exposes
-
5 కోట్ల నకిలీ ఖాతాలు, 3.5కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు...
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తుండగా ఆధార్ అనుసంధానం ప్రయోజనాలపై కేంద్రం సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఆధార్ నెంబర్ అనుసంధానం లెక్కలను రైల్వే శాఖ మంత్రి కోయిల్ పియూష్ గోయల్ శనివారం వెల్లడించారు. ఆధార్ మాండేటరీ చేయడంతో బహిర్గతమైన నకిలీ ఖాతాలు,ఇతర అక్రమాలపై ఏకరువు పెడూతూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసిన నాటి నుంచి 5 కోట్ల నకిలీ (ఘోస్ట్) ఖాతాలను గుర్తించినట్టు చెప్పారు. 16న్నరకోట్లకుపైగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్లలో 3.5 అక్రమ ఎల్పీజీ కనెక్షన్లుబహిర్గమయ్యాయని, అలాగే 11కోట్ల రేషన్‌కార్డుల్లో 1.6 కోట్ల రేషన్ కార్డులను గుర్తించినట్టు చెప్పారు. మొబైల్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలన్న నిబంధనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం సీరియస్‌గా స్పందిస్తూ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి నాలుగు వారాలలో స్పందించాలని ఆదేశించిన నేపథ్యంలో గోయల్ వీడియో ఆసక్తికరంగా మారింది. కాగా అవినీతిని నిరోధించే వ్యూహం, సెక్యూరిటీ రీత్యా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు, బ్యాంక్, మొబైల్, ప్యాన్, ఎల్పీజీ కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. Aadhaar Exposes 5 Crore Ghost Accounts: Govt, after making Aadhaar mandatory, has captured fake 3.5 cr LPG connections & 1.6 cr ration cards pic.twitter.com/3hblnbh8yo — Piyush Goyal (@PiyushGoyal) November 4, 2017 -
చిదంబరంపై మరో బాంబు పేల్చిన స్వామి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు. కార్తి, అతని కంపెనీలకు సంబంధించిన దాదాపు 21 రహస్య విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసి చిదంబరం, ఆయన కుటుంబంపై పెద్ద బాంబు పేల్చారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించిన స్వామి త్రీవమైన ఆరోపణలు చేశారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను అధికారుల అలక్ష్యం కారణంగా ఈ కఠోర అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చిదంబరం కొడుకు కార్తీకానీ,అతని పేరెంట్ ఇండియన్ భారతీయ కంపెనీలుకానీ ఈ విదేశీ బ్యాంకు ఖాతాల కార్డులు వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించలేదని ఆరోపించారు. ముఖ్యంగా మొనాకో బార్క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓసీబీసీ, కెనడాలోని హెచ్ఎస్బీసి , ఫ్రాన్స్ లో డ్యుయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో యూబీఎస్, కాలిఫోర్నియా లోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి వివిధ విదేశీ బ్యాంకుల ఖాతాలను ఆయన సోమవారం వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీ ఈ ఖాతాలను రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖలోని సన్నిహితులపై చిదంబరం ఒత్తిడి మూలంగానే గత ఎనిమిది నెలలుగా చెన్నై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 2014 ఎన్నికల సందర్భంగా లోక్ సభకు పోటీ చేసిన కార్తీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఖాతాల వివరాలను ప్రకటించలేదని చెప్పారు. ఈ జాబితా, ఖాతాల నెంబర్లు, గతంలో తాను మోదీకి రాసిన లేఖ, కార్తీ ఆదాయ ప్రకటన వివరాలను స్వామి మీడియాకు అందించారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో ఒకలేఖ రాశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాం కుంభకోణంపై పలు ఆరోపణలు గుప్పించిన ఆయన ఈ కుంభకోణంలో చిదంబరం, ఆయన కుమారుడు ప్రమేయంపై తాను సాక్ష్యాలను సమర్పించినా, హెచ్చరించినా కూడా సీబీఐ, ఈడీ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నాయకులు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుకార్చేందకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నానని, దీని అంతు తేలేవరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. దీనికోసం పార్లమెంట్ లో సవరణలు ప్రతిపాదించనున్నట్టు చెప్పారు. -
పనామా పేపర్స్ లో బాలీవుడ్ జంట సంచలనం
న్యూఢిల్లీ: అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా పెను రాజకీయ దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ జాబితాలో తాజాగా ఓ బాలీవుడ్ జంట పేర్లు దర్శనమిచ్చాయి. హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేర్లు ఇందులో ఉండడం మరో సంచలనానికి దారితీసింది. వీరితోపాటు, కరీనా సోదరి కరిష్మా కపూర్, పారిశ్రామికవేత్త, వీడియో కాన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సంస్థలు, పుణే కు చెందిన రియల్లర్ చోర్దియా కుటుంబం ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. గురువారం బయటపడిన ఈ జాబితాలో మరో పది పేర్లు దర్శనమిచ్చాయి. 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు జట్టుకట్టిన వేళ, వీరితో పాటు బీవీఐ (బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది. మొత్తం 10 మంది కలిసి పీ-విజన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటుచేసి పుణె ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది. తాజాగా మోసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి. పీ-విజన్‌లో ఈ క్రీడల కన్సార్టియంలో చోర్దియా కుటుంబం 33 శాతం అతి పెద్ద వాటాతో ఉండగా.. కరీనా, కరిష్మా 4.5 శాతం, సైఫ్, ముంబై నివాసి మనోజ్ ఎస్ జైన్ 9 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. దీంతోపాటు వేణుగోపాల్ ధూత్ రెండు గ్రూప్ కంపెనీల ద్వారా 25 శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి 4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కకపోవడంతో, ఆ వెంటనే మూతపడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. ఇదే విషయమై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ను ప్రశ్నించగా, పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఓడ్బురేట్ సహా ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించడానికి సైఫ్ దంపతులతో పాటు మిగిలినవారు అందుబాటులో లేనట్టు సమాచారం. పనామా పేపర్స్ గురువారం బహిర్గతం చేసిన నల్ల కుబేరుల జాబితాలో ఇంకా ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజమాని, ఒక ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఒక వస్త్రాల ఎగుమతిదారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమాని, లోహాలు సంస్థ డైరెక్టర్లు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు. -
దారి తప్పిన భర్తకు బడితెపూజ
-
భర్తకు దేహశుద్ధి చేసిన భార్య