వరంగల్లో పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలని టీఆర్ఎస్ నేతలు అన్నారు.
హైదరాబాద్: దళితులపై దాడులు జరిపేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. 12 చోట్ల దళితులపై టీడీపీ నేతలు దాడులు చేశారని వారు గురువారమిక్కడ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దళితులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
వరంగల్లో పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలని ఎర్రళ్ల శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్యాకేజీలు మాట్లాడుకుని ఎర్రబెల్లి దయాకరరావు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.