ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్! | Use Face ID While Wearing A Mask With iPhone 12 Above Model Mobiles | Sakshi
Sakshi News home page

ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్!

Published Tue, Mar 15 2022 3:01 PM | Last Updated on Tue, Mar 15 2022 4:12 PM

Use Face ID While Wearing A Mask With iPhone 12 Above Model Mobiles - Sakshi

కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళిన మాస్క్‌లు మాత్రం వారి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. అయితే, ఈ మాస్క్ కారణంగా ఫేస్ ఐడీ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌లను అన్‌లాక్ చేయలేకపోవడం కష్టతరం అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా, ఫేస్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో మాత్రమే తమ ఫోన్‌లను అన్‌లాక్ చేసే ఆపిల్ యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

అయితే, వీరి సమస్యలకు చెక్ పెడుతూ ఆపిల్ తన ఐఫోన్ ఐఓఎస్(15.4) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో భాగంగా కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఐఫోన్ వినియోగదారులు మాస్క్ పెట్టుకున్నా కూడా మొబైల్ అన్‌లాక్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ 15.4 సాఫ్ట్‌వేర్‌ గల మొబైల్స్'కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే, ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్ & ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మొబైల్స్'లో మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ద్వారా మొబైల్ అన్‌లాక్ కానుంది. మీరు మాస్క్‌తో ఫేస్ ఐడిని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.
 

  • మీ ఆపిల్ ఐఫోన్'లో సెట్టింగ్‌ ఓపెన్ చేయండి.
  • ఫేస్ ID & పాస్‌కోడ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. 
  • 'Face ID With a Mask' అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు 'Use Face ID With a Mask' అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. 

(చదవండి: నీకు తిక్కుంది.. కానీ లెక్కలేదు.. పెద్దాయనకి ఫైన్‌ విధించిన కోర్టు)

 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement