
నకిలీ పంచలోహ బిల్లలు అమ్ముతూ పట్టుబడిన నకిలీ బాబాలు
వైఎస్‌ఆర్ జిల్లా, చాపాడు : పంచలోహ బిల్లలంటూ నకిలీ బిల్లలు అమ్ముతూ డబ్బులు వసూలు చేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన తండ్రీ కొడుకులైన ఇద్దరు నకిలీ బాబాలను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాగినేనిపల్లెకు చెందిన మోతే కురువయ్య, మోతే పెద్ద మౌలాలి బుధవారం ఉదయం చాపాడు మండలంలోని చిన్నగురువళూరులో నకిలీ పంచలోహ బిల్లలను అమ్ముతూ ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.1200–రూ.2000 వరకూ డబ్బులు వసూలు చేశారు. పాలగిరి గోవర్దన్‌రెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలతో పాటు మరో ఇద్దరు వీరు అమ్మిన పంచలోహ బిల్లలు నకిలీవి అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ బాబాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment