నకిలీ డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ (జీడిమెట్ల) : హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో డ్రగ్ ఇన్స్పెక్టర్నంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జీడిమెట్ల ప్రాంతంలో మందుల షాపుల యాజమానులను మామూళ్లు ఇవ్వాలని వేధించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నకిలీ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాగోతం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.