ఇథియోపియాలో ఘర్షణలు.. 200 మందికిపైగా మృతి
నైరోబీ: ఇథియోపియాలో శనివారం రెండు జాతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్రాహా తెగకు చెందిన 200 మందికిపైగా జనం మృతిచెందారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం.
తాను 230 మృతదేహాలను లెక్కించా నని గింబీ కౌంటీకి చెందిన స్థానికుడు అబ్దుల్–సయీద్ తాహీర్ చెప్పారు. మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు. పునరావాస పథకం కింద 30 ఏళ్ల క్రితం ఇక్కడ స్థిరపడిన అమ్రాహా తెగపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్క్రాప్ట్ డీల్
సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు