face id
-
ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్!
కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళిన మాస్క్‌లు మాత్రం వారి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. అయితే, ఈ మాస్క్ కారణంగా ఫేస్ ఐడీ ద్వారా మన స్మార్ట్ఫోన్లను అన్‌లాక్ చేయలేకపోవడం కష్టతరం అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల మాదిరిగా కాకుండా, ఫేస్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో మాత్రమే తమ ఫోన్లను అన్‌లాక్ చేసే ఆపిల్ యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే, వీరి సమస్యలకు చెక్ పెడుతూ ఆపిల్ తన ఐఫోన్ ఐఓఎస్(15.4) సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఐఫోన్ వినియోగదారులు మాస్క్ పెట్టుకున్నా కూడా మొబైల్ అన్‌లాక్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ 15.4 సాఫ్ట్వేర్ గల మొబైల్స్'కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే, ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్ & ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మొబైల్స్'లో మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ద్వారా మొబైల్ అన్‌లాక్ కానుంది. మీరు మాస్క్‌తో ఫేస్ ఐడిని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది. మీ ఆపిల్ ఐఫోన్'లో సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఫేస్ ID & పాస్‌కోడ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. 'Face ID With a Mask' అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు 'Use Face ID With a Mask' అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. (చదవండి: నీకు తిక్కుంది.. కానీ లెక్కలేదు.. పెద్దాయనకి ఫైన్ విధించిన కోర్టు) -
ఐఫోన్ ఎక్స్‌లో లోపం : డివైజ్ రీప్లేస్
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్‌లో తీసుకొచ్చిన అత్యుత్తమ లాకింగ్ ఫీచర్ ఫేస్ ఐడీ. ఫింగర్‌ప్రింట్‌తో పోలిస్తే అత్యంత భద్రతతో కూడుకున్నదిగా దీన్ని ఆపిల్ అభివర్ణించింది. అయితే ప్రస్తుతం ఈ ఫేస్‌ఐడీకి సంబంధించే ఆపిల్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఎవరైతే ఫేస్ఐడీ అన్‌లాక్ స్కానర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి డివైజ్‌ను కొత్త దానితో రీప్లేస్ చేయనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫోన్‌ను రిఫైర్ చేయలేని పక్షంలో వారికి ఈ కొత్త డివైజ్‌ను అందించనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. మ్యాక్రూమర్స్ రిపోర్టు ప్రకారం ఫేస్ఐడీతో సమస్యలు ఎదుర్కొంటున్న ఐఫోన్ ఎక్స్ యూనిట్ల సర్వీసు పాలసీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ కూమర్టినో కంపెనీ ప్రకటించినట్టు తెలిసింది. ఈ పాలసీ ప్రకారం ఫేస్ఐడీ సమస్యను తొలుత వెనుక కెమెరాతో పరిష్కరించడానికి చూస్తామని తెలిపింది. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, ఆపిల్ మొత్తం యూనిట్‌ను కొత్త డివైజ్‌తో రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. డివైజ్ వెనుక కెమెరా ద్వారా ఈ సమస్య వస్తున్నట్టు ఈ టెక్ దిగ్గజం ఒప్పుకున్నట్టు డైలీ టెలిగ్రాఫ్ రిపోర్టు చేసింది. ముందు వైపు ఉన్న ట్రూడెప్త్ కెమెరా, వెనుక వైపు ఉన్న టెలిఫోటో లెన్స్ లింక్ అయి ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఆపిల్ అందించిన ఈ ఫేస్ఐడీ ఫీచర్, ఏ11 న్యూరల్ ఇంజిన్‌లో ట్రూ డెప్ట్ కెమెరా సిస్టమ్‌తో ఎనాబుల్ అయింది. ఇది 3డీ ఫేస్ స్కానర్. ఇది ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని విశ్లేషించడానికి, గుర్తింపును ధృవీకరించడానికి అనేక అంశాలను ఉపయోగిస్తుంది. -
ఆపిల్‌ను కాపీ కొడుతున్న శాంసంగ్
శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల 10వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది జరుపుకోబోతోంది. ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా శాంసంగ్, ఆపిల్‌ను కాపీ కొడుతుందని తెలుస్తోంది. ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ మాదిరి, శాంసంగ్ కూడా తన సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తోందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రిపోర్టు ప్రకారం ఆపిల్ ఫేస్ ఐడీ టెక్ మాదిరి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని శాంసంగ్ క్రియేట్ చేస్తుందని, దాని కోసం కొత్త 3డీ కెమెరా ఆల్గారిథంను వాడబోతుందని తెలుస్తోంది. అంతేకాక తన ప్రీమియం ఫోన్లలో అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లను అమల్లోకి తేవాలని కూడా చూస్తోందని సమాచారం. గెలాక్సీ ఎస్10 లేదా గెలాక్సీ ఎక్స్ పేర్లతో గెలాక్సీ తన ఎస్ సిరీస్ 10వ వార్షికోత్సవ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుందని దక్షిణ కొరియా వెబ్సైట్ బెల్ రిపోర్టు చేసింది. ఇప్పటికే 3డీ సెన్సింగ్ ఇంటిగ్రేషన్‌ను అందించడం కోసం, శాంసంగ్ ఇజ్రాయిల్ కెమెరా ఎక్స్పర్ట్ మాంటిస్ విజన్, జపనీస్ మాడ్యుల్ మానుఫ్రాక్ట్ర్చరర్ నముగతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం అందిస్తున్న 2డీ సెన్సింగ్ టెక్నాలజీ నుంచి శాంసంగ్ బయటికి వచ్చేయాలని చూస్తుందని రిపోర్టులు తెలిపాయి. మరోవైపు శాంసంగ్ పనిచేస్తున్న అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు, అంతకముందు వివో తన ఎక్స్20 ప్లస్ యూడీలో అందించింది. అయితే ఈ సెన్సార్లను టెక్నికల్ సవాళ్ల వల్ల శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 9లో అందించకపోవచ్చని తెలుస్తోంది. కాగ, గెలాక్సీ ఎస్9కు సక్ససర్‌గా శాంసంగ్ తన10వ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. -
ఐఫోన్ ఎక్స్‌కు భద్రత కరువట
-
ఐఫోన్ ఎక్స్‌కు భద్రత కరువట
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్‌లో ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్ భద్రతకు ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటా బేస్‌లో నిక్షిప్తమై ఉంటాయని, వాటిని ఎవరైనా హ్యాకింగ్ చేసినట్లయితే ప్రభుత్వానికి తెలిసిపోతుందని వారంటున్నారు. అయితే ఐఫోన్ ఎక్స్‌లో ఏర్పాటు చేసిన ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు దానికి సంబంధించిన డేటా ఆపిల్ కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్‌లో కాకుండా ఫోన్లోనే నిక్షిప్తం అవుతుందని, అందువల్ల భద్రతకు గ్యారెంటీ లేదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఐపిల్ ఫోన్లో నిక్షిప్తమైన డేటాను చోరీకి గురైన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలు, అనుమానాలపై ఆపిల్ నిపుణులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
ఫేస్'బుక్కైపోయాడు'
హైదరాబాద్ : సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్లో యువతుల పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి అభ్యంతరకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీసీపీ పాలరాజు కథనం ప్రకరాం బేగంపేటలోని గన్ బజార్ నివాసి మహ్మద్ ఖాలేద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ పెస్ట్ కంట్రోల్ సంస్థలో టెక్నీషియన్. గతంలో ఇతడితో కలిసి మరో సంస్థలో విధులు నిర్వర్తించిన యువతిపై ఆశలు పెంచుకున్న ఖాలేద్ ఫేస్బుక్లో ఆమె అకౌంట్‌ను గుర్తించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కక్షకట్టాడు. యువతికి చెందిన ఫోటోను ఆమె పేరుతో నకిలీ అకౌంట్ తెరిచాడు. దీన్ని వినియోగించి యువతి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న మహిళలు/యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిసీవ్ చేసుకున్న వారంతా సదరు యువతే పంపిందని భావించి యాక్సెప్ట్ చేశారు. ఇలా ఫ్రెండ్స్‌గా మారిన వారిలో ఓ యువతితో అసభ్యకర పదజాలంతో చాటింగ్ చేశాడు. ఆమె ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రాజు నేతృత్వంలోని బృందం సాంకేతిక దర్యాప్తు చేపట్టి నిందితుడైన ఖాలేద్‌ను గుర్తించారు. శుక్రవారం ఇతడిని అరెస్ట్ చేసి విచారించగా... ఇదే తరహాలో మరో ఏడు బోగస్ అకౌంట్లు క్రియేట్ చేసి,అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు వారి పేర్లతో చాటింగ్స్ చేసినట్లు వెల్లడైంది. -
ఫేస్.. బుక్కయ్యారు!
సామాజిక అనుసంధాన వేదిక అయిన ఫేస్‌బుక్‌ను కొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ అకౌంట్లను తెరిచి దుర్వినియోగం చేస్తున్నారు. అశ్లీల చిత్రాలు, రాతలతో వెగటు పుట్టిస్తూ పరువును బజారుకీడుస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే ఎందరో వీఐపీలు వివరణలు ఇచ్చుకున్న సందర్భాలున్నాయి. ఇదే పరంపరలో ఫేస్బుక్ మాయాజాలం కోరుట్లలో కలకలం రేపింది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల అశ్లీల చిత్రాలు సోమవారం రాత్రి కోరుట్లకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం కొందరు ప్రముఖ నాయకులకు దడ పుట్టిస్తోంది. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాలు తీస్తున్న క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కోరుట్ల, న్యూస్‌లైన్ : నెల క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువకుడు ఓ మహిళతో అశ్లీలంగా ఉన్న చిత్రాలు పట్టణానికి చెందిన ఓ మహిళ ఫేస్బుక్ అకౌంట్లలో ప్రత్యక్షమయ్యాయి. ఈ యువకునితోపాటు మరికొందరు స్థానికులకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలు, వీడియో క్లిప్పింగ్‌లు అదే ఫేస్బుక్ అకౌంట్లలో కనిపించాయి. సదరు ఫేస్బుక్ అకౌంట్లో మహిళగా చెప్పుకున్న వ్యక్తి చాటింగ్ పేరిట ఎరవేసి కొందరి అశ్లీల చిత్రాలు సంపాదించి అవే చిత్రాల ఆసరాతో వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నట్లు వెల్లడైంది. దీంతో సదరు బాధితులు తమకు జరిగిన మోసంపై పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే సదరు ఫేస్బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. రూ.లక్షల్లో గుంజారు.. నెల క్రితం బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు ఒకరిద్దరిని పోలీసు ఠాణాకు పిలిపించి విచారించారు. ఆ సమయంలో కల్లూర్ రోడ్లో నివాసముండే ఓ యువకునితో చాటింగ్ చేసిన ఫేస్బుక్ మహిళ.. అతని అశ్లీల చిత్రాలు సంపాదించి అనంతరం అవే ఫొటోలతో బెదిరించి తన అకౌంట్లో రూ.24వేలు వేయించుకున్నట్లు తేలింది. ఇదేరీతిలో మహిళ పేరిట ఫేస్బుక్ అకౌంట్నిర్వహిస్తున్న వ్యక్తి పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారి అశ్లీల ఫొటోలు సంపాదించి మళ్లీ వాటిని అందరికి పంపుతామని బెదిరింపులు మొదలెట్టారు. అంతా ప్రముఖులు కావడంతో తమ పరువు పోతుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా సదరు ఫేస్బుక్ మహిళ చెప్పిన అకౌంట్లో రూ.లక్షల్లో డబ్బులు వేసి మిన్నకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా ఆ అకౌంట్ నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్నట్లు వెల్లైడె ంది. పోలీసులు మరింత లోతుకు వెళ్లగా సదరు బ్యాంకు అకౌంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తి పరారైనట్లు సమాచారం. తర్వాత కొద్దిరోజులు పోలీసుల విచారణకు బ్రేక్ పడింది. కొత్త అకౌంట్‌తో మళ్లీ బ్లాక్మెయిల్ పోలీసుల విచారణతో మహిళ పేరిట ఫేస్బుక్ అకౌంట్ నిర్వహిస్తున్నట్లు తేలిన వ్యక్తి జాగ్రత్తపడి దుబాయ్‌కి పరారైనట్లు సమాచారం. దుబాయ్ వెళ్లిన సదరు వ్యక్తి మళ్లీ కోరుట్లకు చెందిన మరో మహిళ పేరిట బోగస్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్లీ ప్రముఖులతో చాటింగ్ మొదలెట్టినట్లు తెలిసింది. నెల రోజుల క్రితం పట్టణానికి చెందిన పలువురు ఇదే రీతిలో మోసపోయిన విషయాన్ని పెద్దగా పట్టించుకోని మరికొన్ని పార్టీల నాయకులు కొందరు మళ్లీ సదరు ఫేస్బుక్ అకౌంట్ వ్యక్తితో చాటింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో చాటింగ్ చేస్తున్న నాయకులు అశ్లీల ఫొటోలు సంపాదించిన ఫేస్బుక్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి మళ్లీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ బెదిరింపులను కొందరు నాయకులు పట్టించుకోకపోవడంతో వారి అశ్లీల ఫొటోలను సోమవారం ఫేస్బుక్లో పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడ్డ సదరు నాయకులు సోమవారం సీఐ మహేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మళ్లీ కూపీ లాగి నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బోగస్ ఫేస్బుక్ అకౌంట్ కథ ఏమిటి? పోలీసుల విచారణలో మహిళల పేరిట బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కథలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాడని తేలింది. ఆ వ్యక్తిగతంలో తనకు ప్రియురాలిగా ఉన్న కోరుట్లకు చెందిన ఓ యువతి ఫొటోలను సంపాదించి వాటినే ఫేస్బుక్లో పెట్టి ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారికి అశ్లీల మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వలవేసి చివరికి వారి అశ్లీల ఫొటోలను సేకరించినట్లు తెలుస్తోంది. బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కోదాడకు చెందిన మహిళతో సంబంధాలు నెరుపుతూ ఆమె అకౌంట్లో డబ్బులు వేయించి ఆమె సాయంతోనే డ్రా చేసుకున్నట్లు సమాచారం. నెలరోజలు క్రితం ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారై దుబాయ్‌కి చేరుకుని, అక్కడనుంచే మళ్లీ బోగస్ ఫేస్‌బుక్‌ల పేరిట మాయ చేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా నడుపుతున్నది ఒక్కరేనా.. ఇంకా ఎవరికైనా పాత్ర ఉందా.. ఈ వ్యవహారంలో మహిళలు ఎవరైనా ఉన్నారా.. కోరుట్ల వాసుల వివరాలు స్థానికులకు సంబంధం లేకుండా ఎలా తెలుస్తున్నాయి.. అన్న అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. పోలీసులు మరింత పకడ్బందీగా విచారణ సాగిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.