ESPN Cricinfo award
-
రిషబ్ పంత్‌ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌ను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2021వ సంవత్సరానికి గాను ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఉత్తమ టెస్ట్ బ్యాటింగ్ అవార్డుకు పంత్ ఎంపికయ్యాడు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గాను పంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరి ప్రకటించింది. ఆ మ్యాచ్‌లో 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. తద్వారా గబ్బాలో 32 ఏళ్లుగా ఓటమంటూ ఎరుగని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించాడు ఈ టీమిండియా డైనమైట్. ఇదిలా ఉంటే, ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన 15వ ఎడిషన్ అవార్డుల్లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుకు ఎంపికయ్యాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021లో కివీస్ గెలిపించినందుకు గాను అతడిని ఈ అవార్డు వరించింది. ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఇతర అవార్డుల్లో ఉత్తమ టెస్ట్ బౌలింగ్ అవార్డుకు కైల్ జేమీసన్ (భారత్‌పై 5 వికెట్ల ప్రదర్శనకు), వన్డే బ్యాటింగ్ అవార్డుకు ఫఖర్ జమాన్ (దక్షిణాఫ్రికాపై 193 ప్రదర్శనకు), వన్డే బౌలింగ్ అవార్డుకు సకీబ్ మహమూద్ ( పాకిస్తాన్‌పై 4 వికెట్ల ప్రదర్శనకు), టీ20 బ్యాటింగ్ అవార్డుకు జోస్ బట్లర్ (శ్రీలంకపై 101 ప్రదర్శనకు), టీ20 బౌలింగ్ అవార్డుకు షాహీన్ అఫ్రిది (టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 3 వికెట్ల ప్రదర్శనకు), డెబ్యూటెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఒలీ రాబిన్సన్ ఎంపికయ్యారు. అజిత్ అగార్కర్, రసెల్ ఆర్నాల్డ్, ఇయాన్ బిషప్, డారిల్ కలినన్, డారెన్ గంగా, టామ్ మూడీ, డేనియల్ వెటోరిలతో కూడిని 20 మంది సభ్యుల జ్యూరీ అవార్డు విన్నర్లను ఎంపిక చేసింది. చదవండి: కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు -
కోహ్లి నీ కళ్లకు కనిపించటం లేదా?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ ఆఫ్ ది ఇయర్-2017 గానూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆయన ఓటు వేయటంతో అసలు వ్యవహారం మొదలైంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్ అవార్డులకు నామినీలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ కెప్టెన్లు స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ అహ్మద్, అస్గర్ స్టానిక్‌జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్ తాను మాత్రం సర్ఫరాజ్ అహ్మద్‌కే ఓటేస్తానని చెప్పాడు. మంజ్రేకర్ అభిప్రాయం ఏంటంటే... ‘‘కష్టకాలంలో సర్ఫరాజ్ కెప్టెన్సీ పాకిస్థాన్‌కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్ జట్టును కెప్టెన్‌గా విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీని తన దేశానికి అందించటం.. ఎక్కువ మ్యాచ్‌లను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉంది.(మొత్తం 13 వన్డే మ్యాచ్..11 గెలుపు, 2-ఓటమి.. టీ20మ్యాచ్‌లు 10.. 8-గెలుపు, 2-ఓటమి). మిగతా వారికంటే సర్ఫరాజ్ కష్టం ఎక్కువ కనిపిస్తోంది. అందుకే అండర్ డాగ్ జట్టయిన పాక్ సారథికే నా ఓటు’’ అని తెలిపాడు. అంతే... కోహ్లిని కూడా కాదని, దాయాది జట్టు కెప్టెన్ కు ఓటేయటంపై మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్’ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర్ఫరాజ్ ఓవరాల్ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్.. మంజ్రేకర్ వేస్ట్ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్ అభిప్రాయంపై పాక్‌లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది. పాక్‌ను అండర్ డాగ్ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్లను జేజిక్కిచ్చుకున్న పాక్‌ను మంజ్రేకర్ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. -
ఉత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో-2015 అవార్డులకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. అన్ని రకాల(వన్డే, టెస్ట్, టీ20) ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డులు ఇస్తారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో-2015 అవార్డులకుగానూ ప్రకటించిన వారిలో న్యూజిలాండ్ జట్టు నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ► భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను 'ఉత్తమ టీ20 బ్యాట్స్‌మెన్'గా ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ చేసిన 106 పరుగులకుగానూ ఈ అవార్డు అతన్ని వరించింది. రోహిత్ చేసిన డబుల్ సెంచరీలకుగానూ 2013, 2014 సంవత్సరాల్లో వన్డే విభాగంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. ► 30 ఏళ్ల కిందటి నుంచి వివ్ రిచర్డ్స్ పేరుమీదున్న ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేసిన మెక్కల్లంకు 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. న్యూజిలాండ్ జట్టును ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేర్చినందుకుగానూ 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అతన్ని వరించింది. ► ఆషెస్ సిరిస్‌లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 60 పరుగులకే కుప్పకూలేలా కృషి చేసినందుకు గానూ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ను 'బెస్ట్ టెస్ట్ బౌలర్' అవార్డు వరించింది. ► వెల్లింగ్టన్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 242 పరుగులు చేసినందుకు 'బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్' అవార్డు ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వరించింది. ► జొహన్నస్ బర్గ్‌లో వెస్ట్ ఇండిస్తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఏబీ డివిలియర్స్ 'వన్డే ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. ► వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లు తీసినందుకుగానూ సౌతీకి 'వన్డే బెస్ట్ బౌలింగ్' అవార్డు లభించింది. డేవిడ్ వీస్‌కు 'టీ20 బెస్ట్ బౌలర్' అవార్డుకు ఎంపికయ్యారు.