మాట్లాడుతున్న ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజ్, స్వాధీనం చేసుకున్న తపంచ, కత్తులు
వరంగల్ క్రైం : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఛతీస్‌ఘడ్ రాష్ట్రం భూపాలపట్టణం తారుడు గ్రామానికి చెందిన పులాయిల భానయ్య నక్సలైట్ పేరు చెప్పి నగరంలో డబ్బు వసూళ్లు చేయడానికి వస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో భానయ్యను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజ్ తెలిపారు. వివరాలు ఏటురునాగారంలో రాక్ స్పోకెన్ ఇంగిష్ తరగతులను నిర్వహిస్తున్న భానయ్య కోచింగ్ సెంటర్‌లో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నగరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.15 వేలు పెట్టి తపంచను కొనుగోలు చేసినట్లు డేవిడ్‌రాజ్ తెలిపారు.
నక్సలైట్ పేరు చెప్పి తన ఇంట్లో ఉన్న తపంచ, రెండు కత్తులు తన కళాశాల బ్యాగులో పెట్టుకొని హన్మకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజ్, హన్మకొండ ఎస్సై ప్రవీన్‌కుమార్‌లు సిబ్బందితో భానయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భానయ్యను విచారించగా తాను వేసుకున్న ప్రణాళికను ఒప్పుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు.
తపంచ,కత్తులు స్వాధీనం
నిందితుడు భానయ్య నుంచి ఒక తపంచ, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డేవిడ్‌రాజ్ తెలిపారు. ఎలాంటి సంఘటన జరుగకుండా నిం దితుడిని సకాలంలో అరెస్టు చేయడంలో జాగ్రత్త పడిన క్రైం అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజ్, ఎస్సై ప్రవీన్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్‌లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment