Fake Naxalite
-
నకిలీ నక్సలైట్ అరెస్ట్
వరంగల్ క్రైం : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఛతీస్ఘడ్ రాష్ట్రం భూపాలపట్టణం తారుడు గ్రామానికి చెందిన పులాయిల భానయ్య నక్సలైట్ పేరు చెప్పి నగరంలో డబ్బు వసూళ్లు చేయడానికి వస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో భానయ్యను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్ తెలిపారు. వివరాలు ఏటురునాగారంలో రాక్ స్పోకెన్ ఇంగిష్ తరగతులను నిర్వహిస్తున్న భానయ్య కోచింగ్ సెంటర్లో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నగరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.15 వేలు పెట్టి తపంచను కొనుగోలు చేసినట్లు డేవిడ్‌రాజ్ తెలిపారు. నక్సలైట్ పేరు చెప్పి తన ఇంట్లో ఉన్న తపంచ, రెండు కత్తులు తన కళాశాల బ్యాగులో పెట్టుకొని హన్మకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, హన్మకొండ ఎస్సై ప్రవీన్కుమార్లు సిబ్బందితో భానయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భానయ్యను విచారించగా తాను వేసుకున్న ప్రణాళికను ఒప్పుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు. తపంచ,కత్తులు స్వాధీనం నిందితుడు భానయ్య నుంచి ఒక తపంచ, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డేవిడ్‌రాజ్ తెలిపారు. ఎలాంటి సంఘటన జరుగకుండా నిం దితుడిని సకాలంలో అరెస్టు చేయడంలో జాగ్రత్త పడిన క్రైం అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, ఎస్సై ప్రవీన్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్‌లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. -
నకిలీ నక్సలైట్ అరెస్టు...
-
నకిలీ నక్సలైట్ అరెస్టు...
ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం జడల నాగరాజుకు దగ్గరి బంధువు కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆయుధాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్ తోట రాములును అరెస్టు చేసి అతని నుంచి ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన తోట రాములు(36) మాజీ నక్సలైట్ జడల నాగరాజుకు దగ్గరి బంధువు. ఇద్దరు కలసి పలు సెటిల్మెంట్లు, బెదిరింçపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ సమయంలో జడల నాగరాజుపై పోలీసుల నిఘా పెరగడంతో తనవద్ద ఉన్న ఆయుధాలను దాచాలని రాములుకు అప్పగించాడు. 2012లో జడల నాగరాజు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రాములు తన వద్ద ఉన్న ఆయుధాలు చూపిస్తూ పలుచోట్ల సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. రాములు ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న సమాచారంతో 2015 మేలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి అతనిపై క్రైం నంబర్ 232/16 కేసు నమోదు చేశారు. అతడి నుంచి అధునాతమైన జర్మన్ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాములు పలు భూ పంచాయితీల్లో తలదూర్చి బెదిరింపులకు గురిచేసి రూ.లక్షలు వసూలు చేశాడు. ఇటీవల కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషనర్ కమలాసన్‌రెడ్డి కార్డెన్ సెర్చ్‌లు ప్రారంభించారు. తనిఖీల్లో ఆయుధాలు బయటపడతాయనే భయంతో వాటిని కరీంనగర్ మండలం తీగలగుట్లపల్లి గ్రామం విద్యారణ్యపురి కాలనీలో సమీపంలో ఉంటున్న తన అన్న ఇంటి సమీపంలో గల ముళ్ల పొదలున్న స్థలంలో 200 మీటర్ల లోతున దాచి పెట్టాడు. తన బెదిరింపులకు అప్పుడప్పుడు డంపులో ఉన్న ఆయుధాలు వినియోగించేవాడు. ఈ సమాచారంతో తోట రాములుపై పోలీసులు పక్కాగా నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం రాములు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డంపు విషయం బయటపడింది. ఆ డంపులో నుంచి ఒక 8ఎంఎం రైఫిల్, ఎస్బీబీఎల్ (సింగిల్‌బోర్ తుపాకీ) ఒకటి, డబుల్బోర్ తుపాకీలు మూడు, 9ఎంఎం కార్బన్ గన్ ఒకటి, 32పిస్టల్ ఒకటి, ఒక 8ఎంఎం తపంచాతోపాటు 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
నకిలీ నక్సలైట్ అరెస్ట్
లెటర్ప్యాడ్లు, డమ్మీ పిస్టల్ స్వాధీనం మావోయిస్టు పార్టీ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో బెదిరింపులు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి ములుగు : మావోయిస్టు పార్టీ లెటర్ప్యాడ్లు తయారు చేసి, కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్, మావోయిస్టు నేత గోపన్న, ఇతర నాయకుల పేరుతో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్‌ను బుధవారం ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన పేరాల వెంకటేశ్ ములుగులోని మహర్షి కళాశాలలో పీజీ చేశాడు. తనకు అన్న వరుసైన చింతపండు నగేశ్ అలియాస్ క్రాంతి(పది నెలల కింద మృతిచెందాడు) సాయంతో మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతును పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నావని బెదిరించాడు. తర్వాత తాడ్వాయికి చెందిన తన స్నేహితుడు చింత సురేశ్(ప్రస్తుతం జైలులో ఉన్నాడు)తో కలిసి ఆ రైతు నుంచి రెండుసార్లు డబ్బులు వసూలు చేశాడు. ఏప్రిల్, మే నెలల్లో కూడా రెండుసార్లు సీపీఐ(మావోయిస్టు) లెటర్‌ప్యాడ్‌పై కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో లెటర్‌ను తయారు చేసి రైతును హెచ్చరిస్తూ గ్రామంలో వేశాడు. ఇటీవల చింత సురేశ్ సాయంతో రైతును భయపెట్టి రూ.3 లక్షలను ఏటూరునాగారం బస్టాండ్‌కు తీసుకురమ్మని బెదిరించాడు. అంత పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేనని, కొంతమాత్రమే ఇస్తానని రైతు బతిమిలాడాడు. చివరికి రూ.60 వేలను కవరులో పెట్టి ఏటూరు నాగారం బస్టాండ్‌కు వేరే వ్యక్తి ద్వారా పంపాడు. ఈ నెల 16న సదరు వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వెంకటేశ్ డబ్బులతోపాటు రామన్నగూడెం మీదుగా మల్లూరువైపునకు పరార్ కాగా చింత సురేశ్ పట్టుబడ్డాడు. బుధవారం ఏటూరునాగారం అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకటేశ్ పట్టుబడ్డాడు. వెంకటేశ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక ఆపరేషన్‌కు కృషిచేసిన ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, పస్రా ఎస్సై ఎస్కే యాసిన్‌ను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిమ్ కార్డులు మార్చుతూ బెదిరింపులు..వెంకటేశ్, సురేశ్ తమ ఫోన్లో నిత్యం సిమ్‌కార్డులు మారుస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడేవారని ఏఎస్పీ తెలిపారు. ఇటీవల నియోజకవర్గంలో మావోయిస్టుల ప్రభావం పెరుగుతూ వస్తుండడంతో వీరు ధనార్జనే లక్ష్యంగా ముఠాగా ఏర్పడి పనిచేశారన్నారు. వెంకటేశ్ నుంచి మావోయిస్టుల పేరుతో ఉన్న లెటర్ప్యాడ్లు, ఓ డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకొని ఏటూర్‌నాగారం స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంట ఏటూరు నాగారం సీఐ రఘుచందర్, పస్రా ఎస్సై ఎస్కే యాసిన్ ఉన్నారు. -
వ్యాపారులను బెదిరిస్తున్న నకిలీ నక్సలైట్ అరెస్ట్
శ్రీకాకుళం : నక్సలైట్ అని చెప్పుకుని వ్యాపారులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బామినిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఓ వ్యక్తి నక్సలైట్ అని చెప్పి తనకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను బెదిరిస్తుండేవాడు. అయితే, విషయం తెలుసుకున్న బామిని పోలీసులు ఆ నకిలీ నక్సలైట్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 వేల నగదుతో పాటు 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ నక్సలైట్ల అరెస్టు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : నగరాల్లో ప్రముఖ వ్యక్తులను నక్సలైట్లమని బెదిరించి, లక్షల రూపాయలను వసూలు చేసిన, పాత నేరస్తులైన ముగ్గురు నకిలీ నక్సలైట్లను రాజమండ్రి అర్బన్‌జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 4 సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతానికి చెంది న పాత నేరస్తుడు మొహమ్మద్ రఫీవుద్దీన్ అలియా స్ జాకిర్, అతడి రెండో భార్య జమీదున్నీసాబేగం అలియాస్ షకీలా సోహానీ తాము నక్సలైట్లమని ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేస్తుం టారు. ఇంటర్ చదివిన జాకిర్ 1993 నుంచి 1999 వరకు గల్ఫ్, రియాద్, 2001 నుంచి దుబాయ్‌లోను పనిచేశాడు. 2006-07లో కరీంనగర్ జిల్లాలో హా ర్వెస్ట్ ట్రాక్టర్ కొని, వ్యవసాయ పనులకు అద్దెకివ్వడంతో నష్టం వచ్చింది. తన సహచరులతో కలిసి నక్సలైట్లుగా బెదిరించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకు డాక్టర్లు, వ్యాపారులు, సంపన్నుల ఫోన్ నంబర్లు సేకరించారు. నకిలీ అడ్రస్సులతో సిమ్‌కార్డులు తీసుకున్నారు. 2008 నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ సిటీ, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేశారు. కొన్ని కేసుల్లో పట్టుబడి జైలుకు కూడా వెళ్లారు. మరో నిందితుడు మొహమ్మద్ అన్వర్‌షరీఫ్ మాత్రం కాబోయే అల్లుడు కావడంతో మొదటిసారిగా వీరితో కలి శాడు. ఈ నెల 16న రాజమండ్రికి చెందిన బిల్డర్ మన్యం ఫణికుమార్‌కు జాకిర్, షకీలా సోహానీ, అన్వర్‌షరీఫ్ కలిసి సుదర్శన్ పేరుతో ఫోన్ చేశారు. నక్సలైట్లమని చెప్పి.. పేలుడు పదార్థాలు కావాలని అతడిని బెదిరించారు. లేనిపక్షంలో రూ.రెండు లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఫణికుమార్ రూ.60 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి సూచన మేరకు లాలాచెరువు-ఆటోనగర్ మధ్య ఓ ప్రదేశంలో ఆ నగదు పెట్టాడు. రాజమండ్రిలోని ఓ కార్డియాలజిస్ట్ వద్ద రూ.లక్ష, కాకినాడలోని రాచూరి రాఘవేంద్రరావు అనే వ్యక్తి ని బెదిరించి రూ.70 వేలు, విశాఖపట్నంలోని డాక్టర్ కామేశ్వరరావును బెదిరించి రూ.లక్ష కాజేశారు. విశాఖపట్నంలోనే మరో ముగ్గురిని బెదిరించారు. నింది తులు ఈ నెల 17న రాత్రి తునిలో బస చేసి, 18న ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు. విజయవాడ వరకు వెళ్లిన తర్వాత రాజమండ్రికి చెందిన బి ల్డర్ ఫణికుమార్‌కు ఫోన్ చేశారు. రూ.రెండు లక్షలు అడిగితే రూ.60 వేలే ఇచ్చావని, మిగిలిన సొమ్ము ఇవ్వాలని బెదిరించారు. దీంతో రూ.40 వేలు ఇచ్చేందుకు ఫణికుమార్ ఒప్పుకున్నాడు. ఈ క్రమం లో నిందితులు రాజమండ్రి వచ్చారు. ఈ మేరకు ఫణికుమార్ స్థానిక ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు. అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్ మూర్తి పర్యవేక్షణలో క్రైం డీఎస్పీ పి.ఉమాపతివర్మ, తూర్పు మండల డీఎస్పీ ఆర్.సత్యానందం,ప్రకాష్‌నగర్, కడియం,క్రైం ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, కె.వరప్రసాద్, జి.కెనెడీ, ఎస్.గంగరాజు వలపన్నారు. రూ.40 వేలు తీసుకునేందుకు రావాలని ఫణికుమార్ చెప్పగా, ఆటోనగర్-లాలాచెరువుల మధ్య డబ్బు పెట్టాలని జాకిర్ సూచించాడు. నిందితులు కారులో దివాన్‌చెరువు రోడ్డులోకి రాగానే, పోలీసులను గమనించి కోరుకొండలోని ఖాళీ ప్రదేశంలో కారు విడిచి పరారయ్యారు. ఆదివారం రాజమండ్రిలోని ఓ వైద్యుడిని బెదిరించేందుకు వచ్చిన ముగ్గురు నిందితులను ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అరెస్టు చేశారు. వీరు విడిచిపెట్టిన కారులో రూ.2.70 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రవికుమార్ మూర్తి రివార్డులు ప్రకటిం చారు.