కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్‌లో ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్ భద్రతకు ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటా బేస్‌లో నిక్షిప్తమై ఉంటాయని, వాటిని ఎవరైనా హ్యాకింగ్ చేసినట్లయితే ప్రభుత్వానికి తెలిసిపోతుందని వారంటున్నారు.