experments
-
అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం
ఆకాశం అంచులు దాటి అంతరిక్షానికి ఎగిరిపోవాలన్న మనిషి కలకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని గత 60 ఏళ్లలో దాదాపు 600 మంది ఈ ఘనతను సాధించగలిగారు. కోటీశ్వరులు ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా అమెరికా, యూరప్‌లలోని ప్రభుత్వరంగ సంస్థలు పంపిన వారే. ఇప్పటిదాకా సామాన్యులు అంతరిక్షానికి వెళ్లేందుకు రూ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా నిలిచేది. ఈ ఏడాది జూలైలో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాస్నన్, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్‌లు పోటాపోటీగా అంతరిక్ష పర్యటనలు చేయగా తాజాగా స్పేస్–ఎక్స్ సిద్ధం చేసిన అంతరిక్ష ప్రయోగంలో మాత్రం సామాన్యులకూ చోటుదక్కింది. ప్రయోగం ఎప్పుడు? ఎక్కడ? అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కానెర్వాల్‌లో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 15న స్పేస్–ఎక్స్ అంతరిక్ష ప్రయోగం జరగనుంది. స్పేస్–ఎక్స్‌కు చెందిన ఫాల్కన్–9 హెవీ రాకెట్... వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ను భూకక్ష్యలోకి తరలించనుంది. ‘‘ఇన్స్పిరేషన్ 4’పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్–4’పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈవో జేర్డ్ ఐసాక్‌మాన్ భరిస్తున్నారు. ఆయన ఎంత మొత్తం స్పేస్–ఎక్స్‌కు చెల్లించారన్న విషయం స్పష్టంగా తెలియకున్నా ఇది రూ. వందల కోట్లలో ఉండొచ్చని అంచనా. విమాన పైలట్‌గానూ పనిచేసిన అనుభవం ఐసాక్మాన్కు ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అంతరిక్షంలోకి వెళ్తున్న క్రిస్, సియాన్, ఐసాక్‌మాన్, హేలీ (ఎడమ నుంచి వరుసగా) ఎంపిక, శిక్షణలు ఇలా... ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్–ఎక్స్ వ్యోమగాముల ఎంపిక ప్రకటన చేసింది. ఆ తరువాత అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాల్లో వారికి శిక్షణ ఇచ్చింది. భారరహిత స్థితిని పరిచయం చేసేందుకు వ్యోమగాములను అర్ధచంద్రాకారం ఆకారంలో విమానంలో విప్పింది. ఇలా తిప్పినప్పుడు కొన్ని సెకన్లపాటు శరీరం బరువు మనకు తెలియదు. రోలర్ స్కేటర్లో ఎత్తు నుంచి కిందకు జారుతున్నప్పుడు కలిగే అనుభూతి అన్నమాట. ఇన్స్పిరేషన్–4ను భూకేంద్రం నుంచే నియంత్రిస్తూంటారు. మూడు రోజుల అంతరిక్ష ప్రయాణం మొత్తమ్మీద వ్యోమగాముల నిద్ర, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో వచ్చే మార్పులు, మేధో సామర్థ్యం వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో సాధారణ పౌరులతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని అంచనా. స్ఫూర్తి నింపే ప్రయోగం... ‘ఇన్స్పిరేషన్–4’ ప్రయోగం స్ఫూర్తివంతమైన దనీ చెప్పాలి. ఎందుకంటే ఈ అంతరిక్ష నౌకలో ప్రయాణించే వారిలో ఒకరు కేన్సర్ బారినపడి కోలుకున్న 29 ఏళ్ల హేలీ అర్సెనాక్స్ ఉన్నారు. మెంఫిస్(అమెరికా)లోని సెయింట్ జూడ్ పిల్లల ఆసుపత్రిలో హేలీ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఇన్స్పిరేషన్–4లో భాగంగా ఐసాక్ మ్యాన్ ఈ ఆస్పత్రిని చారిటబుల్ బెనిఫిషరీ (లబ్ధిదారు)గా ఎంపిక చేశారు. హేలీ ఎంపిక ‘రేపటిపై ఆశ’లేదా ‘హోప్’కు ప్రతీకని ఐసాక్‌మ్యాన్ అంటున్నారు. ఈ ప్రయోగంతో సెయిం ట్ జూడ్ పిల్లల ఆస్పత్రిపై ప్రజల్లో అవగాహన కల్పనతోపాటు ఆస్పత్రికి 200 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని భావిస్తున్నారు. హేలీతోపాటు అంతరిక్షానికి వెళుతున్న వారిలో 42ఏళ్ల క్రిస్ సెంబ్రోస్కీ ఉన్నారు. అమెరికా వాయుసేనలో సేవలం దించి పదవీవిరమణ చేసిన ఆయన... ప్రస్తు తం వైమానికరంగంలో పనిచేస్తున్నారు. ‘దాతృ త్వం’లేదా జెనరాసిటీకి ప్రతీకగా క్రిస్ ఎంపిక జరిగింది. చివరగా ‘సమృద్ధి’ అన్న భావనను గుర్తుచేసుకునేందుకు 51 ఏళ్ల భూగర్భ శాస్త్రవేత్త సియాన్ ప్రాక్టర్ను ఎంపిక చేశామని, 2009లో ‘నాసా’తరఫున వ్యోమగామి అవ్వాల్సిన చాన్స్ సియాన్‌కు తృటిలో తప్పిందని ఐసాక్‌మ్యాన్ వివరించారు. అంతరిక్షానికి వెళ్లిన నాలుగవ ఆఫ్రికన్ అమెరికన్ మహిళగానూ సియాన్ రికా ర్డు సృష్టించనున్నారు. ఇన్స్పిరేషన్–4 కమాండర్ ఇన్ చీఫ్‌గా ఐసాక్‌మ్యాన్ వ్యవహరించనున్నారు. ఐసాక్‌మ్యాన్ ఎవరు? 16 ఏళ్లకే బడి మానేసి.. రూ.18 వేల కోట్లకు అధిపతిగా.. జేర్డ్ ఐసాక్‌మ్యాన్.. వయసు 38 ఏళ్లే. కానీ ఘనతలు ఎన్నో. 1983లో అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టాడు. చిన్నవయసులోనే కంప్యూటర్ రిపేరింగ్, సాఫ్ట్వేర్ సర్వీసులపై పట్టు సాధించాడు. తన 16వ ఏట స్కూల్ మానేసి.. ఉద్యోగంలో చేరిపోయాడు. 2005లో సొంతంగా ‘యునైటెడ్ బ్యాంక్ కార్డ్ (ప్రస్తుత పేరు: ఫిఫ్ట్4 పేమెంట్స్)’పేరిట రిటైల్ పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించాడు. దాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించాడు. ఇదే సమయంలో తనకు బాగా ఇష్టమైన పైలట్ శిక్షణ తీసుకున్నాడు. 2009లో ఏకంగా భూమిని చుట్టేస్తూ.. 61 గంటలపాటు విమానం నడిపి రికార్డు సృష్టించాడు. ఆ ఫీట్‌తో సుమారు లక్ష డాలర్లు సేకరించి మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు అందజేశాడు. 2011లో ఏరోనాటిక్స్ డిగ్రీ పూర్తిచేసిన ఐసాక్‌మ్యాన్.. 2012లో ఏకంగా ‘డ్రాకెన్ ఇంటర్నేషనల్’ పేరిట యుద్ధ విమాన పైలట్ శిక్షణ సంస్థను స్థాపించాడు. ప్రపంచంలో సొంతంగా యుద్ధ విమానాలు ఉన్న పెద్ద ప్రైవేటు ఎయిర్‌ఫోర్స్ సంస్థ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఐసాక్‌మ్యాన్ ఆస్తులు సుమారు రూ.18 వేల కోట్లకుపైనే ఉంటాయని అంచనా. – సాక్షి, హైదరాబాద్ -
3వ దశకు వ్యాక్సిన్ ప్రయోగాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ టీకా ల అభివృద్ధి పుంజుకుంటోంది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనాల్లోనూ పలు టీకాల అ భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికాలో 3 కంపెనీలు ఒకట్రెండు నెలల్లో మూడోదశ మానవ పరీక్షలు నిర్వహించనున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) వాటికి నిధులు సమకూర్చేందుకు పచ్చజెం డా ఊపినట్లు అమెరికాలోని ఓ వార్తపత్రిక కథనాన్ని ప్రచురించింది. అన్నింటికంటే ముందుగా మోడెర్నా అనే కంపెనీ అభివృద్ధి చేసిన టీకాను వచ్చే నెలలో సుమారు 30 వేల మందిపై ప్రయోగించనున్నారు. వారి ని రెండు బృందాలుగా విడదీసి ఒక బృందానికి టీకా ఇస్తారు. రెండో బృందంలోని స భ్యులకు ఉత్తుత్తి మందు అందజేస్తారు. ఈ ప్రయోగాలు ఒకవైపు నడుస్తుండగానే ఆగస్టులో ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలు, సెప్టెంబ ర్లో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పరీక్షలు నిర్వహించాలని ఎన్ఐహెచ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి అడుగు ‘మోడెర్నా’దే... చైనాకు ఆవల తొలి కరోనా వైరస్ నమోదు కాకముందే అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నా టీకా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఎంఆర్ఎన్ఏ 1273’ ఆధారిత టీకాను ఈ ఏడాది జనవరిలోనే సిద్ధం చే సింది. ఫిబ్రవరిలో తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టి 45 మందికి ప్రయోగాత్మక టీకాను అందించింది. టీకా అందుకున్న వా రిలో రోగనిరోధక వ్యవస్థ స్పందన మెరుగ్గా ఉందని, వైరస్ బారినపడి చికిత్స తరువాత కోలుకున్న వారితో సరిపోల్చదగ్గ స్పందన నమోదైనట్లు ప్రకటించింది. ఈ టీకా శరీరం లో వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారయ్యేందుకూ సాయపడుతున్నట్లు గుర్తించింది. మార్చి నెలాఖరులో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ప్రతినెలా లక్షల డోసులు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించిన మోడెర్నా... అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా నిధులు కూడా సమకూర్చుకుంది. రెండో దశ ప్రయోగాలకు ఏప్రిల్ 27న ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోగా మే 7న అనుమతులు లభించాయి. రేసులో ఆస్ట్రాజెనెకా.. జాన్సన్ అండ్ జాన్సన్ మరోవైపు ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ ఏప్రి ల్లో ఏజెడ్‌డీ1222 మందును వెయ్యి మం దిపై ప్రయోగించింది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెరికా, బెల్జియంలో సుమారు వెయ్యి మందిపై ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రయోగాలు మొదలుకావచ్చని అనుకున్నా 2ు నెలల ముందే, అంటే వచ్చే నెలలో ప్రా రంభించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కరోనా ప్రపంచానికి పరిచయమై ఆరు నెలలు కూడా గడవక ముందే ప్రపంచవ్యాప్తంగా కనీసం పది చోట్ల టీకాల పై మానవ ప్రయోగాలు వివిధ దశల్లో ఉం డగా మరో 126 ప్రీ క్లినికల్ పరిశోధన దశలో ఉన్నాయి. పుంజుకున్న వేగం సాధారణంగా ఒక టీకా అభివృద్ధి చేసేందుకు పది నుంచి పన్నెండేళ్ల సమయం పడుతుంది. అయితే కోవిడ్–19 పరిస్థితుల్లో దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. టీకాను విస్తృత వాడకంలోకి తెచ్చేందుకు దాన్ని పలు దశల్లో పరీక్షించి సురక్షితమా కాదా? దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా? అన్నవి నిర్ధారించుకుంటారన్నది తెలిసిందే. అన్నింటికంటే ముందు ఎంచుకున్న రసాయనం/సూక్ష్మజీవి శరీరంలో ఎలా జీర్ణమవుతుందో గుర్తిస్తారు. దీన్ని ఫేజ్ జీరో అని పిలుస్తారు. ఆ తరువాత ఆ మందు సురక్షితమేనా? దుష్ప్రభావాలు ఏమిటి? అన్న అంశాలపై ప్రయోగాలు జరుగుతాయి. ఈ తొలిదశ ప్రయోగాల తరువాత వ్యాధిని మందు నిరోధిస్తుందా? అన్నది పరిశీలిస్తారు. తుది దశలో వేలాది మందికి ఈ టీకా ఇచ్చి ఫలితాలను... టీకా ఇవ్వని వారితో పోల్చి చూస్తారు. ఈ దశలన్నీ దాటుకున్న తరువాతే టీకా వాడకానికి ప్రభుత్వ సంస్థలు అనుమతులిస్తాయి. ఒక్కో దశను పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుంది కూడా. సాధారణ పరిస్థితుల్లో ఏ మందైనా మూడో దశకు చేరుకోవడమే అతికష్టమ్మీద జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలం కొన్ని నెలల వ్యవధిలో కోవిడ్–19 టీకాలు తుది దశకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు
– వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి – రజతోత్సవంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ ఎంసీ ఫారం(మహానంది): రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల రజతోత్సవాల ముగింపు సందర్భంగా రూ. 6.50కోట్లతో నిర్మించనున్న పీజీ భవనం, బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు సభ్యుడు, బగనానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా చక్రపాణి యాదవ్ మాట్లాడారు. ఉత్సవాల్లో తీసుకున్న నిర్ణయాలను తనకు పంపితే ఫిబ్రవరి–మార్చి బడ్జెట్ సమావేశంలో తగిన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీఎస్సీ వ్యవసాయం కోర్సును ఐసీఏఆర్ ఫ్రొఫెషనల్ కోర్సుగా గుర్తింపు ఇచ్చిన సందర్భంగా వ్యవసాయ కళాశాల వారు తయారు చేసి రూపొందించిన కేటలాగ్‌ను విడుదల చేశారు. అలాగే సావనీర్‌ను ఆవిష్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి.. రైతులు తలెత్తుకుని తిరిగేలా ప్రతి వ్యవసాయ విద్యార్థి సైనికుల్లా పనిచేయాలని బనగానపల్లె శాసనసభ్యులు బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది వ్యవసాయ కళాశాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ తాతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాలలో రూ. 6.50కోట్లతో అభివృద్ధిపనులు చేపడుతున్నామన్నారు. పనులన్నీ 18 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహానంది కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మహానంది కళాశాలలో అన్ని పీజీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. పైలాన్ ఏర్పాటుకు, ఇతర పనులకు పూర్వ విద్యార్థులు 1.60లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతులకు అండగా.. వ్యవసాయ విద్యార్థులు.. రైతు కుటుంబాలకు అండగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి అన్నారు. మన దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆహారోత్పత్తి చేస్తున్న ఘనత రైతులదే అన్నారు. వ్యవసాయంస్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో 28 శాతంతో ముందంజలో ఉందన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్లు గణపతిరావు మాట్లాడుతూ.. అప్పుల్లో పుట్టి..అప్పుల్లో పెరిగి...వారసులకు అప్పునే వారసత్వంగా ఇస్తున్న ఏకైక వృత్తిదారులు రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శాసనసభ్యురాలు, మీసాల గీత , జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మేకల లక్ష్మినారాయణ , బోర్డు మెంబరు మురళీనా«థ్‌రెడ్డి , శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్య, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, ఎంపీపీ చింతం నాగమణి, పూర్వ విద్యార్థులు కేవి కిషోర్‌రెడ్డి, వి.అనిల్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు.