fake milk
-
నకిలీ పాలు ఎలా చేస్తున్నారో చూస్తే షాకవుతారు..
-
ఇక కల్తీ పాలకు చెక్!
సాక్షి, అమరావతి: రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో తెల్లనివన్నీ పాలు అని నమ్మే పరిస్థితి లేదు. ఈ తరుణంలో వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలను అందించాలనే లక్ష్యంతో సహకార పాల డెయిరీల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల్)లో రూ.11కోట్లతో స్టేట్–సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ ల్యాబ్ ద్వారా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించి, నివారణకు చర్యలు చేపట్టనుంది. నాణ్యత ఇలా... గేదె పాలల్లో 5.5 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు), ఆవు పాలల్లో 3.2 శాతం కొవ్వు, 8.3 శాతం ఎస్ఎన్ఎఫ్ ఉంటే మంచి పోషక విలువలు ఉన్న పాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. నాసిరకం దాణా వల్ల పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరస్థాయిలో విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని పలు పరిశోధనల్లో గుర్తించారు. కొందరు ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయం పలుమార్లు వెలుగులోకి వచ్చింది. ఇటువంటి నాసిరకం, కల్తీ, నకిలీ పాల వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలల్లో నాణ్యతను గుర్తించేందుకు రాజమహేంద్రవరం, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో అత్యా«దునిక పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా ఏపీ కార్ల్‌లో దేశంలోనే అతి పెద్ద స్టేట్, సెంట్రల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. మూడు నెలల్లో అందుబాటులోకి... ఏపీ కార్ల్‌లో ఇప్పటికే ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగా, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్‌ను పరీక్షించేందుకు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది. ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30వేల వరకు ఖర్చయ్యేది. పులివెందులలోని ల్యాబ్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో ఏడాదికి 500 నుంచి 1,000 వరకు పరీక్షలు చేయవచ్చు. ఈ ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనరైజర్, ఎఫ్టీఐఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్యాడ్రపుల్ మాస్ డిటెక్టర్‌తో ఎస్‌సీఎంఎస్, ఎఫ్ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిప్యూజ్, అడల్టరెంట్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్ వంటి పరికరాలు అందుబాటులో ఉంటాయి. సుమారు 15 మంది నిపుణులైన సిబ్బందిని నియమిస్తున్నారు. మూడు నెలల్లో ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. రసాయన అవశేషాలను గుర్తించవచ్చు స్టేట్ సెంట్రల్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు, పాడి రైతులు, వాటాదారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎగుమతులను పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, భారీ లోహాలు, మైకో టాక్సిన్లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషించి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కల్తీలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
తెల్లనివన్నీ పాలు కాదు
నరసరావుపేట రూరల్ /రొంపిచర్ల : ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన కల్తీ పాల తయారీదారులపై కఠిన చర్యలు చేపడతామని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట మండలం లింగంగుంట్లలో శ్రీనివాసరావు నిర్వహించే కల్తీపాల తయారీ కేంద్రం పై దాడులు నిర్వహించినట్టు వివరించారు. పాలపొడి, సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి.ప్రభాకర్, టూటౌన్ సీఐ బి.ఆదినారాయణ, ఎస్ఐలు ఎ.వి. బ్రహ్మం, వెంకట్రావు పాల్గొన్నారు. రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో గత ఆరు నెలలుగా కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ ఎస్.వెంకట్రావు గురువారం రాత్రి సిబ్బందితో కలసి వెళ్లి దాడి చేశారు. దీంతో కల్తీ పాల వ్యాపారం గుట్టు రట్టయింది. కల్తీ పాల తయారీకి ఉపయోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, పాల పొడిని 90 లీటర్ల కల్తీ పాలను, పాలు తరలించే ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటకు చెందిన శ్రీలక్ష్మి సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన తన బంధువైన గీత సహాయంతో కొంతకాలంగా కల్తీ పాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. వేరే గ్రామంలో ఇంటింటికీ తిరిగి పాలు సేకరించి సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, పాల పొడి, యూరియా కలిపి కల్తీ పాలు తయారు చేసి దూర ప్రాంతాలకు తరలిస్తారు. నిందితురాలు శ్రీలక్ష్మి అదుపులో ఉండగా, గీత పరారీలో ఉన్నట్టు చెప్పారు. గీతను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నట్టు వివరించారు. -
కదిలిన ఐపీఎం యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్ : పాలల్లో నాణ్యతా లోపాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’బ్యానర్ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లు స్పందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం(ఎఫ్ఎస్ఎస్) సమగ్రంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు.. పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ కె.శంకర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 154 రకాల పాల ప్యాకెట్ల నమూనాలను సేకరించి నాణ్యతను తనిఖీ చేశామని.. ఇందులో 123 నమూనాలను జీహెచ్ఎంసీ పరిధిలోనే సేకరించామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 16, ఇతర ప్రాంతాల్లో 10 బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిర్దేశించిన ప్రకారం లేవని తెలిపారు. వీరిపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కేసులు నమోదు చేశామని.. ఇందులో 14 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. -
కల్తీపాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ పాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. జంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే నకిలీ పాలు వస్తున్నాయన్నారు. యూరితోపాటు పాలు తయారు చేసి విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాలపై ముఖ్యమంత్రి స్పందించడం అభినందనీయమన్నారు. పాల బూత్, పాల శీతలీకరణ కేంద్రాలపై దాడులు చేయాలన్నారు. రైతు సంఘం బలోపేతం కోసం వచ్చే నెలలో జిల్లా, మండల మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని.. ఈ సమావేశానికి ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి
-నలుగురి అరెస్ట్ నరసరావుపేట(గుంటూరు జిల్లా) గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సంధర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు. -
కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడి
నర్సరావుపేట: గుంటూరు జిల్లాలో కల్తీపాల తయారీ కేంద్రాలపై పోలీసలు దాడులు నిర్వహించారు. జిల్లాలోని నర్సరావుపేటలో కల్తీపాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో శుక్రవారం దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా కల్తిపాలతో పాటు, పాల తయారికి వాడే ఆయిల్, పౌడర్, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని నవోదయ నగర్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ పాలధందాను నడుపుతున్నారు. ఈ రోజు దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కల్లులో కలిపే రసాయనంతో కృత్రిమ పాలు తయారీ