breaking news
Extreme heat
-
2025 మండిపోయింది..
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి. ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమితిని దాటేశాం! 2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!. ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట. ‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్‌బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో కోట్ల మంది 2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్‌ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్‌లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు. ‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ? ఇటీవల బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీస్‌లో కార్చిచ్చు విధ్వంసం
ఏథెన్స్: గ్రీస్‌లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వారంరోజులకు పైగా కొనసాగుతున్న మంటలతో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరిలో మరో కార్చిచ్చు చెలరేగింది. ఇప్పటికే అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టగా.. క్రియోనేరిలోని కార్చిచ్చు వేలాది మందిని ప్రమాదంలో పడేసింది. ఏథెన్స్కు ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న క్రియోనేరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి. గ్రీకు జర్నలిస్ట్ ఎవాంజెలో సిప్సాస్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో వినాశకరమైన కార్చిచ్చు దృశ్యాలు కనిపించాయి. ఏథెన్స్కు ఉత్తరాన కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని మరో గ్రామంలో పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతంలో కర్మాగారాలు ఉండటంతో మరింత ప్రమాద భయాలు మరింత పెరిగాయి. హెలికాప్టర్లు ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. క్రీట్, ఎవియా, కైథెరా దీవులలో మరో మూడు ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు దేశవ్యాప్తంగా 335 అగ్నిమాపక సిబ్బంది, 19 విమానాలు, 13 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు పగటిపూట మాత్రమే పరిమితం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. గ్రీసులో ఈ వేసవిలో వేడిగాలులు వీయడం ఇది మూడోసారి. శనివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్చిలో 122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 71% తక్కువగా 8.9మి.మీ. మాత్రమే నమోదైందని వివరించింది. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతమని తెలిపింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. -
గాలి రాక.. బురద తీయక..!
బెల్లంపల్లి : ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్లి కార్మికులు బొగ్గు ఉత్పత్తి కోసం నరకయాతన పడుతున్నారు. తీవ్రమైన వేడితో సతమతమవుతున్నారు. ఎడతెగని ఉరుపులు, మోకాలులోతు బురదలో విధులు నిర్వహించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదలో జారిపడి రోజుకో ప్రమాదానికి గురవుతున్నారు. పని స్థలాలను మెరుగుపర్చి, కనీస సదుపాయాలు కల్పించాల్సిన గని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్మికులపై పనిభారం పెంచి ‘దొర’తనాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన గుర్తింపు సంఘ నాయకులు పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తున్నారు. మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని గని కార్మికులు బొగ్గు ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గనిలో సుమారు 700 మంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున సుమారు 200 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. గని భూగర్భంలో పని స్థలాలు సరిగా లేక కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. గనిలోని భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో కార్మికులు సరిగా విధులు నిర్వహించలేకపోతున్నారు. గర్మీతో సతమతం శాంతిఖని నార్త్ట్రంక్-4 డిప్ 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు పని స్థలాల్లో గాలి సరఫరా జరగడం లేదు. అక్కడ విధులు నిర్వహించడానికి కార్మికులు రోజు ఎంతో సాహసం చేయాల్సి వస్తోంది. గాలిలో తేమశాతం పెరిగి తీవ్రమైన వేడి, ఉక్కపోతతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాన్లు నామమాత్రంగా ఉండటం వల్ల కార్మికులకు అంతగా ప్రయోజనం లేకుండా పోతోంది. భరించలేని వేడి వల్ల కార్మికులు విధులు నిర్వహిస్తూనే కింద పడిపోయి అస్వస్థతకు గురవుతున్నారు. గనిపైకప్పు నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుపులు(నీటిధార) పడుతుండటంతో కార్మికులు తడుస్తున్నారు. ఎనిమిది గంటలు నిరంతరంగా తడవడం వల్ల శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక మంది కార్మికుల కాలి వేళ్లకు పుండ్లై నడవలేకపోతున్నారు. గజ్జల్లో దురద ప్రబలి ఇబ్బందులకు గురవుతున్నారు. బురదలో తప్పని తిప్పలు గనిలోని పని స్థలాల వద్ద ఎప్పుడు విపరీతమైన బురద ఉండటంతో కార్మికులు ఎన్నో బాధలు పడుతున్నారు. రోజు ఒకరిద్దరు కార్మికులు బురదలో అదుపు తప్పి కింద పడిపోతున్నారు. గాయాలు తగిలి ఆస్పత్రిపాలవుతున్నారు. గనిలోని 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు మోకాలులోతు బురద ఉంది. ఆ బురదలో కాలుతీసి కాలు పెట్టే పరిస్థితులు లేవు. కార్మికులు జారిపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా చోటు చేసుకుంటున్నా నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. పెరిగిన పని భారం గనిలో సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు పనిభారం పెంచి కార్మికులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు. పెరిగిన పని ఒత్తిడిని కార్మికులు తట్టుకోలేకపోతున్నారు. పని భారం పెంచిన అధికారులు సేద తీర్చుకోవడానికి కార్మికులకు కనీసం ఐదు నిమిషాలు కూడా వెసులుబాటు కల్పించడం లేదు. చెప్పినట్లు పని చేయని కార్మికులకు అధికారులు వార్నింగ్ లేఖలు, చార్జిషీట్లు జారీ చేస్తున్నారు. తోటి కార్మికుల ముందు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పట్టింపు ఏది? కార్మికుల వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే కార్మిక సంఘ ప్రతినిధులు గనిలో లేకుండా పోయారు. గుర్తింపు సంఘ నాయకులు కొందరు ఉచితంగా మస్టర్లు పడి ఇంటికి వెళ్లడమే కాని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజ మాన్యంతో సంప్రదించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడం లేదు. గనిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు దోహదపడాల్సిన కార్మిక నాయకులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులది ఇష్టారాజ్యంగా మారింది. ఇప్పటికైనా గుర్తింపు సంఘ నాయకులు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.


