రియల్ బూమ్ జోర్దార్, దేశంలోనే కాస్ట్లీ సిటీగా హైదరాబాద్
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో దేశంలో అంత్యత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు ముంబై తరువాత ఇళ్లు, ప్లాట్ల ధరలు హైదరాబాద్‌లో ధరలు అధికంగా ఉన్నాయి. వాస్తవానికి కరోనా తరువాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో రియాల్టీ రంగం నిలకడగా కొనసాగుతుంటే.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తుందని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ చేసిన అధ్యయనంలో తేలింది.
సొంతింటి అవసరాన్ని పెంచిన కరోనా
దేశంలో కరోనా తరువాత రియల్ రంగం ఏ విధంగా ఉందనే అంశంపై ప్రాప్ టైగర్ సంస్థ సర్వే చేసింది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదిక ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తలెల్తిన ఆర్ధిక మాంధ్యం ఇవేవి చాలవన్నట్లు కరోనా వంటి పరిణామాలతో రియల్ రంగం కుదేలైందని ప్రాప్ టైగర్ సంస్థ తెలిపింది. కానీ కరోనా తరువాత మాత్రం అదుపులోకి వచ్చిందని ప్రాప్ టైగర్ సంస్థ బిజినెస్ హెచ్ రంజన్ సూద్ తెలిపారు. కరోనాతో ప్రతి ఒక్కరికి సొంతింటి అవసరం పెరిగిందన్నారు. అందుకే ధరలు, పెరుగుదలలో దేశంలోని 8 మెట్రో పాలిటన్ నగరాల కంటే హైదరాబాద్ ముందజలో ఉందని అన్నారు.
ధరల విషయానికొస్తే
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలను ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు గల మూడో త్రైమాసికాన్ని పరిశీలిస్తే..
నగరం
సాధారణ ధర చదరపు అడుగుకు
పెరుగుదల శాతం
ముంబై
రూ.9600 నుంచి రూ.9800
3
హైదరాబాద్
రూ.5800 నుంచి రూ.6000
6
బెంగళూర్
రూ.5400 నుంచి రూ.5600
4
చెన్నై
రూ.5300 నుంచి రూ.5500
3
పూణె
రూ.5000 నుంచి రూ.5200
4
ఢిల్లీ
రూ.4300 నుంచి రూ.4500
5
కోల్ కత్తా
రూ.4100 నుంచొ 4300
2
అహ్మదాబాద్
రూ.3300 నుంచి రూ.3500
8
ఆయా ప్రాంతాల ధరల్ని బట్టి హైదరాబాద్‌లో ఇళ్లు, ఫ్లాట్ల ధరల పెరుగుదల కూడా గణనీయంగా ఉంది. ఎనిమిది శాతం పెరుగుదలతో అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉండగా 6శాతం పెరుగుదలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
చదవండి: రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..!