Esha Koppikar
-
ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్
కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. ఇటివల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. సుచి లీక్స్, సింగర్ చిన్మయ్ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా నాగార్జున ‘చంద్రలేఖ’ హీరోయిన్ ఈషా కొప్పికర్ సైతం కాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పింది. 90లో ఇషా కొప్పికర్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించిన సంగతి తెలిసిందే. 2009లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె..నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో కీ రోల్ పోషించి రీఎంట్రి ఇచ్చింది. చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ వస్తున్న ఇషా రీసెంట్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చదువుకుంటున్న క్రమంలోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘‘ఏక్ థా దిల్ థా ధడ్కన్’ ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యాను. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పాడు. ఇందుకోసం మీరు మొదట హీరోని కలవాలి అని చెప్పాడు. ఆ తర్వాత హీరోకి కాల్ చేస్తే ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్ ఎవరు ఉండకూడదు’ అన్నాడని’’ చెప్పుకొచ్చింది. చదవండి: హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు అలాగే ఆ హీరోతో మాట్లాడాక తనకు అసలు విషయం అర్థమైందని, వెంటనే నిర్మాతకు ‘నా టాలెంట్, లుక్స్‌తో ఇక్కడకు వచ్చాను. అదే విధంగా నాకు అవకాశాలు వస్తే చేస్తాను’ అని తెగేసి చెప్పినట్లు పేర్కొంది. దీంతో సదరు నిర్మాత, హీరో తన మీద కోపంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించినట్లు ఈషా తెలిపింది. 'ఏక్ థా దిల్ ఏక్ థా ధడ్కన్'తో హీరోయిన్గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్. ఆ తర్వాత వరస ఆఫర్లు అందుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు తెలుగు, కన్నడ, తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగులో నాగార్జున చంద్ర లేఖ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో నటించింది. చంద్రలేఖ సినిమాలో ఇషా తెలుగు గుర్తింపు పొందింది. -
మాకు మంచి జరగాలి
... అని మనసారా కోరుకుంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. సర్లే కానీ మాకు అని అంటున్నారు మరి మిగతా వారెవరో అంటే... ప్రస్తుతానికి తమిళ నటుడు శివకార్తీకేయన్, ఏఆర్ రెహ్మాన్ అండ్ టీమ్ అన్నమాట. ‘ఇండ్రు నేట్రు నాళై’ ఫేమ్ ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా 24ఎమ్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో రకుల్ పాల్గొనలేకపోయారు. ‘‘మిస్సయ్యాను.. మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ’’అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అన్నట్లు.. ఈ మిస్ ఎందుకు మిస్ అయ్యారంటే... కాస్త ఆరోగ్యం సరిగా లేదట. అందుకోసమే ఇంట్లో ఉంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ రికవరీ అవుతున్నారని సమాచారమ్. అలాగే ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానున్న సూర్య ‘ఎన్జీకే’ చిత్రంలో రకుల్ ఒక కథానాయిక. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘దేవ్’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు ఆమె. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ సినిమాలో కూడా రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: లక్కీ అలీ (గాయకుడు); ఇషా కొప్పికర్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవితం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. పుట్టిన తేదీ 19. దీనివల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ; నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, రెడ్, ఆరంజ్; సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సుదర్శన హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం, తల్లిని, తోబుట్టువులను ఆదరించడం, అనాథలకు మందులు పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్