fake babas
-
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
రాజస్థాన్ నుంచి వచ్చిన బురిడి బాబాలు.. దోష నివారణ పూజలు చేస్తామని
సాక్షి,హైదరాబాద్: దోష నివారణ పూజలు చేస్తామని నమ్మించి హవాలా రూపంలో డబ్బులు కాజేస్తున్న దొంగ బాబాల అటకట్టించారు రాచకొండ పోలీసులు. 11 మంది సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. భువనగిరి జోన్ డీసీపీ కే నారాయణ రెడ్డితో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మంగళవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సంజునాథ్, ఘోరఖ్‌నాథ్, రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్ నాథ్, అర్జున్‌నాథ్ సాధువుల వేషంలో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును హవాలా రూపంలో మళ్లించేందుకు రాజస్థాన్, హైదరాబాద్‌లోని హవాలా ఏజెంట్లు పునరం, వస్నా రామ్, ప్రకాశ్ జోటా, ప్రకాష్ ప్రజాపతి అలియాస్ మామాజీ, రమేష్ ప్రజాపతి పనిచేస్తుంటారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు ఈ క్రమంలో 2020 నవంబర్ 29న యాదాద్రి జిల్లా, రామకృష్ణాపురానికి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి కొండల్ రెడ్డి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అతడి ద్విచక్ర వాహనం ముందు నుంచి పాము వెళ్లింది. దీంతో బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో గాయపడ్డాడు. అదే ఏడాది డిసెంబర్ 6న తన ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఉండగా.. రాజస్థాన్‌కు చెందిన సంజునాథ్, ఘోరఖ్‌నాథ్ సాధువు వేషంలో భిక్ష కోసం వెళ్లారు. కొండల్ రెడ్డి ఒంటిపై గాయాలను చూసిన వారు ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయం కొండల్ రెడ్డి వారికి వివరించాడు. కొండల్ రెడ్డి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వారు నీకు సర్పదోషం ఉందని, దోష నివారణకు పూజలు చేయాలని సూచించారు. లేని పక్షంలో నీతో పాటు నీ కుటుంబానికి ప్రాణహాని తప్పదని బెదిరించారు. దీంతో దోష నివారణ పూజకు అంగీకరించిన కొండల్ రెడ్డి.. పూజా సామగ్రి కోసం రూ.41 వేలు చెల్లించాడు. ∙సంజునాథ్, ఘోరఖ్‌నాథ్ సూచన మేరకు రాజస్థాన్ షిరోహీ జిల్లాకు చెందిన రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్‌నాథ్, అర్జున్నాథ్లు కొండల్ రెడ్డి ఇంటికి వెళ్లి క్షుద్ర పూజలు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళ్లిపోయిన వీరు తరచూ ఫోన్లో కొండల్ రెడ్డి బెదిరించసాగారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంట్లో నాగ దేవత ప్రతిష్ట చేసుకోవాలని చెప్పి.. పలు దఫాలుగా రూ.37.71 లక్షలు సొమ్ము కాజేశారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న కొండల్ రెడ్డి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా మరోమారు డబ్బులు తీసుకొని ఘట్కేసర్కు రావాలని నిందితులు సూచించగా.. భువనగిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), భువనగిరి టౌన్ పోలీసులు పక్కా వ్యూహంతో నిందితులు రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్‌నాథ్, అర్జున్‌నాథ్, పునరం, వస్నారామ్, ప్రకాశ్ జోటాలను పట్టుకున్నారు. సంజునాథ్, ఘోరఖ్‌నాథ్, ప్రకాశ్ ప్రజాపతి, రమేష్ ప్రజాపతి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.8.30 లక్షల నగదు, 12 సెల్ఫోన్లు, రుద్రాక్షమాల, కమండలం, అఘోరా దండలు, డబ్బు లెక్కించే యంత్రం ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, బెంగళూరులోనూ.. వీరు ఇప్పటికే నగరంలో రెండు మూడు చోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వీరు తమిళనాడు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ క్షుద్ర పూజల పేరిట పెద్ద మొత్తంలో సొమ్ము కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందం రాజస్థాన్‌లోని షిరోహీకి వెళ్లిందని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. -
లవ్ ఫెయిల్యూరా?.. సంతానం లేదా? బాబాను కలవండి
దాదర్: ప్రేమ విఫలమయిందా? వ్యాపారంలో నష్టపోతున్నారా? సంతానం లేదా? అయితే మీ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తాం, అందుకు ఈ బాబాను సంప్రదించండి అంటూ లోకల్ రైళ్లలో ప్రకటనల స్టిక్కర్లు వందలాదిగా దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకున్నా పలువురు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో కూడిన స్టిక్కర్లు రైళ్లలో అంటించి పోతున్నారు. ఇలాంటి ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్ల వల్ల అమాయక ప్రయాణికులు సంప్రదించడం, ఆపై మోసపోవడం షరా మామూలుగా జరుగుతోంది. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాలు లోకల్ రైళ్లలో అక్రమంగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో మాంత్రిక బాబాల పోçస్టర్లు, స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త బోగీలపైనా.. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే బోగీలలో, రైల్వే స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై ఎలాంటి ప్రకటన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదు. కానీ, రైల్వే నిర్లక్ష్యం వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాత ఐసీఎఫ్ బోగీలతోపాటు కొత్తగా వచ్చిన బాంబార్డియర్ కంపెనీ రైల్వే బోగీలలో మాంత్రిక బాబాల ప్రకటనల స్టిక్కర్లు అంటించిన దృశ్యాలు దాదాపు అన్ని రైళ్లలో కనిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడం, వ్యాపారంలో నష్టాలు, ఇంటిలో గొడవలు, భార్య, భర్తల మధ్య ఘర్షణలు, సంతానం లేకపోవడం తదితర సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తామంటూ, అందుకు ఫలాన బాబాను సంప్రదించాలని ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్లు అంటిస్తున్నారు. స్టిక్కర్లపై బాబా పేరు, ఫోన్ నంబరు, చిరునామా, సంప్రదించు వేళలు తదితర వివరాలుంటున్నాయి. తమ మంత్రశక్తులతో మీ సమస్యలు మటుమాయం చేస్తామని ధైర్యంగా రాస్తున్నారు. వీటికి ఆకర్షితులైన అమాయక ప్రయాణికులు ఇలాంటి నకిలీ బాబాలను సంప్రదించి మోసపోతున్నారు. తొలుత వందల్లో, ఆ తరువాత వేలల్లో, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే లక్షల్లో డబ్బులు గుంజుతారు. బాధితులు చివరకు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. అప్పటికే ఈ నకిలీ బాబాలు అక్కడి నుంచి జారుకుంటారు. లాక్డౌన్ అనంతరం.. గతంలో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ మాంత్రిక బాబాలపై చర్యలు తీసుకోవడంతో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించే బెడద తగ్గిపోయింది. కాని కరోనా కారణంగా అమలుచేసిన లాక్‌డౌన్‌తో లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్లలో రద్దీ అంతంగా ఉండటం లేదు. దీంతో ధైర్యంగా స్టిక్కర్లు, పొస్టర్లు అంటించి జారుకుంటున్నారు. ఇలాంటి స్టిక్కర్లను అర్ధరాత్రి దాటిన తరువాత అంటిస్తున్నారు. దీంతో రైల్వే పోలీసులకు చిక్కడం లేదు. అనుమతి లేకున్నా అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న సామాన్యులపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. స్టిక్కర్లు అంటిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వీరి నిర్వాకంవల్ల బోగీలన్నీ వికృతంగా కనిపిస్తున్నాయి. పోస్టర్లకు, స్టిక్కర్లకు జిగురు (గమ్) చాలా పట్టించడం వల్ల తొలగించడానికి వీలులేకుండా పోతున్నాయి. -
బురిడీ బాబా.. పూజ మధ్యలో ఆగిపోతే విషాదమే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో ఉన్న ఘజియాబాద్ సమీపంలోని షహద్ర ప్రాంతం నకిలీ బాబాలకు అడ్డాగా మారింది. లోకల్, యూట్యూబ్ ఛానళ్లను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్న ఈ బురిడీ బాబాలు ఆన్లైన్లో నగదు చెల్లిస్తూ యాడ్స్ ఇస్తున్నారు. ఎలాంటి బాధల నుంచి అయినా పూజల ద్వారా విముక్తి కల్పిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఆపై అందినకాడికి వసూలు చేసి నిండా ముంచుతున్నారు. వీరి బారినపడుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ⇔ రెండు నెలల క్రితం రూ.లక్ష మోసపోయానంటూ పాతబస్తీకి చెందిన ఓ బాధితురాలు ఫిర్యాదు చేయగా... రూ.4 లక్షలు ‘సమర్పించుకున్న’ మరో మహిళ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ⇔ సిద్ధిపేటకు చెందిన ఓ మహిళకు తన భర్తతో విభేదాలు రావడంతో కొన్నాళ్ళుగా అతడికి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం అంబర్‌పేటలో ఉండే తన సోదరుడి వద్ద నివసిస్తోంది. ఎవరో తన భర్తకు మందు పెట్టారని, అందుకే తనను వదిలేశాడనేది ఈమె నమ్మకం. అప్పటి నుంచి ఆ మందుకు విరుగుడు కోసం ప్రయత్నిస్తోంది. ⇔ ఈ నేపథ్యంలో ఓ లోకల్ ఛానల్లో బాబా జాఫర్ ఖాన్, కాశ్మీరీ బాబా, బెంగాలీ బాబా, తాంత్రిక్ బాబా పేరుతో వచ్చిన యాడ్ ఈమె గమనించింది. తనను కలవాల్సిన అవసరం లేకుండా కేవలం పూజల ద్వారానే ఆరోగ్య, కుటుంబ, దాంపత్య సమస్యల్ని దూరం చేస్తానంటూ అందులో బురిడీ బాబా పేర్కొన్నాడు. ⇔ సదరు ఛానల్లో ఈ ప్రకటన చూసిన మహిళ అందులోని ఫోన్ నెంబర్లో సంప్రదించారు. విషయాన్ని బురిడీ బాబాకు చెప్పగా క్షుద్రపూజల కారణంగా అలా జరిగిందని, పూజలు చేసి కాపురాన్ని సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి రూ.5600 చెల్లించాలని కోరాడు. ⇔ ఈ మొత్తం గూగుల్ పే ద్వారా అందిన తర్వాత పూజ మొదలెట్టానని, సామగ్రి ఖరీదు చేయడానికి మరో రూ.33 వేలు కావాలన్నాడు. ఆపై మరికొన్ని వస్తువులు కొనాలంటూ ఇంకో రూ.42 వేలు కాజేశాడు. ఆపై ఆమెను సంప్రదించిన బాబా పూజ మధ్యలో ఆగిందంటూ చెప్పాడు. ⇔ అలా ఆగిపోతే మీ ఇంట్లో విషాదం జరుగుతుందని, ఆనారోగ్యం పాలవుతారంటూ భయపెట్టాడు. పూర్తి చేయడానికి మరో రూ.66 వేలు మరుసటి రోజు ఉదయానికి పంపమన్నాడు. ఆమె నగదును ఆ రోజు సాయంత్రానికి బదిలీ చేయగా... టైమ్ దాటాక పంపడంతో పూజ తంతు కాలేదని, మళ్ళీ అంతే మొత్తం పంపాలన్నాడు. ⇔ ఇలా సదరు బాబాకు రూ.4 లక్షలు చెల్లించిన బాధితురాలు తాను మోసపోయానని గుర్తించారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు బాధితురాలు నగదు బదిలీ చేసిన గూగుల్ పే నెంబర్ పరిశీలించారు. ⇔ ఈ నెంబర్‌కు రెండు నెలల క్రితం రూ.లక్ష పంపి మోసపోయిన మరో బాధితురాలూ ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో బాబాను పట్టుకోవడానికి షహద్ర ప్రాంతానికి సైబర్ క్రైమ్ పోలీసులు ⇔ వెలుగులోకి రాని బాధితులు ఇంకా అనేక మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాళ్ళు బయటకు రాలేదని భావిస్తున్నారు. సదరు బురిడీ బాబాను పట్టుకోవడానికి మరో టీమ్‌ను ఉత్తరాదికి పంపాలని నిర్ణయించారు. -
జేజేల నుంచి.. జైలు దాకా...!
ఓ మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆసారాం బాపూజీకి జోధ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించిన నేపథ్యంలో స్వయం ప్రకటిత బాబాలు, స్వామిజీలు, అధ్యాత్మిక గురూజీల వివాదాస్పద వైఖరి, వారు ఎదుర్కొన్న కేసులు, పడిన శిక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి స్వామిజీల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తల్లితండ్రులను పూజించాలని, లైంగిక వాంఛలు లేని పవిత్రమైన జీవితాన్ని గడపాలంటూ ఉపదేశాలిచ్చే 79 ఏళ్ల ఆసారాం బాపూజీ అత్యాచారం కేసులో అరెస్టయి 2013 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఆసారాం తనపై అత్యాచారం చేశారంటూ ఓ టీనేజీ భక్తురాలి ఫిర్యాదుపై ఆయన అరెస్టయ్యారు.. ఆ తర్వాత మరో మహిళా అనుయాయి కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించే ఆసారాం కుమారుడు నారాయణ్ సాయి కూడా అత్యాచారం ఆరోపణలతోనే కటకటాల పాలయ్యారు. శిక్షపడిన, కేసులు ఎదుర్కొంటున్న స్వామిజీలు కొందరు... గుర్మీత్ రాం రహీమ్ : గతేడాది ఆగస్టులో అత్యాచారం కేసులో గుర్మీత్‌సింగ్‌కు ఇరవైఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. గంగానంద తీర్థపథ : కేరళ కొల్లాంలోని ఆశ్రమాన్ని నిర్వహించిన తీర్థపథ పూజా పద్ధతుల (ఆచారాల) నిర్వహణ నెపంతో ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిని అయిదేళ్ల పాటు శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రతిగా ఆ అమ్మాయి తీర్థపథ పురుషాంగాన్ని తెగ్గోసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ప్రాయశ్చిత్తంగా తానే ఆ పని చేసినట్లు ఆయన ప్రకటించుకున్నాడు. మెహందీ ఖాసిం : ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసినందుకు 43 ఏళ్ల మెహందీ బాబాకు ముంబై కోర్టు 2016 ఏప్రిల్‌లో జీవితఖైదు విధించింది. మానసిక వికలాంగులైన అబ్బాయిలను ఆరోగ్యవంతులను చేసే చికిత్స కోసం అమ్మాయిలను కూడా పంపించాలని, తాను చేసే చికిత్స ద్వారా ఈ అమ్మాయిలు మానసిక వికలాంగులకు జన్మనివ్వకుండా నివారించవచ్చునని వారిపై అత్యాచారం జరిపాడు. సంతోష్ మాధవన్ అలియాస్ స్వామి అమృత చైతన్య : ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మాధవన్‌కు 2009లో కేరళ కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలను ఏదో నెపంతో రప్పించి, వారిని నిర్భందించి అత్యాచారం చేశాడు. స్వామి ప్రేమానంద : శ్రీలంక నుంచి 1984లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి వచ్చిన ప్రేమానంద్ అక్కడ ఆశ్రమం నెలకొల్పాడు. ఇక్కడే అతడు తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చినట్లు 1994లో ఒక అమ్మాయి ఆరోపించింది. పదమూడు మంది మైనర్ బాలికలను రేప్ చేసిన కేసుల్లో ప్రేమానంద్తో పాటు మరో ఆరుగురికి కోర్టు శిక్ష విధించింది. జ్ఞానచైతన్య : మూడు హత్యలకు గాను 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చాక ఒక బ్రిటీష్ కుటుంబాన్ని కలుసుకుని తన గత జన్మలో వారి కుమార్తె తన భార్యగా ఉందంటూ నమ్మించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు హింసించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు మళ్లీ ఆరెస్ట్ చేశారు. రాంపాల్ మహారాజ్ : హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు వివిధ కేసుల్లో 2014లో కోర్టు జారీచేసిన అరెస్ట్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు తన భక్తులతో రాళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో గురు రాంపాల్ మహారాజ్ దాడులు చేయించాడు. కొన్ని రోజుల తర్వాత కాని పోలీసులు ఈ భారీ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించలేకపోయారు. ఈ ముట్టడిలో ఆరుగురు చనిపోయారు. స్వామి నిత్యానంద : లైంగిక వేధింపులు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందపై కర్ణాటకలోని ఆశ్రమంలో తమను శారీరకంగా హింసించారంటూ అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. సినీనటితో శృంగారం వీడియో వివాదం వెలుగుచూడడంతో 2010లో 53 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. ఇద్దరు మహిళలతో అసభ్య ప్రవర్తనపై ఒక స్థానిక టెలివిజన్ చానల్ వీడియో విడుదల చేయడంతో గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నకిలీ బాబాలు అరెస్ట్
వైఎస్ఆర్ జిల్లా, చాపాడు : పంచలోహ బిల్లలంటూ నకిలీ బిల్లలు అమ్ముతూ డబ్బులు వసూలు చేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన తండ్రీ కొడుకులైన ఇద్దరు నకిలీ బాబాలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాగినేనిపల్లెకు చెందిన మోతే కురువయ్య, మోతే పెద్ద మౌలాలి బుధవారం ఉదయం చాపాడు మండలంలోని చిన్నగురువళూరులో నకిలీ పంచలోహ బిల్లలను అమ్ముతూ ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.1200–రూ.2000 వరకూ డబ్బులు వసూలు చేశారు. పాలగిరి గోవర్దన్‌రెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలతో పాటు మరో ఇద్దరు వీరు అమ్మిన పంచలోహ బిల్లలు నకిలీవి అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ బాబాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
నకిలీ బాబాల జాబితా విడుదల
-
దొంగ బాబాల జాబితా విడుదల
అలహాబాద్: తమను తాము భగవంతుని అవతారం చెప్పుకునే నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషద్ కోరింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పేర్కొంటూ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, రాధేమా, నిర్మల్ బాబా, రాంపాల్, ఆశారామ్ బాపు సహా 14 మంది పేర్లతో సెప్టెంబర్‌లో మొదటి లిస్ట్ తయారు చేసింది. మరో ముగ్గురి పేర్లను జతచేసి తాజా జాబితా విడుదల చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్(ఢిల్లీ), సచిదానంద సరస్వతి(యూపీ), త్రికాల్ భవంత్(అలహాబాద్) పేర్లను జోడించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో వీరేంద్ర దేవ్ నిర్వహిస్తున్న మూడు ఆశ్రమాల నుంచి గతవారం 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను పోలీసులు కాపాడారు. దొంగ బాబాల గురించి సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు ఈ జాబితా తయారుచేసినట్టు అఖిల భారత అఖార పరిషద్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి తెలిపారు. సాధువులు, సన్యాసులకు చెడ్డపేరు తీసుకువస్తున్న నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బాబా రాందేవ్‌పై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన దిగ్విజయ్.. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను దొంగ బాబా అని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం వారి జాబితా విడుదల చేసింది. ఇందులో ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్‌లు ఉన్నారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్.. నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరు లేకపోవడం విచారకరమన్నారు. -
మకిలి స్వాములు
-
జనాన్ని బురిడీ కొట్టిస్తున్న బాబాలు
-
బాబాల మోసాలు నమ్మవద్దు