Essar Oil
-
రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్...
♦ 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న రష్యా కంపెనీ ♦ విక్రయ లావాదేవీ పూర్తి ♦ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ డీల్ ♦ దేశీయ బ్యాంకులకు ఊరట ముంబై: రుణభారంతో సతమతం అవుతున్న ఎస్సార్ గ్రూపు తన పరిధిలోని ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది. ఎస్సార్ ఆయిల్, దాని పరిధిలోని పోర్టు, విద్యుత్తు, రిటైల్ ఆస్తులను రాస్‌నెఫ్ట్‌తోపాటు ఇతర ఇన్వెస్టర్ల కన్సార్టియం 12.9 బిలియన్ డాలర్లు (రూ.82,500 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. వాస్తవానికి ఈ డీల్ గతేడాది అక్టోబర్ 15న గోవా బ్రిక్స్ సదస్సు సందర్భంగా సాకారం కాగా అదిప్పుడు పూర్తయింది. రాస్‌నెఫ్ట్ రష్యా ప్రభుత్వ సంస్థ. ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద చమురు, సహజవాయువు సంస్థగా ఉంది. ఎస్సార్ ఆయిల్‌కు చెందిన గుజరాత్‌లోని 20 మిలియన్ టన్నుల వాదినార్ రిఫైనరీ, 58 మిలియన్ టన్నుల క్యాప్టివ్ పోర్ట్, 1,010 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, 3,500 పెట్రోల్ బంక్‌లు రాస్‌నెఫ్ట్, దాని కూటమికి చెందుతాయి. మొత్తం మీద ఈ ఆస్తుల్లో రాస్‌నెఫ్ట్ ఒక్కటే 49.13 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 49 శాతం వాటా నెదర్లాండ్స్‌కు చెందిన ట్రాఫిగురా గ్రూపు, రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యునైటెడ్ క్యాపిటల్ పార్ట్నర్స్ (యూసీపీ) దక్కించుకున్నాయి. ఎస్సార్ ఆయిల్లో డీల్‌కు ముందు ఎస్సార్ ఎనర్జీ హోల్డింగ్స్‌కు 98.26 శాతం, బిడ్కో మారిషస్‌కు మిగిలిన వాటా ఉంది. తాజా డీల్‌తో రుయాలు పూర్తిగా కంపెనీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కంపెనీలో రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా–యూసీపీ కన్సార్టియం కాకుండా మైనారిటీ వాటాదారుల చేతిలో ఇంకా 1.75 శాతం వాటా ఉంటుంది. ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్‌కు ముందు తమ షేర్లను విక్రయించని వారు వీరు. వీరి దగ్గరున్న వాటాలకు సెబీ బైబ్యాక్ నిబంధనల మేరకు చెల్లింపులు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, ఎస్సార్ ఆయిల్‌ను విక్రయించిన తర్వాత కూడా చమురు రంగంలో రుయాల ప్రస్థానం కొనసాగనుంది. బ్రిటిష్ ఆస్తులు, ఓ ఆయిల్ రిఫైనరీ, కోల్బెడ్ మీథేన్ బ్లాక్‌లు వారి పరిధిలోనే ఉంటాయి. బ్యాంకులకు దక్కేది రూ.4,000 కోట్లే ఎస్సార్ ఆయిల్‌కు చెందిన 5 బిలియన్ డాలర్ల (రూ.35,000 కోట్లు) విలువైన రుణభారాన్ని సైతం ఒప్పందంలో భాగంగా రాస్‌నెఫ్ట్‌తోపాటు కొత్త యజమానులు స్వీకరించారు. రుణాలిచ్చిన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు ఇతర రుణదాతలు తమ సమ్మతి తెలిపారు. దీంతో ఈ సంస్థలకు ప్రస్తుతానికి రూ.4,000 కోట్ల మేరే ఎస్సార్ గ్రూపు నుంచి చెల్లింపులు జరగనున్నాయి. రుణదాతలు కొత్త యజమానిగా రాస్నెఫ్ట్ను అంగీకరించడంతో మిగిలిన రుణానికి రష్యా కంపెనీ బాధ్యత వహిస్తుంది. రుణదాతలకు తక్షణం రూ. 4,000 కోట్లు చెల్లిస్తాం: ప్రశాంత్ రుయా ఎస్సార్ గ్రూపు మొత్తం రుణ భారం రూ.1.35 లక్షల కోట్లు కాగా, ఎస్సార్ విక్రయం నేపథ్యంలో రూ.70,400 కోట్ల మేర రుణ భారం తమ గ్రూప్ నుంచి తగ్గుతుందని ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా తెలిపారు. రుయాల మొత్తం రుణంలో ఇది 60 శాతం. ‘‘ఈ డీల్‌కు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ. దేశ చరిత్రలో భారీ స్థాయిలో రుణాలను తీర్చివేస్తున్న డీల్. మూడోది రష్యా నుంచి ఓ దేశానికి భారీ స్థాయిలో నిధులు వెళుతున్న సందర్భం కూడా ఇదే’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. విక్రయ ఒప్పందం పూర్తయినట్టు సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ బ్యాలన్స్ షీట్లలో గణనీయమైన రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. రాస్‌నెఫ్ట్ డీల్ తర్వాత భారత్‌లోని రుణదాతలకు రూ. 4000 కోట్ల మేర నేరుగా చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎల్ఐసీకి రూ. 800 కోట్లవరకూ చెల్లిస్తామని అన్నారు. మిగిలిన మొత్తాన్ని ఏ బ్యాంకుకు లేదా బీమా కంపెనీకి ఎంతెంత చెల్లించేదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. రూ.1.2 లక్షల కోట్ల మూలధన విస్తరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విస్తృతమైన తమ పోర్ట్‌ఫోలియో వృద్ధి అవశాలను ఇకపై చూడనున్నట్టు ప్రకటించారు. ‘‘ఈ డీల్ తర్వాత కూడా ఎస్సార్ గ్రూపు ఆస్తుల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 15 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల ఎబిటా కూడా ఉండనుంది. చమురు రంగంలో మాకున్న ఏకైక 9 మిలియన్ టన్నుల రిఫైనరీ ద్వారా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక లావాదేవీతో ఎస్సార్ గ్రూపు వృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయని సంస్థ వ్యవస్థాపకుడు శశిరుయా కూడా ప్రకటించారు. ఎస్సార్ స్టీల్ రుణాలు ఎగవేతే! ఎస్సార్ గ్రూపు పరిధిలోని ఎస్సార్ స్టీల్ రూ.44,000 కోట్ల మేర బ్యాంకుల రుణాలను ఎగవేయగా, ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఎస్సార్ గ్రూపు భారీ స్థాయిలో రుణాలను తిరిగి చెల్లించే కార్యక్రమం చేపట్టినప్పటికీ... ఎస్సార్స్టీల్ రుణాలను మాత్రం తిరిగి చెల్లించడం లేదు. ఇదే విషయాన్ని రుయాను ప్రస్తావించగా, ‘ఎస్సార్ ఆయిల్, ఎస్సార్ స్టీల్ రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నయి. ఒక కంపెనీ ఖాతా నుంచి మరో కంపెనీ ఖాతాలోకి నిధుల మళ్లింపునకు చట్టం ఒప్పుకోదు’ అని స్పష్టం చేశారు. రాస్‌నెఫ్ట్‌కు స్వాగతం: ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేసిన ఎస్సార్ గ్రూపును పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా యూసీపీ కన్సార్టియానికి స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించారు. సగం రుణభారం తీరిపోతుంది: కొచర్ ఎస్సార్ గ్రూపు రుణాలను తిరిగి తీర్చివేసే కార్యక్రమంతో ఆ గ్రూపునకు ఇచ్చిన రుణాలు సగం మేర తగ్గిపోనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ తెలిపారు. ఎస్సార్ ఆయిల్ అభివృద్ధికి కృషి: సెచిన్ కొత్త భాగస్వాములతో కలసి ఎస్సార్ ఆయిల్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, ఆస్తుల అభివృద్ధికి తగిన వ్యూహాన్ని అమల్లో పెడతామని రాస్‌నెఫ్ట్ అధినేత ఇగార్ సెచిన్ పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశంలో ఆయన పాల్గొనలేదు. -
ఎస్సార్ ఆయిల్, రోస్నెఫ్ట్ డీల్ పూర్తి
సాక్షి, ముంబై : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ ఎస్సార్ ఆయిల్‌తో, రష్యన్ ప్రభుత్వ ఆధీన సంస్థ రోస్నెఫ్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కుదుర్చుకున్న డీల్ ముగిసింది. ఎస్సార్ ఆయిల్ తన భారత ఆస్తులను పూర్తిగా రోస్నెఫ్ట్కు, దాని భాగస్వామ్య సంస్థలకు అమ్మేసింది. ఈ డీల్ విలువ రూ.12.9 బిలియన్ డాలర్లు(రూ.82,605 కోట్లు). గతేడాది అక్టోబర్ 15న గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. డీల్ ప్రకటించిన 10 నెలల అనంతరం ఈ రెండు సంస్థలు డీల్‌ను ముగించాయి. రూ.45వేల కోట్లకు పైనున్న రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకులు కోరడంతో, ఇన్నిరోజులు ఈ లావాదేవీ కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎస్సార్-రోస్నెఫ్ట్ డీలే. రోస్నెఫ్ట్ ఈ డీల్‌కు కన్సోర్టియంగా నిర్వహిస్తోంది. ఈ డీల్లోనే గుజరాత్‌లోని వదినార్‌లో వద్దనున్న 20 మిలియన్ టన్ను రిఫైనరీ అమ్మకం కూడా ఉంది. 3500 పైగా పెట్రోల్ పంపుల అమ్మకం కూడా డీల్‌లో భాగమే. ఈ డీల్ ముగిసిన నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, స్టాన్ఛార్ట్ వంటి లెండర్లకు రూ.70వేల కోట్లను సంస్థ చెల్లించనుంది. దేశంలో అత్యంత రుణ భారం మోస్తున్న కంపెనీల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్‌నకు ఈ డీల్ ముగింపుతో కొంత ఊరట కలిగింది. దీంతో ఎస్సార్ గ్రూప్ రుణ భారం 60 శాతం మేర తగ్గిపోనుంది. -
రికార్డ్ స్థాయికి ఎస్సార్ ఆయిల్ నికర లాభం
42 శాతం వృద్ధితో రూ.2,162 కోట్లకు న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,162 కోట్ల నికర లాభం ఆర్జించిందని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభంతో పోల్చితే 42 శాతం వృద్ధి సాధించామని వివరించింది. రిఫైనింగ్ మార్జిన్లు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఎస్సార్ ఆయిల్ చైర్మన్ ప్రశాంత్ రుయా చెప్పారు. గుజరాత్‌లోని వాదినార్లో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడానికయ్యే రిఫైనింగ్ మార్జిన్ 2014–15 ఆర్థిక సంవత్సరంలో 8.37 డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో 10.81 డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,773 కోట్ల ఇబిటా ఆర్జించామని, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇబిటాతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక ఇబిటా అని వివరించారు. -
ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తి
భారత కార్పొరేట్ చరిత్రలో అతి పెద్దది ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తయింది. వాటాదారులకు డీలిస్టింగ్ ప్రక్రియ కింద రూ.3,745 కోట్లు చెల్లించామని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీలిస్టింగ్. డీలిస్టింగ్ పూర్తవడానికి 9.26 కోట్ల షేర్లు అవసరమని, ఓపెన్ ఆఫర్ ద్వారా 10.1 కోట్ల షేర్లను సమీకరించామని ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ శశి రుయా చెప్పారు. డీలిస్టింగ్‌లో షేర్లను టెండర్ చేయని వాటాదారులు తమ షేర్లను డీలిస్టింగ్ తేదీ నుంచి ఏడాదిలోపు డీలిస్టింగ్ ధరకు ప్రమోటర్లకు విక్రయించవచ్చని తెలిపారు. డీలిస్టింగ్ విజయవంతం కావడానికి సహకరించిన వాటాదారులకు, స్టాక్ ఎక్స్చేంజీలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. 1995లో ఐపీఓకు వచ్చిన ఎస్సార్ ఆయిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్పుడు రూ.2,000కోట్లుగా ఉంది. డీలిస్టింగ్ ధర(రూ.263)ను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,000 కోట్లకు పెరిగింది. -
మళ్లీ రిలయన్స్, ఎస్సార్ బంకులు!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), ఎస్సార్ ఆయిల్‌లకు చెందిన పెట్రోలు బంకులు మళ్లీ తెరచుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. డీజిల్ ధరలపై నియంత్రణ దీపావళికల్లా పూర్తిగా ఎత్తివేసే అవకాశాల నేపథ్యంలో అప్పటికల్లా ఈ రెండు కంపెనీలు తమ పెట్రో-రిటైల్ అమ్మకాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగొస్తుండటంతో డీజిల్‌పై ఒక్కో లీటరుకు ఆదాయ నష్టం(అండర్ రికవరీ-మార్కెట్ ధర, వాస్తవ అమ్మకం ధర మధ్య వ్యత్యాసం) ఆల్‌టైమ్ కనిష్టమైన రూ.1.33కు దిగొచ్చిన సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుంచీ లీటరుపై నెలకు 50 పైసలు చొప్పున డీజిల్ ధరను పెంచడం, డాలరుతో రూపాయి మారకం విలువ కొద్దిగా బలపడటం వంటివి కూడా ఆదాయ నష్టాలు తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలుపై నియంత్రణ పూర్తిగా తొలగించిన విషయం విదితమే. ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు ఆదాయ నష్టం రూ.1.78గా లెక్కతేలుతోంది. మొత్తంమీద చూస్తే... నవంబరు నాటికి డీజిల్ డీరెగ్యులేషన్(నియంత్రణ తొలగింపు) పూర్తిస్థాయిలో అమల్లోకిరావచ్చని అంచనా వేస్తున్నారు. రిలయన్స్ ఆసక్తి... కొన్నేళ్ల క్రితమే పెట్రో-రిటైలింగ్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్... ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు విక్రయిస్తున్నట్లు సబ్సిడీ ధరలకు డీజిల్ ఉత్పత్తులను విక్రయించలేక 2008లో బంకులను మూసేసింది. ప్రభుత్వం ఓఎంసీలకు ఆదాయ నష్టాలను పూడ్చుతుండటంతో వాటికి కొంత వెసులుబాటు లభిస్తోంది. ‘2008 నుంచి దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన సుమారు 1,100 బంకులు మూతపడిఉన్నాయి. డీజిల్ ధరల పూర్తి డీరెగ్యులేషన్ గనుక అమల్లోకివస్తే రిలయన్స్ తన బంకులను తిరిగి తెరవడం ఖాయం’ అని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెట్టింపుకానున్న ఎస్సార్ బంకులు... ఎస్సార్ ఆయిల్ కూడా తమ రిటైల్ అవుట్లెట్లలో దశలవారీగా డీజిల్ అమ్మకాలను షురూ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. డీరెగ్యులేషన్ సాకారమైతే ఇప్పుడున్న 1,400 బంకులను వచ్చే మూడేళ్లలో 3,000కు పెంచుకోవాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. ఇప్పటికే 300 కొత్త బంకుల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, షెల్ ఇండియా కూడా డీరెగ్యులేషన్ ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. ఇది అమల్లోకి రానుండటంతో తనకున్న 100 బంకుల్లో రిటైల్ అమ్మకాలను పెంచడంపై దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45,000కు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. ఇందులో మూడోవంతు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్వే కావడం గమనార్హం. డీజిల్‌పై నియంత్రణలు తొలగితే.. ప్రైవేటు కంపెనీలు దూకుడు పెంచుతాయన్న ఆందోళనతో ఓఎంసీలు కూడా తమ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాయి. రానున్న కొద్ది సంవత్సరాల్లో కొత్తగా 16,000 బంకులను ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. గతేడాది పెట్రో ఉత్పత్తులపై(డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్) ఓఎంసీల అండర్ రికవరీ రూ.1,39,869 కోట్లు కాగా, ఈ ఏడాది ఈ మొత్తం రూ.91,665 కోట్లకు పరిమితం కావచ్చని అంచనా. -
ఎస్సార్ ఆయిల్ లాభం జూమ్
క్యూ4లో రూ. 1,008 కోట్లు న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఎస్సార్ ఆయిల్ జనవరి-మార్చి కాలం(క్యూ4)లో రూ. 1,008 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 200 కోట్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. అధిక మార్జిన్లు, విదేశీ మారక లాభాలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎండీ ఎల్కే గుప్తా చెప్పారు. ఇక కంపెనీ ఆదాయం కూడా 7.5% పెరిగి రూ. 27,691 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి కూడా పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 126 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాదిలో రూ. 1,180 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇక టర్నోవర్ రూ. 1,07,190 కోట్లను తాకినట్లు కంపెనీ సీఎఫ్‌వో సురేష్ జైన్ చెప్పారు. రుణ భారం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 19,109 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% లాభపడి రూ.78 వద్ద ముగిసింది.