Peddireddy sudarshan reddy
-
నర్సంపేట నియోజకవర్గానికి తదుపరి చారిత్రక అభ్యర్థి ఎవరు..?
నర్సంపేట నియోజకవర్గం నర్సంపేటలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిఆర్ఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సుదర్శనరెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా ఉండేవారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాదవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాదించగా, 2018లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేతగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి 2014లో నర్సంపేటలో ఓటమి చెందారు. ఆయన 2014లో ప్రత్యర్ధిగా కూడా నిలవలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ టిక్కెట్ చివరిక్షణంలో కోల్పోయి, స్వతంత్రుడుగా పోటీచేసిన దొంతి మాధవరెడ్డి 2014లో గెలవడం విశేషం టిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శనరెడ్డి ఆ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి, మాధవరెడ్డి చేతిలో 18376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2018లో మాధవరెడ్డిని సుదర్శనరెడ్డి ఓడిరచారు. 2014లో ప్రకాష్ రెడ్డికి 34479 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కత్తి వెంకటస్వామికి 6638 ఓట్లు దక్కాయి. రేవూరి 2018లో ఇక్కడ నుంచి వరంగల్ పశ్చిమకు మారి పోటీచేసినా గెలవలేకపోయారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెండుసార్లు అది కూడా 1957, 1967లలోమాత్రమే గెలిచింది. 1972 నుంచి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది. అయితే 2004లో కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చిన టిఆర్ఎస్ విజయం సాధించింది. వామపక్ష నేతలలో ఒకరైన మద్దికాయల ఓంకార్ ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయన మూడుసార్లు సిపిఎం పక్షాన గెలిస్తే, ఆ తర్వాత పార్టీకి దూరమె సొంతంగా ఎమ్.సిపిఐని ఏర్పాటుచేసుకున్నారు. రెండుసార్లు ఇండిపెండెంటుగా నెగ్గారు. 1994లో టిడిపి అభ్యర్ధి రేవూరి ప్రకాష్‌రెడ్డిపై 87 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రకాష్‌రెడ్డి 1999లో గెలిచాక 610 జీఓపై శాసనసభలో ఏర్పాటు చేసిన సభాసంఘానికి నాయకత్వం వహించారు. రేవూరి మూడుసార్లు గెలిచారు. కొంతకాలం టిడిపి పాలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా వ్యవహరించారు. నరసంపేటలో ఏడుసార్లు రెడ్లు, ఐదుగురు బిసివర్గం నేతలు రెండుసార్లు ఇతరులు గెలిచారు. నర్సంపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రేవంత్‌రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రగతి భవన్ పేల్చాలన్న వాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ,మండలి మీడియా పాయింట్ల్లో బుధవారం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీతోపాటు పార్లమెంట్ స్పీకర్‌కు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సంఘ విద్రోహ శక్తులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. పేల్చేయడం, కూల్చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? దీనితో ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ పర్యటన వరంగల్ చరిత్రలో మిగిలిపోయేలా సాగింది. అయితే, ఆద్యంతం ఉల్లాసంగా సాగిన ఆయన పర్యటనను అందరూ నెమ్మదిగా మరచిపోయే తరుణంలో ఆ రోజు జరిగిన పరిణామాలపై సీఎంఓ వర్గాలు సమగ్ర నివేదిక కోరడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన సందర్బంగా ఐదు రోజుల ముందు నుంచే కసరత్తు చేసినా.. ఆ రోజు చోటుచేసుకున్న చెదురుముదురు సంఘటనలు, వాటికి గల కారణాలను పోలీసు, ఇంటలిజెన్స్ వర్గాల విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా కట్టడి చేసినప్పటికీ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో హఠాత్తుగా కొన్ని విద్యార్థి సంఘాల బాధ్యులు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. పెద్ది.. అడ్డగింత సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొనేందుకు వస్తుండగా ఆయన వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుండి సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు ఆయన గన్మెన్లతో కలిసి నడిచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత జయశంకర్ వర్దంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏకశిల పార్కు వద్దకు వెళ్లిన సందర్భంగా కూడా మరోసారి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జయశంకర్‌కు నివాళులరి్పంచేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్బంగా ఎవరినీ పంపించబోమని పోలీసులు తేల్చిచెప్పారు. కాగా, తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, సీఎం కేసీఆర్ రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు, వారి భద్రత దష్ట్యా పోలీసులకు, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నడిచి వెళ్లానని ఆయన అదే రోజు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలపై సీఎంఓ వర్గాలు నివేదిక కోరడం, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపిన పోలీసులను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న ఓ పోలీసు అధికారిని వాగ్వాదానికి దిగగా... అసలేం జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. చదవండి: వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్ -
టీఆర్ఎస్ నేతకే టోకరా
టీఆర్ఎస్ నేతకే టోకరా వేసేందుకు ప్రయత్నించారు ముగ్గురు కేటుగాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పధకం కింత నిధులు మంజూరు చేయిస్తామంటూ.. ఏకంగా.. టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది రెడ్డి సుదర్శన్ రెడ్డకి ఫోన్ చేశారు. ఆయన అప్రమత్తం కావడంతో అడ్డంగా దొరికి పోయారు. వివరాల్లోకి వెళితే.. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ ని అంటూ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం టీఆర్ఎస్ ఇన్ చార్జి పెద్ది రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఈనెల 26న గుర్తుతెలియని వ్యక్తి పోన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పీఎమ్ఈజీపీ) పథకంలో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పాడు. మీ నియోజకవర్గంలో ఈ పధకం కోసం రూ.2కోట్లను మంజూరు చేయిస్తానని నమ్మించాడు. ఈ నిధులు మంజూరు కావాలంటే రూ.50వేలు అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుందని, రూ.50వేలను ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 30976640437 లో జమచేయాలని సూచించారు. దీంతో అనుమానం వచ్చిన సుదర్శన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
'దళితులపై దాడులు జరిపేందుకే...'
-
'దళితులపై దాడులు జరిపేందుకే...'
హైదరాబాద్: దళితులపై దాడులు జరిపేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. 12 చోట్ల దళితులపై టీడీపీ నేతలు దాడులు చేశారని వారు గురువారమిక్కడ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దళితులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వరంగల్‌లో పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలని ఎర్రళ్ల శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్యాకేజీలు మాట్లాడుకుని ఎర్రబెల్లి దయాకరరావు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.