Expensive goods
-
ఆ రుణం అలా తీరదు...
ఆత్మీయం పితృరుణం, మాతృరుణం అని రెండుంటాయి. పితృరుణం తీర్చుకోవాలనుకుంటే... దానికి ఒక నిర్దిష్ట యాగం చేస్తే పితృరుణం తీరిపోతుందంటుంది శాస్త్రం. కానీ మాతృరుణం తీరడానికి ఏ యాగం లేదు, యజ్ఞం లేదు... అమ్మ రుణం తీర్చుకోవడమన్నమాటే లేదంటుంది శాస్త్రం. అయితే, దురదృష్టవశాత్తూ అటువంటి అమ్మను వృద్ధాశ్రమాలకి పంపించే ప్రబుద్ధులు తయారవుతున్నారు. బతికి ఉండగా అన్నం పెట్టి ఆదరించని ఈ ‘పెద్ద మనుషులు’ వారు పోయాక మాత్రం ఎంతో శ్రద్ధాభక్తులతో నిత్యకర్మలు ఘనంగా జరిపిస్తారు. చివరి రోజున రకరకాల దానాలు చేస్తారు. ఖరీదైన వస్తువులు, పాత్రలు, పుస్తకాలు వంటి వాటి మీద వారి పేరు కొట్టించి మరీ బంధుమిత్రులకు వారి జ్ఞాపకాలుగా పంచుతుంటారు. వారి రుణం తీర్చేసుకున్నట్లు పోజు కొడుతుంటారు. అమ్మానాన్నా జీవించి ఉన్నప్పుడు వేళకు ఇంత అన్నం పెట్టి, ఆదరిస్తే... ప్రేమగా పలకరిస్తే వారు మరికొంతకాలం హాయిగా జీవించి ఉండేవారేమో! -
ప్రయాణంలో ఖర్చు తగ్గించాలంటే...
ట్రావెల్ టిప్స్ తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు చూడటానికి వెళ్లినప్పుడు డబ్బు చేయి దాటిపోతుంటుంది. అందుకే చాలా మంది పర్యటనలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రయాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే... ఒక నీళ్ల బాటిల్‌ను (500 ఎం.ఎల్) ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. సురక్షితమైన తాగునీరు లభించే చోట తిరిగి, ఆ బాటిల్‌ను నింపుకోవాలి. లేదంటే దాహమైన ప్రతీసారి నీళ్లబాటిల్ను కొనుగోలు చేయడం వల్ల, వాటికే సగం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాల చిరునామాలు తెలియవు. దీంతో ఇబ్బందితో పాటు, చిన్న చిన్న లోకల్ ప్రయాణ సాధనాలకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అందుకని బస్, రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ వంటి వివరాలతో పాటు హోటల్ గదులు, దేవాలయాలు, ఇతర చూడదగిన ప్రదేశాల గురించి అక్కడ ప్రాంత వాసులనే అడిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి.బస్సులో లేదా రైలులో మీ పక్క సీటులో ఉన్న వ్యక్తితో మాటలు కదిపితే అక్కడి ప్రాంత విశేషాలు మరిన్ని తెలుసుకునే అవకాశం సులువవుతుంది. కొత్త ప్రదేశాల్లో వస్తువులను కొనుగోలు చేసేముందు మన ప్రాంతంలోనూ ఆ వస్తువులు దొరుకుతున్నాయా అనే గమనింపు అవసరం. దర్శనీయ ప్రాంతానికే ప్రత్యేకమైన వస్తువులు, ఇతర అలంకరణ వస్తువులు మినహా ఇతరత్రా ఖరీదైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటం మంచిది. {పయాణం సులువుగా ముగించడానికి ఇప్పుడు అన్నింటికీ ఏరియా మ్యాప్స్ లభిస్తున్నాయి. వాటిని దగ్గర ఉంచుకొని, వాటిలో సూచనలను అనుసరిస్తూ వెళ్లడం మంచిది. -
పుల్లే కదా అని పారేయకండి!
వాయనం: ఇంటి అందం మీద ఇల్లాలి గొప్పదనం ఆధారపడి ఉంటుందని అంటుంటారంతా. నిజమే. ఇల్లు అలంకరించిన విధానాన్ని బట్టి ఆ ఇల్లాలి అభిరుచి ఎలాంటిదో అర్థమవుతుంది. అలాగని ఖరీదైన వస్తువులు తెచ్చి ఇంటిని నింపేయమని కాదు. అందమనేది ఖరీదు మీద ఆధారపడి ఉండదు. పనికి రాని వస్తువులతోటి కూడా ఇంటికి బోలెడంత అందాన్ని తీసుకు రావచ్చు. కావాలంటే ఈ వస్తువుల్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో! వీటిని ఎలా చేశారో తెలుసా... ఐస్ పుల్లలతో! ఐస్‌క్రీమ్ తినేశాక పుల్లల్ని పారబోసే బదులు ఇలా అందమైన వస్తువుల్ని తయారు చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు! ఇందుకు కావలసింది ఐస్ తినగా మిగిలిన పుల్లలు, కొన్ని రంగులు, కాసింత జిగురు... అంతే. ముందుగా ఏం చేయాలనేది ఓ అంచనా వేసుకుని, అందుకు సరిపడా పుల్లల్ని సేకరించుకోవాలి (ఐస్ తిన్నవే అక్కర్లేదు. ఈ పుల్లల్ని కొన్ని షాపుల్లో అమ్ముతారు). ముందు వీటిని శాండ్ పేపర్‌తో (ఫర్నిచర్, ఇనుప వస్తువుల్ని పాలిష్ చేసేందుకు ఉపయోగించే కాగితం) చదునుగా చేసుకోవాలి. ఆ పైన నచ్చిన రంగులు వేసుకుని, కావలసిన విధంగా జిగురుతో అతికించుకోవాలి. ఎక్కువ కాలం మన్నాలంటే కాస్త మంచి జిగురును వాడండి. ఫొటో ఫ్రేములు, పెన్/పెన్సిల్ స్టాండులు, వాల్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ వాజులు... ఏవైనా చేసుకోవచ్చు. ఒక వస్తువు తయారు చేయడానికి వంద రూపాయలు కూడా అవ్వదు. అంటే తక్కువ ఖర్చులో ఇంటిని ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో కదా! అందుకే ఈసారి ఐస్ పుల్లల్ని పారేయకండి. వాటిని అందంగా మలిచి మీ ఇంటి రేపురేఖల్ని మార్చేయండి! సూపర్... ఈ కప్ కేక్ మేకర్! కప్ కేక్స్ చూస్తే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే వీటిని ఎక్కువగా బయటే కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే... ఇవి తయారు చేయాలంటే మైక్రో అవన్ కావాలి. అది కొనాలంటే ఆరు వేలో, ఏడు వేలో పెట్టాలి. ఎందుకొచ్చిన గొడవ అని షాపుకెళ్లి తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడంత అవసరం లేదు. ఈ మినీ కప్ కేక్ మేకర్ ఉంటే మీరే చేసేసుకోవచ్చు! మైదా పిండిలో చక్కెర, కోడిగుడ్డు సొన, బేకింగ్ పౌడర్, పాలు వేసి జారుడుగా కలుపుకోవాలి (ఫ్లేవర్స్ కోరుకునేవారు వెనిల్లా ఎసెన్స్, చాకొలెట్ పౌడర్, డ్రైఫ్రూట్స్ వంటివి వేసుకోవచ్చు). మేకర్‌కి ఉన్న గుంతలకు కాసింత నూనో, నెయ్యో రాసి... అందులో మిశ్రమాన్ని పోయాలి. మూతపెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఇరవై నిమిషాల్లో కప్ కేక్స్ తయారైపోతాయి. ఒక్కసారి ఏడు కప్ కేక్స్ చేసుకోవచ్చు. కరెంటుతో పని చేసే ఈ మేకర్ నాలుగైదు సైజుల్లో దొరుకుతోంది. సైజును బట్టి, మోడల్ని బట్టి రూ.1400 నుంచి రూ.3800 వరకూ ఉంటుంది వెల. అమెజాన్ డాట్‌కామ్ లాంటి కొన్ని వెబ్సైట్లలో అయితే డిస్కౌంటుతో రూ.1099కే లభిస్తోంది!