ఐఫోన్ ఎక్స్‌కు భద్రత కరువట
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్‌లో ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్ భద్రతకు ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటా బేస్‌లో నిక్షిప్తమై ఉంటాయని, వాటిని ఎవరైనా హ్యాకింగ్ చేసినట్లయితే ప్రభుత్వానికి తెలిసిపోతుందని వారంటున్నారు.
అయితే ఐఫోన్ ఎక్స్‌లో ఏర్పాటు చేసిన ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు దానికి సంబంధించిన డేటా ఆపిల్ కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్‌లో కాకుండా ఫోన్లోనే నిక్షిప్తం అవుతుందని, అందువల్ల భద్రతకు గ్యారెంటీ లేదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఐపిల్ ఫోన్లో నిక్షిప్తమైన డేటాను చోరీకి గురైన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలు, అనుమానాలపై ఆపిల్ నిపుణులు ఇంకా స్పందించాల్సి ఉంది.