Engineering Staff College of India
-
ఔరా! అతివ..
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లోని పాత క్యాంటీన్ భవనం వద్ద ఉన్న చెట్ల పొదల్లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తోటమాలికి తాచుపాము కనిపించింది. సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యురాలు, బ్యాచిలర్ ఆఫ్ హార్టికల్చర్ విద్యార్థిని నిఖిల తోటి సభ్యులు నిఖిల్, భావనారెడ్డితో కలిసి ఎస్కీకి చేరుకున్నారు. పొదల్లో దాక్కున్న పామును నిఖిల ఇనుప చువ్వ సహాయంతో ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో ఎస్కీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నిఖిల ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ఆరు నెలల పాటు పాములను పట్టుకోవడం, వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచి పెట్టడంపై శిక్షణ పొందారు. ఎవరికైనా పాము కనిపిస్తే సైనిక్‌పురిలో ఉన్న తమ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ హెల్ప్‌లైన్ నెం. 8374233366కు ఫోన్ చేస్తే.. తమ సభ్యులు వచ్చి వాటిని పట్టుకుంటారని నిఖిల, నిఖిల్, భావనారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో స్పార్క్ 10 స్టార్టప్ యాక్సిలేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘కొత్త కంపెనీలంటేనే (స్టార్టప్స్) మంచి ఆలోచనలకు, ఆవిష్కరణలకు వేదికలు. సమస్యల్లా ఆచరణకు అవసరమైన మార్గదర్శకత్వం, నిధుల కొరత’’ ఇదీ స్పార్క్ 10 లీడ్ ఫౌండర్ అటల్ మాలవీయ మాట. దీనికి తగిన పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ వేదికగా ‘స్పార్క్ 10’ స్టార్టప్ యాక్సిలేటర్‌ను ప్రారంభించామని తెలియజేశారాయన. స్పార్క్ 10 వ్యవస్థాపకులు సుబ్బరాజు, విజయ్ కేతన్, ఎల్ఎన్ పర్మి, డాక్టర్ సురేష్ కామిరెడ్డి, రాజేష్ తదితరులతో కలిసి సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. స్టార్టప్స్ హబ్‌గా పేరొందిన బెంగళూరును కాదని హైదరాబాద్‌లో ఈ యాక్సిలరేటర్‌ను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. స్పార్క్ 10 ఫౌండర్స్‌లో చాలా మంది ఇక్కడి వారే కావటం ఒకెత్తయితే... ఇక్కడి స్టార్టప్స్‌కు కాసింత ప్రోత్సాహం, ఆఫీసు స్థలం కల్పిస్తే ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. అందుకే భాగ్యనగరాన్ని ఎంచుకున్నామన్నారు. అసలు స్పార్క్ 10 ఏం చేస్తుందని అడిగిన ప్రశ్నకు... ‘‘భవిష్యత్తు అవసరాలను తీర్చే 10 స్టార్టప్స్‌ను ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో స్టార్టప్స్‌లో రూ.20 లక్షలు పెట్టుబడులు పెడతారు. 13 వారాల పాటు ప్రపంచ స్థాయి మెంటార్స్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలుంటాయి. మరి స్పార్క్ 10కి ఏం లాభమంటే.. నిధుల సమీకరణ అయ్యాక.. కంపెనీ ఒక స్థాయికొచ్చాక.. ఆ స్టార్టప్స్‌లో కొంత వాటా తీసుకుంటాం. అది సుమారు 8% వరకూ ఉండొచ్చు’’ అని అటల్ వివరించారు. స్టార్టప్స్‌లకు ఆఫీసు ఏర్పాటుకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)లో రెండున్నర ఎకరాల్లో క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు. తొలి విడతగా 4,000 చ.అ. కార్యాలయ స్థలాన్ని అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తు విధానాన్ని వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ప్రారంభిస్తామన్నారు. మెంటార్స్‌గా యూరోపియన్ స్టార్టప్స్‌కు గాడ్ ఫాదర్‌గా పేరొందిన జాన్ బ్రాడ్ఫోర్డ్తో ఈగ్నైట్ సీఈఓ పాల్ స్మిత్, హెచ్‌బీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కేతన్ మిత్రా.. సుమారు 500 మంది ఉంటారన్నారు. అలాగే 25-30 మంది పెట్టుబడిదారులు కూడా ఈ యాక్సిలరేటర్‌లో రిజిస్టరై ఉన్నారన్నారు. రెండేళ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యమని మాలవీయ తెలియజేశారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్లే కీలకం
రాయదుర్గం: దేశాభివృద్ధిలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించాలని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) డెరైక్టర్ డాక్టర్ యు చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్కీలో నిర్వహిస్తున్న ఐఈ ఫెస్ట్-2014లో భాగంగా సోమవారం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇంజినీర్లందరికీ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్కీ ఐఈ ఫెస్ట్ కోఆర్డినేటర్లు సాయి కిషోర్, నిఖిల్ చౌదరి, సుబ్రహ్మణ్యం తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్, ఎస్కీ సంయుక్తంగా ఈ సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్కీ నుంచి 85 మంది ఇంజినీర్లు సైకిళ్లపై గచ్చిబౌలి కూడలి, ట్రిపుల్ ఐటీ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు అక్కడి నుంచి తిరిగి అదేమార్గంలో ఎస్కీ వరకు సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగిసిన ఐఈ ఫెస్ట్.... ఐఈ ఫెస్ట్-2014 పేరిట ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రెండు రోజులుగా నిర్వహించిన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 20 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు రెండు రోజులుగా నిర్వహించిన నూతన ఆవిష్కరణల ప్రదర్శన, సెమీనార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఆటవిడుపు కోసం పలు వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇంజినీర్లు కష్టపడి పనిచేయాలి పంజగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీజన్ ప్రకారం రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ రావాలంటే ఇంజినీర్లు కష్టపడి పనిచేయాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె.జోషి కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. సోమవారం సోమాజిగూడలోని విద్యుత్ ఇంజినీర్ల భవన్లో తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సుధాకర్ రావు అధ్యక్షతన 47వ ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వర య్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన ఇంజినీర్లకు జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన్కో చైర్మన్, ఎండీ డి. ప్రభాకర్ రావు, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీ అహ్మద్‌నదీమ్, ట్రాన్స్‌కో జేఎండీ కార్తికేయ మిశ్ర, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ వెంకటనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ రఘురామరెడ్డి తదితరులు ప్రసంగించారు. జలమండలిలో.. సాక్షి,సిటీబ్యూరో: 47వ ఇంజినీర్స్ డేను సోమవారం జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగరానికి చేసిన సేవలను పలువురు అధికారులు కొనియాడారు. ఈకార్యక్రమంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి,ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్రావు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో.. ఇంజినీర్స్డే సందర్భంగా జీహెచ్ఎంసీలో జరిగిన కార్యక్రమంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఇంజినీర్లు. చిత్రంలో ఈఎన్సీ ఆర్.ధన్సింగ్, ఎస్ఈలు శ్రీధర్, కిషన్, మోహన్‌సింగ్, తదితరులున్నారు. -
ఆకట్టుకున్న ‘ఐఈ ఫెస్ట్-2014’