మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు
హాంగ్జౌ: నల్లధనం, పన్నుల ఎగవేత అంశాలను చైనాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సోమవారం రెండో రోజు సదస్సులో పాల్గొన్న మోదీ.. ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలను కోరారు. అవినీతి, నల్లధనం, పన్నుల ఎగవేతపై తగిన చర్యలు తీసుకున్నప్పుడే ఆర్థిక పరిపాలన ప్రభావవంతంగా సాగుతుందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక నేరాలపై పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేయాలని సభ్యదేశాలకు విజ్ఞప్తి చేశారు.
సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. భారత ఆర్థిక విధానాల్లో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ముఖ్యంగా మోదీ ఎనర్జీ పాలసీని జిన్‌పింగ్ మెచ్చుకున్నారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను మోదీ కలిశారు.