అవినీతి బయటపెడితే ప్రతిష్టకు భంగమా?
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలోని అవినీతి తుట్టను రేపిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన పంథా కొనసాగిస్తున్నారు. న్యాయవ్యవస్థలోని అవినీతిని బయటపెట్టినంత మాత్రాన దాని ప్రతిష్ట దెబ్బతినదని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల అవినీతి బాగోతాలను బయటపెడితే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఎలా దెబ్బ తింటుందని ఆయన ప్రశ్నించారు.
అవినీతి న్యాయమూర్తులు ఉండడమే న్యాయవ్యవస్థకు అవమానకరమని తన బ్లాగ్ లో కట్జూ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను కట్టూ మంటగలుపుతున్నారని వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు.