Errolla srinivas
-
కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీ
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందున ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కేందుకు రేవంత్ ప్రయతి్నస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా గురువారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలనే విష సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పేరిట డబ్బా కొడుతూ, సీఎం రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ సమాజమే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. -
'దళితులపై దాడులు జరిపేందుకే...'
హైదరాబాద్: దళితులపై దాడులు జరిపేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. 12 చోట్ల దళితులపై టీడీపీ నేతలు దాడులు చేశారని వారు గురువారమిక్కడ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దళితులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వరంగల్‌లో పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలని ఎర్రళ్ల శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్యాకేజీలు మాట్లాడుకుని ఎర్రబెల్లి దయాకరరావు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. -
గబ్బర్ సింగ్ హీరోలా మాట్లాడాడే కానీ...
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌కు పార్టీపై అవగాహన లేదని.. ఏవో సినిమా డైలాగులతో జనసేన అంటూ పార్టీ పెట్టారని టీఆర్ఎస్ నేత ఎర్రొళ్ళ శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు అన్నారు. తెలంగాణ ప్రజలను, సంస్కృతినీ కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఎర్రొళ్ళ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు... గబ్బర్ సింగ్ హీరోలా మాట్లాడాడే కానీ ఒక పరిణితి చెందిన నాయకుడిగా, ఉద్యమకారుడిలా, ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తిలా మాట్లాడలేదని ఎర్రొళ్ళ అన్నారు. కేవలం ప్రజలపైన, సమాజంపైనా అవగాహన లేదని అర్థం అయిపోయిందన్నారు. చంద్రబాబును సీఎంను చేయటానికే మరోరూపంలో వచ్చిన ఆంధ్రా బాబు...పవన్ కల్యాణ్ బాబుగానే చూస్తామే తప్ప...ఈ ప్రాంతానికి ఏదో చేస్తాడనే అభిప్రాయం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పవన్ పెట్టింది జనసేన కాదని బాబుసేన అని ఎర్రొళ్ళ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తే తాటా తీస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆయన హెచ్చరించారు.