‘మీ సేవా’ అధికవసూళ్లపై ప్రత్యేక సెల్
అనంతపురం అర్బన్ : మీ సేవా, ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా వసూళ్లపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ సేవల విషయంలో ప్రజలు కొత్తగా నమోదుకు ఉచితంగానూ, సవరణకు రూ.15 మాత్రమే చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. ఇంతకు మించి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే 1800 425 6401 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.