, దాంతో ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని తాజాగా వెల్లడైంది. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. నివేదిక ప్రకారం.. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. నేపాల్ తర్వాత ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన దేశం భారత్ కావడం గమనార్హం. -
మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు
హాంగ్జౌ: నల్లధనం, పన్నుల ఎగవేత అంశాలను చైనాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సోమవారం రెండో రోజు సదస్సులో పాల్గొన్న మోదీ.. ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలను కోరారు. అవినీతి, నల్లధనం, పన్నుల ఎగవేతపై తగిన చర్యలు తీసుకున్నప్పుడే ఆర్థిక పరిపాలన ప్రభావవంతంగా సాగుతుందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక నేరాలపై పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేయాలని సభ్యదేశాలకు విజ్ఞప్తి చేశారు. సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. భారత ఆర్థిక విధానాల్లో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ముఖ్యంగా మోదీ ఎనర్జీ పాలసీని జిన్పింగ్ మెచ్చుకున్నారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను మోదీ కలిశారు.